Tuesday 1 July 2014

అత్యధ్బుత పురాతన కట్టడాలు:: ప్రపంచ వారసత్వ సంపద:: చాంద్ బావొరి:: దిగుడు మెట్ల బావి:: రాజస్థాన్


చాంద్ బావోరీ అంటే చాలా మందికి తెలియక పోవచ్చు..

ఇది రాజస్థాన్ లోని ఒక దిగుడుబావికి సంబంధించిన పురాతన మెట్ల బావి అని చెప్పవచ్చు..

కానీ దీని నైపుణ్య శైలి... ప్రాచీనత దీనికి ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేర్చే విధంగా చేసింది...

ఇది మొత్తం పదమూడు అంతస్థుల (ముప్పై మీటర్ల ) లోతైన నిర్మాణం...

 ఎందుకంటే ఇది బావి మరి...

దీనిలో దిగటానికి 3500 మెట్లు ఉంటాయి..
అవి విభిన్నమైన కళాకృతిని సంతరించుకుని ఉంటాయి...

 రాజస్థాన్ అంటే ఎడారి.. ఇక్కడ తాగునీటి ఎద్దడి ఎక్కువగా ఉంటుంది..
 దేశ ప్రజల దాహార్తిని తీర్చడానికి , కొంత సేపు సేద దీరే విధంగా,

ఏదైనా చిన్ని చిన్న వేడుకలకు సైతం వేదికగా ఉండగలిగేలా.. ఈ కట్టడం సాగుతుంది...

 దీనిని క్రీ.శ.800 నుండి 900 సంవత్సరం మధ్యలో రాజా చంద్ర(నికుంభ రాజ్యం)
ఈ బావి ప్రస్తుతం రాజస్థాన్ లోని ఆభానేరి అనే ఊరిలో ఉంది..
హర్షిద్ధి మాత అనే రాజస్థానీయుల కులదైవమైన  శక్తి ఆలయం ఇక్కడ ఉంది.. ఆ మాత కే ఈ స్థలాన్ని అంకితమిచ్చారు...

http://maps.google.com/maps?ll=27.005318,76.607395&z=16&t=h&hl=en-US&gl=US&mapclient=embed&q=27%C2%B000%2725.9%22N%2076%C2%B036%2724.5%22E
మర్యాద: వికీపీడియా

Post a Comment

Whatsapp Button works on Mobile Device only