Monday, 9 June 2014

నరుడి దృష్టికి నాపరాళ్ళు కూడా పగులుతాయి అనే సామెత ఎలా పుట్టుకొచ్చింది!!! వచ్చింది దాని వివరాలు:: LEPAKSHI Temple ::





ఈ చిత్రంలో చూస్తున్న ఈ శివలింగం లేపాక్షీ విరూపాక్ష ఆలయం లోని ఒక భాగం... ఈ లేపాక్షి కేత్రం మొత్తం సాళువ నరసింహరాయల కాలంలో నిర్మాణం జరిగింది.. మహోన్నతమైన శిల్పారాజములతో విలసిల్లే ఆలయమిది... దీనిని నిర్మించడానికి కొన్ని వందల మంది శిల్పకారులు అహర్నిశం శ్రమించేవారట... ఒక సారి వారు తమ మధ్యాహ్న భోజన విరామ సమయంలో భోజనానికి కూర్చున్నపుడు వారి అమ్మ బాబులు ఇంకా సమయముంది... కొన్ని నిమిషాలు ఆగండి అని అడుగుతుందట... ఈ కొద్ది సమయంలో ఖాళీగా ఉండడమెందుకు అని ఆ శిల్పకారులు ఒక ఏకశిలపై ప్రస్తుతం మీరు చూస్తున్న ఏడు పడగలతో కూడిన నాగప్రతిమ మరియు శివలింగాన్ని కొన్ని నిమిషాల వ్యవధిలో చెక్కేసారట!! భోజనం తయారీ అయిపోయింది రండి అని పిలుస్తున్న అమ్మకు ఈ సమయం లో మేము చేసిన పనిని చూడండి అని ఈ లింగాన్ని చూపుతారు శిల్పులు... ఆ అమ్మ ఇంత పేద్ధ విగ్రహాన్ని కేవలం నిమిషాలలో పూర్తిచేసారా!!!! అని దాని మీద దృష్టి పెట్టిందట... ఆ దృష్టికి ఆ నాపరాతి శివలింగం, నాగరాజ ప్రతిమ బీటలు వారుతుంది... ఒక బాణం మార్కు తో ఆ పగులు ఉన్న ప్రదేశాన్ని సూచించాను చూడండి!!!

అప్పటి నుండి నరుడి దృష్టికి నాపరాళ్ళు కూడా పగులుతాయి అనే సామెత పుట్టుకొచ్చింది!!!

కొస మెరుపేమిటంటే.. ఇంత పెద్ద శివలింగానికి సరిపడు నందిని తయారుచేయడానికి దాదాపు ఒక కిలోమీటరు దూరంలో ఉన్న ఒక చిన్న కొండను పూర్తిగా నందిగా మార్చారు..
 అంటే కొండ అంత నంది అది కూడా ఏకశిల...ఇది నిజంగా చూడడానికి చాలా అద్భుతమైన విషయం... నాకు చాలా మందికి ఈ లేపాక్షి నోట్ పుస్తకాల వలన ఈ నంది వలన లేపాక్షీ అనే ఊరు పరిచయమైంది కానీ.. నంది కంటే కూడా ఆలయం చాలా బావుంటుంది.. 
అసలు అంత పెద్ద ఏడు తలల నాగేంద్రుని శివుడికి పెద్ద నంది కావాలని అలా చెక్కారు... విరూపాక్ష ఆలయానికి ఈ నంది విగ్రహానికి దాదాపు కిలోమీటరు ఉంటుంది... మరియు నంది ముందు ఎలాంటి శివాలయం ఉండదు... 
నంది మరియు శివాలయం ప్రక్క ప్రక్కన ఉంటే ఇలా ఉంటుంది...
నేను ఉద్యోగ రీత్యా హిందూపురం పట్టణంలో దాదాపు ఏడు సంవత్సరాలు పనిచేసాను... చాలా సార్లు ఈ గుడికి వెళ్ళాను... ఈ గుడి మీద అంశాల వారీగా మరికొన్ని టపాలు ...

Story about Hanging pillar in Lepakshi...>>> click here<<<<<<


to watch lepakshi temple full video follow 👇👇👇👇👇


Post a Comment

Whatsapp Button works on Mobile Device only