Monday, 16 June 2014

భూమి గుండ్రంగా ఉన్నదని చెప్పినది ఎవరు?

భూమి గుండ్రంగా ఉన్నదని చెప్పినది ఎవరు?
ఋగ్వేదం లోని మంత్రం గమనించండి
 మొట్టమొదట భూమి గుండ్రంగా ఉన్నదని చెప్పినది ఎవరు?
మనం చదువుకున్నది 16,17 శతాబ్దాలకు చెందిన కెప్లర్,కోపర్నికస్,గెలీలియోలని.

కాని ఋగ్వేదం లోని క్రింది మంత్రం గమనించండి.
" చక్రాణాసః పరీణహం పృథివ్యా....
"అర్థం " భూమి యొక్క వృత్తపు అంచున ఉన్నవారు...

"అతిప్రాచీన గ్రంథం ఐన సూర్యసిద్దాంతం గ్రంథ 12వ అధ్యాయం,32వ శ్లోకంలో
"మధ్యే సమంతాదణ్ణస్య భూగోళో వ్యోమ్ని తిష్టతి""
బ్రహ్మాండం మద్యలో భూగోళం ఆకాశంలో నిలిచిఉంది" అని దాని అర్థం.

ఆర్యభట్టు రచించిన "ఆర్యభట్టీయం" గ్రంథంలోని గోళపాద అధ్యాయంలో 6వ శ్లోకం 
" భూగోళః సర్వతో వృత్తః" అంటే " భూమి వృతాకారంలో ఉన్నదని అర్థం.

క్రీ.శ.505 లో వరాహమిహిరుడు " పంచ మహాభూతమయస్తారా గణ పంజరే మహీ గోళః..(13-1)
"అర్థం: పంచ భూతాత్మకమైన గుండ్రని భూమి,పంజరం లో వేలాడే ఇనుప బంతిలా,ఖగోళంలో తారల మధ్య నిలిచిఉంది"అన్నాడు.

లీలావతి గ్రంథం లో భాస్కరాచార్యుడు " నీవు చూసేదంతా నిజం కాదు.ఎందుకంటే నీవు ఒక పెద్ద వృత్తం గీసి అందులో నాల్గవ భాగం చూస్తే అది మనకు ఒక సరళరేఖలా కనిపిస్తుంది.కానీ నిజానికి అది వృత్తమే.అలాగే భూమి కూడా గుండ్రంగానే ఉన్నది."

శ్రీరామకృష్ణ ప్రభ సౌజన్యంతో

Post a Comment

Whatsapp Button works on Mobile Device only