Friday, 4 July 2014

“నీవు బ్రతికుండేది కేవలం పది రోజులే...... అని తెలిసిన రోజున ....ఏం చేస్తారు....!!" కొందరి జీవితాలలో జరిగిన యథార్థ ఇతివృత్తం


వాస్తవంగా జరిగిన ఈ కథంతా ఒక అత్యవసర సేవా విభాగం(ఐ.సి.యు) లో జరిగింది.
అత్యవసర సేవా విభాగంలో పనిచేస్తున్న ఒక నర్సు ఇంటర్వ్యూలో భాగమే మన కథ..
కానీ ప్రతి ఒక్కరి జీవిత పార్శ్వాలను తడిమినట్లవుతుందని ఆంగ్లమూలంలో ఉన్న దానిని తెలుగులోకి స్వేచ్ఛానువాదం చేసాను!! పూర్తిగా చదవటం మిస్ కావద్దు..
"అది నేను అత్యవసర సేవా విభాగంలో నా ఉద్యోగాన్ని ప్రారంభిస్తున్న రోజులు..
నేను రోగుల పట్ల చూపిస్తున్న ప్రేమ, అంకితభావం నన్ను ఆ సేవావిభాగంలో పనిచేసే అర్హతను సంపాదించిపెట్టాయి.. భయంభయంగానే కాలు మోపాను.... అక్కడ మొత్తం పది మంది రోగులు ఉన్నారు.. అందరూ జీవితంలో చివరిదశలో ఉన్నవారే.. ప్రతి ఒక్కరూ కోటీశ్వరులే... అందుకే అక్కడ ఉద్యోగం కత్తి మీద సాము మరి... ఇవేవీ నా మదిలోకి రానీయకుండా జాగ్రత్తగా సేవ చేయడం ప్రారంభించాను... కొన్ని రోజుల్లో వారికి నా మీద గురికుదిరింది... వారు తమ చివరి క్షణాలలో తాము చేసిన తప్పులను నాతో పంచుకోవడం మొదలెట్టారు...వారి అనుభవాలను వారి మాటలలోనే మీముందుంచుతున్నాను

మొదటి వ్యక్తి: 

 నేను అందరినీ సంతృప్తి పరచాలనే తాపత్రయంతో ఎవ్వరేమి చెప్పినా ఎదురు చెప్పలేక.. ఆ పని చేయలేక.. చాలా వత్తిడి కి లోనయ్యాను.. ఒకసారి ''నో ''అని చెపితే సరి పోయే దానికి చాలా బాధలు అనుభవించాను.. కానీ ఇప్పుడు అందరి దగ్గర అసమర్థుడు అనే బిరుదును కూడా తీసుకుని... రోగగ్రస్థుడనయ్యానని తన అనుభవాలను పంచుకున్నాడు..

 రెండవ వ్యక్తి: 

“ప్రతి మనిషికి కొన్ని స్వప్నాలుంటాయి.. కొన్ని లక్ష్యాలుంటాయి.. ఏది సాధ్యం ఏది అసాధ్యమనేది మనకు తెలిసుండాలి... జీవితంలో ఎప్పటికప్పుడు మన లక్ష్యసాధనలో ఎక్కడున్నాం అనేది తెలుసుకుంటూనే జీవితాన్ని అనుభవించాలి..కానీ నేను సాధ్యంకాని లక్ష్యాలకై పోరాడి పోరాడి మానసికంగా చాలా ఒత్తిడులకు లోనై ఈ వ్యాధిని తెచ్చుకున్నాను"

మూడవ వ్యక్తి: 

నా జీవితం ఒక ట్రేడ్ మిల్ పై పరుగులాగానే సాగింది... మనం ట్రేడ్ మిల్ పై పరిగెత్తే టపుడు ఆయాసం, వగడ్పు వస్తాయి కానీ ఒక్క అడుగు కూడా ముందుకువేయలేం.. ఇలాగే నా పురోభివృద్ధి లేదు కానీ ఎండమావులకై పరుగులో తన స్నేహితులను.. బంధువులను ఎవరినీ తోడుగా నిలుపుకోలేకపోయాను... .. ఇప్పుడు తుది దశలో ఒకసారి వెనక్కు తిరిగి చూసుకుంటే ఏం కోల్పోయానో తెలిసింది.. కానీ చేయాల్సింది ఏమీ లేకపోయింది..."

నాలుగవవ్యక్తి: 

తన జీవితమంతా ధనార్జనే లక్ష్యంగా సాగింది... తన భార్య, పిల్లలు ఇవేవీ పట్టించుకోలేదు.. తన యవ్వనమంతా ధారపోసాడు.. తన పిల్లల బాల్యాన్ని, వారి ఆటపాటలను, ముద్దుమురిపాలను అన్నింటినీ కోల్పోయాడు.. తన ఇష్టసఖి సాంగత్యానికి దూరమయ్యాడు... ఇంతా చేసి తాను ఎవరి కోసమైతే సంపాదిస్తాడో వారే తనను ఏవగించుకొనేసరికి తన మనస్సు మొద్దు బారిపోయి తట్టుకోలేక రోగగ్రస్థుడయ్యాడు..

ఐదవ వ్యక్తి: 

నేను సంతోషంగా ఉన్నాను.. నాలక్ష్యాలనన్నిటినీ నెరవేర్చుకుంటూ.. అందరితో వీలైనంత ఆనందంగా గడుపుతాను..కానీ నేను మోటారు బైక్ నడిపేటపుడు తగిన జాగ్రత్తలు తీసుకోక పోవడం వలన చిన్న ప్రమాదం జరిగింది.. రేపు డిశ్చార్జ్ అవుతానని చాలా ధృడ సంకల్పంతో చెప్పాడు...

ఈ పై అయిదుగురి అనుభవాలను విన్న నాకు ఒకటి అర్థం అయింది..
1. జీవితం అంటే ట్రేడ్ మిల్ పై పరుగు కాదు...
2.మనకు ఇష్టం లేని దానిగురించి ఎదుటివారికి జాగ్రత్తగా వివరించాలి కానీ దాని కోసం ఎక్కువగా బాధ పడకూడదు...
3. సంపాదనే జీవితం కాదు... విలువలు ప్రధానం...
4. జీవితంలో లక్ష్యాలు ఉండాలి.. కానీ అందుకోలేని లక్ష్యాల కోసం జీవితాన్ని పణంగా పెట్టరాదు...
5. జీవితంలో ఆనందంగా ఉండాలనుకోవడం కూడా ఒక నిర్ణయమే...
6. మన లక్ష్యాలు, ఆశయాలు, ఎంపికలు దేనినైతే ప్రేరేపిస్తాయో అలాగే మన జీవితం గడుపుతాం.. ఇవేవీ మనలో ని ఆనందాన్ని త్రుంచకుండా.. బంధాలను, అనుబంధాలను పెంచేవిధంగా ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తే.. సుఖప్రదమైన.. ఆనందమైన జీవితాన్ని మనం పొందవచ్చు...

జీవితంలో తాము జీవించేది కేవలం పది రోజులే అని తెలిసినప్పుడు ఎలా ప్రవర్తిస్తామో అది ఎప్పటికప్పుడు మనం అమలు పరచగలుగుతే మన జీవితంలో అన్ని రకాల ఒత్తిడుల నుండి తప్పించుకోవచ్చు..

Heart touching stories in telugu

Post a Comment

Whatsapp Button works on Mobile Device only