Sunday 29 June 2014

చక్కని జీవితం మీరు భవిష్యత్తులో అనుభవించాలని ఉందా?? దానికి చక్కని ఆర్థిక ప్రణాళిక అవసరం..ఒక పదివేల రూపాయల ఉద్యోగస్థుడు ఏ విధంగా ప్లాన్ చేసుకోవచ్చో చిన్న వివరణ??

చక్కని జీవితం మీరు భవిష్యత్తులో అనుభవించాలని ఉందా??

దానికి చక్కని ఆర్థిక ప్రణాళిక అవసరం.. దానికై నేను అవలంబించిన సూత్రాలను మీతో పంచుకుంటాను.. ఆచరించేదానికి ప్రయత్నిస్తే కనీసం ఒక ఐదు సంవత్సరాల తర్వాత మీ ఆర్థిక ప్రగతి ఒక ఆకారం సంతరించుకుంటుంది.. నేను చెబుతున్నది.. సున్న స్థితి నుండి మొదలుపెట్టడం ఎలా అని??
చాలా మంది కొద్దో గొప్పో సంపాదించిన వాళ్ళు ఇంకొంచెం మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు..

మొదటి మెట్టు: (తప్పని సరి): 

మీరు ఉద్యోగస్థులయితే మీ నెల జీతమునకు మూడు రెట్ల ఆదాయం అంటే ఒక మూడు నెలల ఒక నిథిని మీరు మొదట ఏర్పాటు చేసుకోండి.. అంటే మీ నెల జీతం ఉదాహరణకు పది వేలు అనుకోండి.. ఒక ముప్పై వేల రూపాయల నిధి అన్నమాట.. ఇది ఎందుకంటే ఒక వేళ మనకు జీతం రాని సమయంలో మన బ్రతుకు తెరువుకు ఉపయోగపడుతుంది.. నా వరకు ఇది అతి ముఖ్యమైనది... (మూడు నెలల తర్వాత దీనిని మనం ఒక పెట్టుబడిగా ఉపయోగించవచ్చు.. దీని నుండి కూడా ఆర్జన మొదలవుతుందని గుర్తుంచుకోవాలి) 
రెండవ సూత్రం: స్వల్ప కాలిక మదుపు a.Chits:
మొదటి సూత్రం అయిపోయిన తర్వాత మాత్రమే దీనిని వాడాలి... 
మన జీతంలో తప్పని సరిగా ఇరవై శాతాన్ని దీర్ఘ కాలిక ప్రయోజనాలకై మదుపు చేయాలి..
ఇది వీలైనంత వరకు చిట్ ఫండ్ లాంటిదయితే మంచిది..
మనకు ఒక బాధ్యత ప్రతినెల గుర్తుచేస్తూ ఉండాలి..
మరియు ఈ ప్రణాళిక ఒక కనీసం ఒక యాభై నెలల దైతే మరీ మంచిది..
ఉదాహరణకు రెండువేల రూపాయల మదుపుతో 50 నెలల తర్వాత మనకు లక్షరూపాయల మొత్తం వచ్చే విధంగా ప్లాన్ చేసుకోవాలన్నమాట... మొదట్లో కొంచెం కిస్తీ తక్కువగానే ఉంటుంది.. కానీ పోను పోను ఎక్కువవుతుంది.. అది పెరిగిన మన జీతంతో సరి పోతుంది...కాబట్టి ఎక్కువ బాధ ఉండదు..

 బి. భవిష్య నిధి: దీర్ఘ కాలిక మదుపు:

మన జీతంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పియఫ్ (భవిష్యనిధి)కట్ అయ్యే విధంగా చూసుకోవాలి..
ఎందుకంటే ఇది అతి దీర్ఘ కాల ప్రయోజనం..
మనకు తెలియకుండానే నెలకు పదిహేను శాతందాకా మదుపు అవుతుంది. 
మనం రిటైర్ అయిన తర్వాత దీని ఉపయోగం చాలా ఉంటుంది. అందుకే ఈ భవిష్యనిథిని ఎట్టి పరిస్థితుల్లో ఉపసంహరించుకోవద్దు..

 సి. కార్మిక భీమా / మెడిక్లెయిమ్ పాలసీ:

ఇ.యస్.ఐ: ఇది కార్మికులకు ఒక వరమని చెప్పవచ్చు.. దాదాపు ఆరు లక్షల రూపాయల శస్త్రచికిత్స వరకు ఇందులో చేసే సదుపాయం ఉంది.. చిన్నా పెద్దా ఆరోగ్య సమస్యలకు డిస్పెన్సరీ ఉంటుంది.. 

