ఒక గ్రామంలో దిలిప్ అనే రైతు ఉండే వాడు.. తను తన పొలంలో దుక్కి దున్నుతుండగా అతని చేతి గడియారం పడిపోయింది... ఇది తను గమనించుకోలేదు.. దున్నటం అంతా అయిపోయిన తర్వాత చూసుకుంటే తన చేతి గడియారం పడిపోయిన సంగతి తెలుస్తుంది.. దాని విలువ ఎంతైనా అది తన భార్య తనకు మొదటి సారి కొని బహుకరించిన గడియారం అందుకే అది అతనికి చాలా ముఖ్యం.. అతను చాలా సేపు వెతికాడు.. పూర్తిగా నిరాశలో కూరుకు పోయే సమయాన.. తన ప్రక్క న పొలంలో ఆడుకుంటున్న చిన్న పిల్లలు చాలా మంది కనపడతారు.. అప్పుడు దిలీప్ వారి దగ్గరకు వెళ్ళి పిల్లలూ!! నా వాచ్ పడి పోయింది... ఎవరైనా వెదికి ఇచ్చిన వారికి చాలా మంచి బహుమతి ఇస్తాను అని చెబుతాడు... బహుమతి మీద ఆశపడిన పిల్లల సమూహం మొత్తం దానికోసమై వెదకులాట ప్రారంభించారు... అలా చాలా సేపు వెదికారు కానీ వారికి కూడా కనపడలేదు...సమూహంలోని ఒక్కొక్క బాలుడు జారుకోవడం ప్రారంభించారు.....ఇప్పుడు దిలీపుడికి నిజంగా దిగులు పట్టుకోవడం ప్రారంభించింది...
ఇంతలో ఆ సమూహంలో మిగిలిన ఒక చిన్న బాలుడు... మామయ్యా!! నాకు ఇంకొక అవకాశం ఇస్తావా.. మరొక్క మారు ప్రయత్నిస్తాను అని అడుగుతాడు.. అతని ఉత్సాహం పట్టుదలను చూసిన దిలీపుడికి పోయేదేముంది ప్రయత్నించనీ అనుకుని సరే వెదుకు బాబూ.. అని చెపుతాడు... ఒక అయిదు నిమిషాల తర్వాత ఆ పిల్లవాడు చేతిలో వాచితో అక్కడికి వస్తాడు... దానిని చూసిన ఆశ్చర్యానందాలతో.. బాబూ నీవు దీనిని ఎలా కనుగొన్నావు అని అడుగుతాడు... ఆ బాలుడు... అంకుల్!! నేను ఏం చెయ్యాలా అని కళ్ళు మూసుకుని ప్రశాంతంగా కొద్ది సేపు ఉన్నాను... ఆ ప్రశాంతతలో గడియారం యొక్క టిక్!! టిక్!! ధ్వని వినపడింది.. అది ఏ వైపు నుండి వస్తుందా అని చూస్తూ.. చూస్తూ.. చివరికి సాధించాను... అని చెప్పాడు...
నీతి:
ఏసమస్య ఎదురైనా సరే.. సమస్య ఎంత పెద్దదైనా సరే... కళ్ళు మూసుకుని ప్రశాంత చిత్తంతో కొంత సేపు ఆలోచించినపుడు.. చాలా సమస్యలు పరిష్కారమవుతాయి... ప్రయత్నించి చూడడంలో తప్పేమీ లేదు కదా! మిత్రులారా!!
Post a Comment