అయోధ్యా మధురా మాయా
కాశీ కాంచీ అవంతికా
పూరీ ద్వారావతీచైవ
సప్తైతే మోక్షదాయకా!!
దేశంలోని ఏడు మోక్షదాయక క్షేత్రాల్లో పూరీ ఒకటి.
సోదరుడు బలభద్రుడితో, సోదరి సుభద్రతో కలిసి జగన్నాథుడు ఇక్కడ కొలువయ్యాడు.
స్వామి ఎప్పటి వాడో, ఎలా వెలిశాడో చెప్పడానికి ఖచ్చితమైన ఆధారాలు లేవు. మత్స్య, స్కంధ, విష్ణు, వామన పురాణాల్లో ఆ క్షేత్ర మహత్యాన్ని వివరించారంటే.. అత్యంత ప్రాచీనమె అయి ఉండాలి. తొలుత, ఇంద్రద్యుమ్నుడనే మహారాజు ఈ ఆలయాన్ని కట్టించాడని ఐతిహ్యం. చరిత్ర పరంగా చూస్తే.. పన్నెండో శతాబ్దంలో రాజా అనంతవర్మ చోడగంగదేవ్ హయాంలో జగన్నాథస్వామిఆలయ పునర్నిర్మాణం మొదలైంది. ఆయన ముని మనవడు అనంగభీమ్ దేవ్ ఆ మహత్కార్యాన్ని పూర్తి చేశాడు.
జగన్నాథుడు గిరిజనుల ఇలవేల్పు. సవర వరాల మూట... నీలమాధవుడనే పేరుతో పూజలందుకునేవాడు.. అప్పట్లో స్వామి దట్టమైన అడవిలోని ఓ రహస్య ప్రదేశంలో ఉండే వాడట! గిరిజన రాజు విశ్వావసుడు మూడో కంటికి తెలియకుండా వెళ్ళి పూజలు చేసే వాడట. ఆ సంగతి తెలుసుకున్న ఇంద్రద్యుమ్నుడు, రహస్యాన్ని ఛేదిమ్చమంటూ విద్యాపతి అనే యువకుడిని నియమిస్తాడు. అతను విశ్వావసుడి కూతుర్ని ప్రేమించి పెళ్ళాడతాడు. మామ వెంట్ గుడికి వెళ్తానని పట్టుబడతాడు. విశ్వావసు అల్లుడి కళ్ళకుగంతలు కట్టి తనతోతీసుకెళ్తాడు. విద్యాపతి తెలివిగా ఆ మార్గంలో ఆవాలు జారవిడుస్తాడు. అవి కాస్తా మొక్కలై.. ఓ దారిని ఏర్పాటు చేస్తాయి.. ఇంకేముంది, ఆలయ రహస్యాన్ని ఇంద్రద్యుమ్నుడికి చేరవేస్తాడు. ఆ రాజు వెళ్ళే సరికి విగ్రహాలు మాయమైపోతాయి. దీంతో ఇంద్రద్యుమ్నుడు బాధపడిపోతాడు. స్వామి కటాక్షాన్ని కోరుతూ యజ్ఞ యాగాలు చేస్తాడు. ఓరోజు జగన్నాథుడు కలలో కనిపించి.. సముద్రంలోంచి ఓ వేప కర్ర కొట్టుకొస్తుంది, దాంతో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు, రాజు మహదానందంగా వెళ్ళి కర్రను తీసుకొస్తాడు, కానీ, విగ్రహ నిర్మాణానికి ఎవరూ ముందుకురారు. దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి వేషంలో వచ్చి ఆ బాధ్యత తీసుకుంటాదు. కాకపోతే, ఏకాంతంగా విగ్రహాల తయారీలో నిమగ్నం అవుతాననీ, పని పూర్తయి తాను స్వయంగా బయటికి వచ్చే వరకూ ఎవరూ తన గదిలోకి రాకూడదనీ షరతు విధిస్తాడు. కనీ రణి తొందరపెట్టడంతో ఇంద్రద్యుమ్నుడు వెళ్ళి తలుపులు తెరుస్తాడు.. మరునిమిషం శిల్పి మాయమై పోతాడు. ఆ అసంపూర్ణ విగ్రహాల్ని ఏం చేయాలో తోచక.. బ్రహ్మను ప్రార్థిస్తాడు రాజు. స్వామ్ ఆ రూపంలోనే పూజలు అందుకుంటాడని బ్రహ్మ ప్రకటిస్తాడు.