 ఇ.యస్.ఐ లేని వారికి: 

ఆరోగ్య భీమాకై టెర్మ్ పాలసీ లు తీసుకోవడం మంచిది.. మనకు ఒక పది సంవత్సరాలలో ఒక్క సారైనా ఆపద రావాలనుకోకూడదు.. కానీ కీడెంచి మేలెంచడంలో తప్పు లేదు.. మీ ఆదాయమునకు తగినట్లు ఇన్సూర్ చేయండి...

 d. జీవిత భీమా: 

ఇది వీలైనంత వరకు మనం మదుపుచేసినది మనకు ఎప్పుడైనా వచ్చే విధంగా మరియు దీర్ఘకాలిక పెట్టుబడిలా .. ఒక టెర్మ్ పాలసీలా అన్ని విధాలా ఉండే ఒక పాలసీ తీసుకొంటే మంచిది.. ఉదాహరణకు నేను బజాజ్ అలయంజ్ లో పాలసీ తీసుకున్నాను.. సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు కడితే మనకు భీమా పది లక్షలు మరియు క్రిటికల్ ఇ ల్ నెస్ ప్రయోజనం ఉన్న పాలసి తీసుకున్నాను.. ఇప్పటి వరకు కట్టినది తొంభై వేలు.. ఐదు సంవత్సరాలు పూర్తి అయింది.. అప్పుడప్పుడు వీలైనంత వరకు కట్టుకోవచ్చు.. మన పాలసీ కంటిన్యూ అవుతుంది.. మరియు.. స్టాక్ మార్కెట్ ఎక్కువున్నపుడు మదుపు మార్చుకొని లాభం పొందవచ్చు.. తిరిగి మదుపు చేసుకోవచ్చు.. ఇక్కడ మీరు నెలకు ఐదువందలు అయ్యేవిధంగా ప్లాన్ చేసుకోండి.. 

 ఇప్పుటికి మీ మొత్తం అయిన సర్దుబాటు: 
పి.యఫ్ -- పదిహేను శాతం
ఇన్స్యూరెన్స్ పాలసీ- ఐదు శాతం 
చిట్ - ఇరవై శాతం
ఇంటి అద్దె- పదిహేను శాతం(మించరాదు)

ఇప్పుడు మీకు మిగిలిన మొత్తం: నాలుగువేల ఐదు వందలు..

ఇప్పుడు మనకు అత్యవసరాలన్నీ పూర్తయినాయి... పైన పేర్కొన్న అత్యవసరాలకు పోను మిగిలినది జాగ్రత్తగా వాడుకోగలుగుతే నిజంగా కొన్ని రోజులలో ఆపదలనుండి గట్టెక్కినట్లే.. ఎందుకంటే చాలా మందికి సమస్యలు అనుకోకుండానే వస్తుంటాయి.. దానిని సంసిద్ధంగా ఉండగలిగితేనే నిలదొక్కుకుంటారు...

నేను ఇక్కడ ఉదహరించినది..
 భార్యా+భర్త ఇద్దరే అయితే పైనది సరిపోతుంది..
 మనకు ఇప్పుడు ఆహారానికి నెలకు(ఇద్దరికి) రెండు వేల కంటే(బియ్యం,పాలు, గ్యాసు, దినసరి వెచ్చాలు మొదలగునవి ఎన్నైనా సరే) ఎక్కువ ఖర్చు లేకుండా చూసుకోవాలి..
బియ్యం,పప్పు ల్లాంటివి సీజన్ లో కొన్ని సరుకులు కొని దాచుకోవలసి ఉంటుంది..

ఈ రోజుల్లో పది వేల జీతంతో బ్రతకడం దుర్భరమే.. 

కానీ మన ఎంజాయ్ మెంట్ ను కూడా లెక్క వేసుకోవాలి మరి..
 అందుకే నెలకు ఒక సారి భార్యతో విహార యాత్ర ప్లాన్ చేసుకోవాలి..
దీని బడ్జెట్ ఐదు వందల రూపాయలు..
 జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఏదైనా సాద్యమే...
 గుర్తుంచుకోండి ధన సంపాదనే జీవితం కాదు..
 కానీ జీవించడానికి ధనం తప్పనిసరిగా కావాలి...
 ఎక్కువ సంపాదన ఉన్నవారు ధనవంతులు కారు..
 ఉన్నదాంట్లో సంతృప్తి పడి ..
ఎంతో కొంత మిగిలించుకున్నవాడే ధనవంతులు..

Post a Comment

Whatsapp Button works on Mobile Device only