Tuesday, 17 June 2014

కాంతి వేగాన్ని కనిపెట్టింది ఎవరు???కాంతివేగం వేదాలలోనే ఉంది


కాంతివేగం వేదాలలోనే ఉంది (మహోన్నత భారతదేశం)

వేదభాష్యకారులలో ఒకరైన శాయనాచార్యులు (క్రీ.శ.1315 -1387)
విజయనగర రాజులలో ఒకరైన బుక్కరాయల అస్థానంలో మంత్రిగా ఉండేవారు.
వీరు తమ ఋగ్వేద భాష్యంలో కాంతి యొక్క వేగాన్ని ప్రస్తావించాడు.
వీరు తమ ఋగ్వేద భాష్యంలో ఒక శ్లోకంపై వ్యాఖ్య లో (1.50 సూక్తము,4 వ శ్లోకం)
"ఓ! సూర్యదేవా నీ కిరణాలు అరనిమేషంలో 2202 యోజనాలు ప్రసరిస్తాయి"అన్నాడు.
మనకు తెలుసుఒక యోజనం=9.00625మైళ్ళు
మహాభారతం,శాంతిపర్వం ప్రకారంఅరనిమేషం= 8/75 సెకన్లు (ఇక్కడ 7.9789... ను సమీప 8 కు మార్చడం జరిగింది).
ఈ లెక్క ప్రకారం కాంతివేగం 186413.22 మైళ్ళు/సెకన్.ఇప్పటి లెక్కప్రకారం ఈ వేగం 186300 మైళ్ళు/సెకన్.ఇది అత్యంత ఆశ్చర్యజనకమైన ఫలితం.ఎంత దగ్గరగా మనవాళ్ళు లెక్కించారో.

Post a Comment

Whatsapp Button works on Mobile Device only