Tuesday, 17 June 2014

ఆధునిక ’పై’ విలువ (31 దశాంశ స్థానాల వరకు):: లెక్కించిన మన పూర్వీకుల ప్రతిభకు అర్థం పట్టే పద్యం వివరాలు pi value aryabhatta

పై (π) విలువను ఎలా లెక్క కట్టాలో సింపుల్ గా చిన్న పద్యంలో వివరించిన ఆర్యభట్ట:

17 వ శతాబ్థంలో విలియం జోన్స్ అనే లెక్కల మాస్టారు.. కనిపెట్టినట్టు చెప్తున్న ఈ π విలువను 31 దశాంశ స్థానముల వరకు ఖచ్చితంగా ఎలా లెక్క కట్టారో అనేది ఒక చిన్న పద్య రూపంలో సామాన్యులు కూడా లెక్క కట్టే విధంగా మన మహర్శి ఆర్యభట్టుడు తమ మహాఆర్య సిద్ధాంతంలో వివరంగా వ్రాసారు... ఈ మహాఆర్య సిద్ధాంతంలో ఇది మాత్రమే కాక.. గ్రహాలు.. ఉపగ్రహాలు... గ్రహ గమనం గురించి.. ఎన్నో విలువైన విషయాలు ఉంచారు.. ఇప్పటికీ అవి ఉపయోగకరంగానే ఉన్నాయి.. అందుకే ఆయన సేవలను గుర్తించినట్లుగా భారత తొలి ఉపగ్రహాలకి ఆర్యభట్ట అని నామకరణం చేసారు.. ఇప్పటి జనరేశన్ వారికి ఆర్యభట్ట గురించిన వివరాలు తెలపడం.. మన ధర్మం.. 



పై విలువని సూచించే పద్యం

క్రీ.శ. 950 ప్రాంతానికి చెందిన రెండవ ఆర్యభట్టు గణితంలో, జ్యోతిషంలో ఆరితేరినవాడు.
ఖగోళ, గణిత శాస్త్రాల మీద ఇతడు ’మహాఆర్య సిద్ధాంతం’ అనే పుస్తకం రచించాడు.
ఖగోళ, గణిత శాస్త్రాల మీద ఇతడు ’మహాఆర్య సిద్ధాంతం’ అనే పుస్తకం రచించాడు. 
ఇందులో అక్షరాలతో, పద్యాలలో సంఖ్యలని వ్యక్తం చెయ్యడానికి ఇతడు ఓ చక్కని పద్ధతి సూచించాడు. 
దానికి "కటపయాది" పద్ధతి అని పేరు. 
ఈ పద్ధతిలో ప్రతీ హల్లుకి ఒక సంఖ్య విలువ ఈ విధంగా ఇవ్వబడుతుంది. 
 క, ట, ప, య = 1 ; 
ఖ, ఠ, ఫ, ర = 2
గ, డ, బ, ల = 3; 
ఘ, ఢ, భ, వ = 4
జ, ణ, మ, శ = 5; 
చ, త, ష = 6
ఛ, థ, స = 7; 
జ, ద, హ = 8
ఝ, ధ = 9; 
ఞ్, న = 0 
 హల్లుకి, అచ్చు ఏది చేరినా హల్లు విలువ మారదు.
ఉదాహరణకి క, కా, కి, కీ, మొదలైన వాటన్నిటి విలువ 1 మాత్రమే. 
 ఈ పద్ధతి ప్రకారం ’పై’ విలువ ఈ కింది సంస్కృత పద్యంలో పొందుపరచబడి ఉంది. 
 గోపీ భాగ్య మధువ్రాత శృఞ్గి శోదరి సంధిగఖల జీవిత ఖాతావగల హాలార సంధర || 
 ఈ పద్యాన్ని కృష్ణుడి పరంగాను, 
శివుడి పరంగాను కూడా చెప్పుకోవచ్చట 
 కటపయాది పద్ధతిలో హల్లుల విలువలని పై పద్యంలో అక్షరాలకి వర్తింపజేస్తే వచ్చే సంఖ్య... 
 3141592653589793 (మొదటి పాదం) 
2384626433832792 (రెండవ పాదం) 
 (ఆధునిక ’పై’ విలువ (31 దశాంశ స్థానాల వరకు) =3.1415926535897932384626433832795 
 వెయ్యేళ్ల క్రితం ’పై’ విలువని అన్ని దశాంశ స్థానాల వరకు లెక్కించగలడమే ఒక అద్భుతం! 
దానికి తోడు ఆ విలువని రెండు అర్థాలు వచ్చే పద్యంలో నిక్షిప్తం చెయ్యడం ఇంకా విచిత్రం!

Inventor of pi value

ఖగోళ సిద్దాంతం గురించి గ్రహ గమనముల గురించి ఆయన చెప్పిన సూత్రాలు ఇప్పటికీ మన జ్యోతిష్య శాస్త్ర పండితులు ఉపయోగిస్తున్నారు.. అందుకే ఎటువంటి శాస్త్రము చదవని వారు కూడా గ్రహణం ఎప్పుడు వస్తుందో... ఎవరికి గ్రహణ ప్రభావంఉంటుందో చాలా స్పష్టంగా చెప్పగలుగుతున్నారు... క్రింద మహా సిద్దాంతం పుస్తకం ఇస్తున్నాము చూడండి

మహా సిద్దాతం 
maha siddanta book pdf free download


అర్య భట్ట వ్రాసిన ఆర్యభట్టీయమును ఇంగ్లీషు లోకి అనువదించారు... ఇప్పుడు ఆ గ్రంథం మూడు సంపుటాలలో క్రింద పిడిఎఫ్ రూపంలో ఇస్తున్నాము చూడండి... ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు

ఆర్యభట్టీయం - 1
aryabhatteeyam book pdf free download



ఆర్యభట్టీయం - 2
Aryabhatteeyam pdf book free download -



ఆర్యభట్టీయం - 3
ఆర్యభట్టీయం - aryabhatteeyam book in telugu free download




మా YouTube Channel ను SUBSCRIBE చేయండి.. మమ్ము కొంచెం Encourage చేసినట్లు అవుతుంది.. Please subscribe our Channel
👉👉👉To Subscribe us please click here👈👈👈

Join with me in our telegram:




ఈ బ్లాగ్ లో మరెన్నో విలువైన పుస్తకాలు ఉన్నాయి... మన పురాతన విజ్ఞానము పుస్తక భాండాగారము 👈👈ఈ లింక్ లో ఉన్నాయి... చూడండి...

మరింత information కోసం మా మెనూ చూడండి



మాసైట్ లో ఇంకా ఎన్నో 👉అమూల్యమైన పుస్తకాలు 👈ఉన్నాయి.. మీరు చూసి ఇష్టమైన వాటిని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.. 



Post a Comment

Whatsapp Button works on Mobile Device only