Lepakshi temple - hanuman padam |
సీతమ్మవారి పాదం, లేపాక్షీ విరూపాక్ష ఆలయం:
రావణుడు సీతాదేవిని అపహరించేటపుడు జటాయువు అనే పక్షి రావణాసురిడిని తరుముతూ చాలా దూరం ప్రతిఘటించిన వృత్తాంతం తెలుసుకదండీ... రావణుడు ఎన్ని ప్రయత్నాలు చేసిననూ ఆ పక్షి వదలలేదు..
చివరికి గత్యంతరం లేక రావణుడు ఆ పక్షియొక్క రెండు రెక్కలు విరిచి అది తనను తరుమ లేని స్థితిలో సీతమ్మ వారిని ఎత్తుకెళ్తాడట... రాములవారు సీతమ్మ గురించి అన్వేషిస్తూ ఈ ప్రాంతానికి వచ్చేదాకా జటాయువు ప్రాణాలతోనే వారికోసం ఎదురుచూస్తూ ఉంటారట... రాములవారికి రావణుడి దురాగతాన్ని తెలిపి ప్రాణాలువిడుస్తారట జటాయువు...
ఆ సందర్భంలో శ్రీరాముల వారు జటాయువును లే... పక్షీ అని సంభోంధించినట్లుగాను..
అది కాలక్రమేణా లేపాక్షిగా మారిందని కథనం...
అందువలన ఈ ప్రదేశం రామాయణానికి సంబంధం ఉంది...
ఇక్కడ సీతమ్మవారి వారి పేద్ధ అడుగు (పాదముద్ర) ఉంటుంది..
దీనిలో సంవత్సరంలో 365 రోజులూ నీళ్ళు ఉంటాయి(బాణం మార్కుతో సూచించాను చూడండి)...
వాస్తవంగా అనంతపురం జిల్లా దాదాపు ఎడారి లాంటిది..
అక్కడ భూగర్భ జలాలకై బోర్ వేస్తే దాదాపు 500 అడుగులు తవ్వినా బోర్ పడని పరిస్థితి..
అలాంటిది ఈ కొండపై ఉన్న పాదముద్రలో నీరు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు...
మామూలుగా కొద్ది పాటి ఎండలకే నీరు ఎండిపొయే పరిస్థితి ఉంటుంది.. ఈ పాదముద్ర లో నీరు రోహిణి కార్తె ఎండలో కూడా ఉంటుంది.. అది ఈ పాదముద్ర మహత్యం.. ఈ నీరు చాలా తియ్యగా తీర్థం కంటే గొప్పగా ఉంటుంది... ఆంజనేయుడి పాదముద్ర ఇప్పటి వరకూ ఉంటుందా అనే కుహనా వాదులు దీని గురించి పెదవి విప్పరు.. రహస్యం చెప్పలేరు.. అదీ మన భారతీయుల మహత్యం... ఇంకా మరెన్నో విశేషాలున్నాయీ ఆలయంలో.. మరొక్క సారి మరొక్క కథనంతో మీముందు ఉంటాను...
Post a Comment