కాబట్టే, జగన్నాథస్వామి కి అభయహస్తం, వరదహస్తం కనిపించవు.
కళ్ళు మాత్రం పెద్దపెద్ద గా ఊంటాయి.. జగన్నాథస్వామి ఆలయం వేయి ఎకరాల సువిశాల ఆవరణ్. ఆలయ ప్రాంగణం శంకాన్ని పోలి ఉండడంతో .. శంఖ క్షేత్రమనీ పేరొచ్చింది. ఇక్కడ, జగన్నాథుని ప్రసాదానికి ఎంతో విశిష్టత ఉంది. విష్ణుమూర్తి పొద్దున్నే రామేశ్వరంలో స్నాన సంధాఅదులు ఆచరిస్తాడని.. బదరీ క్షేత్రంలో ఫలహారం పుచ్చుకుంటాడని, బధ్యాహ్న భోజనానికి పూరీ చేరుకుంటాడని, రాత్రి బస ద్వారకలో అని ఐతిహ్యం. అందుకే, స్వామివారికి అరవై నాలుగు పిండ్ వంటలతో నైవేద్యం పెడతారు. రోజూ కొన్ని వేల మంది భక్తులు స్వామి ప్రసాదాలను స్వీకరిస్తారు. అధిక ఆషాఢం వచ్చిన సంవత్సరంలో నవకళేబరోత్సవం నిర్వహిస్తారు. అంటే అప్పటిదాకా ఉన్నమూల విరాట్టుల్ని ఖననం చేసి కొత్త మూర్తుల్ని ప్రతిష్టిస్తరు. దారువు ఎంపిక నుంచి మూర్తులకు రంగులు అద్దడం దాకా అంతా శాస్త్రోక్తంగా జరుగుతుంది. మహారథోత్సవం: రథోత్సవమంటె జగన్నథ రథోత్స్వమే!స్వామి రథోత్సవం పేరు ‘నందిఘోష’ పదహారు చక్రాలతో మేరువును తలపిస్తుందా తేరు.
రథ రక్షకుడు గరుత్మంతుడు. బలభద్రుడి రథం పేరు ‘తాళధ్వజం’ సుభద్రాదేవి రథాన్ని ‘పద్మధ్వజం’ అని వ్యవహరిస్తారు. రథోత్సవానికి ఓరోజు ముందు ఆలయ సింహద్వారం ముందు వాటిని నిలబెడతారు. ఆషఢ శుద్ధ విదియనాడు ప్రాతఃకాల పూజలు పూర్తిచేసి.. పూజారులు విగ్రహాల్ని కదిలిస్తారు. ఊరేగింపుగా రథాలున్న చోటికి తీసుకొస్తారు. ఆ సమయాన్నికి పూరీ రాజు పల్లకీలో వచ్చి.. బంగారు చీపురుతో రథం లోపలి భాగాన్ని శుభ్రం చేస్తాడు. జగన్నాథుడూ బలభద్రుడు సుభద్రాదేవి.. రథారూధులైన్ తర్వాత ‘జై జగన్నథ’ నినాదాలు మిన్నంటుతాయి. రథయాత్ర ప్రారంభమవుతుంది.
అదో ఆనందం! అదో పారవశ్యం! పూరీ వైకుంఠపురిని తలపిస్తుంది.ఏటు చూసినా దేవదేవుని నామ స్మరణమే..సర్వం జగన్నాథమే! రథాలు మూడు కిలోమీటర్ల దూరంలోని గుండీచాదేవి ఆలయానికి చేరడానికి పన్నెండు గంటల్ అసమయం పడుతుంది! పది రోజుల తర్వాత మళ్ళీ స్వామి స్వస్థానానికి చేరుకుంటాడు. భక్త జనానికి నిత్య దర్శనం ఇస్తాడు..
ఈనాడు దిన పత్రిక సౌజన్యంతో
Post a Comment