Tuesday, 17 June 2014

ఈ లోకము వదిలి వెళ్ళిపోయిన మనుష్యుల ఆత్మ ఎక్కడ ఉంటుంది ??? (పితృ కర్మల ప్రాముఖ్యత!! )


పితృ కర్మల ప్రాముఖ్యత!!
ఈ లోకము వదిలి వెళ్ళిపోయిన మనుష్యుల ఆత్మ ఎక్కడ ఉంటుంది ??? =========================================== ☻
ఈ లోకము వదిలి వెళ్ళిపోయిన మనుష్యుల ఆత్మ ఐదు చోట్ల ఉంటుంది.
 1. ప్రాణం పోయిన చోటన.
2. ప్రాణం పోయిన తరువాత వారి శరీరం ఉంచిన చోట.
3. వారి శరీరముకు దహన సంస్కారాలు చేసిన చోట. (చితికి నిప్పు అంటించిన చోట)
 4. స్మశానముకు ఇంటికి మధ్య తిరుగుతూ ఉంటుంది.
5. కర్మ చేసిన (నిర్వర్తించిన) పెద్ద కొడుకు ను అంటి పెట్టుకుని ఉంటుంది.
==== ఇన్నాళ్ళు నేను ఉన్న శరీరము ఇలా కాలిపోతోంది ఏంటి ?? అని అనుకుంటుందట..
 నా కొడుకు నాకు ఎలా చేస్తున్నాడు అని ఆతురతతో చూస్తూ ఉంటారంట.
వారు మాట్లాడలేరు కానీ అన్నీ గమనిస్తూ ఉంటారట. అందుకే మనము సక్రమముగా కర్మ నిర్వహణ చేయాలి. Compromise అవ్వకూడదు. శాస్త్ర ప్రకారము చేస్తే వారు చూస్తూ ఉంటారు. చూసి సంతోషిస్తారు. కానీ ఈరోజుల్లో... గోదాన నిమిత్తం వంద (100) రూపాయలు సమర్పయామి. సువర్ణ దాన నిమిత్తం వంద (100) రూపాయలు సమర్పయామి. అని చేసేస్తున్నాము.. !!!!
 ☻ ఇటువంటప్పుడు మన వారు ఇలా అనుకుంటారంట ..
"నేను నా కొడుకు కు కోట్ల రూపాయలు విలువ గల ఆస్తులు ఇస్తే.. వాడు నాకోసము.. కేవలము వంద రూపాయలు మాత్రమే ఇచ్చాడు అని బాధతో అనుకుంటారంట.. నా వాడు ఎంత శ్రద్ధ గా చేస్తున్నాడా.. అని వేచి చూస్తూ ... పెద్ద కొడుకు ను అంటి పెట్టుకుని స్వర్గస్తులైన మన పెద్ద వారి ఆత్మ ఉంటుందట.. మనలను (పెద్దకొడుకులను) అంటిపెట్టుకుని మనలను కన్నవారి ఆత్మ ఉంటుందట.. కాబట్టి మనము వారు ఇష్టపడే / నచ్చే పనులను చేయాలి. వారిని బాధించేలా చేయకూడదు.
వారు వైతరిణి నది దాటుటకు ఆవు అవసరము. కాబట్టి గోదానము చేస్తే మంచి కదా.. !! ================================== ఒక ఉదాహరణ కూడా చెప్పారు. -------------------------------------- ఇక్కడ మనకు భారత దేశములో టీ ఐదు రూపాయలు కి లభిస్తుంది. ఇదే అమెరికా కు పోతే ఒక్క డాలర్ మన 50 రూపాయలతో సమానము. వారి లెక్క లో ఐదు డాలర్లు అంటే మన కరెన్సీ లో 5 x 50 = 250 రూపాయలు అనమాట. కాబట్టి అక్కడకు పోయాక కూడా టీ కి మనము ఐదు రూపాయలు ఇస్తే సరిపోదు.. ఐదు డాలర్లు ఇవ్వాలి. అంటే 250 రూపాయలు ఇవ్వాలి కదా.. మరి గోదానము నిమిత్తము 100 రూపాయలు సమర్పయామి అనటం కాకుండా గోవును దానము చేస్తే మంచిది. ఇంకా వారి పేరిట అన్నము పెట్టటము.. వస్త్రములు లేనివారికి వస్త్రములు ఇవ్వటం చేస్తే వారు సంతోషిస్తారు. వారి ఆత్మకు సద్గతి కలుగుతుంది. ===========================================
ఈ విధంగా స్వర్గస్తులైన వారి ఆత్మ ఐదు ప్రదేశాలలో ఉంటుంది అని దూరదర్శన్ ఛానల్ లో 14 జూన్ 2014 శనివారము రాత్రి 10 -- 10.30 మధ్య ప్రసారం చేసిన కార్యక్రమము చూస్తే తెలిసింది.
~ వారణాసి వేంకట సాయి కార్తీక్ శర్మ.
  1. Nijama...........nijamenaa....varanasi venkata sai karthika sarma garuu.......inkomcham vivaramgaa cheppandi.

    ReplyDelete
  2. 14th june programm link vuntey pampandi plz

    ReplyDelete

Whatsapp Button works on Mobile Device only