మానసిక ప్రశాంతతను పొందడానికి కొన్ని సూత్రములు:
ప్రకృతితో సహజీవనం:
మన జీవన విధానంలో రాను రాను కృత్రిమత్వం పెరిగిపోతూ ఉంది..
మానవుడు ప్రకృతిని జయించాలని పడే తహతహలో తన సహజత్వాన్ని కోల్పోతున్నాడు.
సమస్యలకు మూలం సహజత్వాన్ని కోల్పోవడమే. దేవుడు-జీవుడు-;ప్రకృతి ఈ మూడింటి విశిష్ట కలయిక ఈ విశ్వం.ఇందులో జీవుడుదేవునికి ప్రకృతికి అతీతంగా ఉండాలనుకోవడం వలన ఆందోళన,అశాంతి పెరిగిపోతున్నాయి...
భారతీయ జీవన విధానంజీవుడు ప్రకృతితో పాటు సహజీవనం చేస్తూ దేవుణ్ణి చేరుకోవడానికి దోహదం చేస్తుంది...
విదేశీయుల (పాశ్చాత్యుల) జీవన విధానం ఇందుకు భిన్నమైంది. వారు ప్రకృతిని వశం చేసుకోవాలని ప్రయత్నిస్తారు. ఆధునిక సమాజం దీనిని అభివృద్దిగా భావిస్తుంది.ఐతే, ఈ ప్రకృతిని ఎంతలా వశం చేసుకోవాలనే కోరిక పెరుగుతూ పోతుందొ.. మనలోని అశాంతి కూడా అంతలా పెరుగుతుంది..
అందుకే ప్రకృతిని అర్థం చేసుకుంటూ సహజీవనం చేస్తూ ఆధ్యాత్మిక సాధన ద్వారా దేవుణ్ణి చేరుకోవాలి.ఇది సనాతన వాదంగా, అభివృద్ధి నిరోధకంగా కనపడుతుంది. కాని ఇందులో అశాంతి, ఆందోళనా ఉండవు. మనిషికి కావలసినది శాంతి ద్వారా లభించే సౌఖ్యమే కాని, అశాంతితో కూడిన విలాస జీవితం కాదు.
ఈ సత్యాన్ని చెప్పడానికే మన పురాణాలు కూడా ప్రయత్నించాయి.వ్రతాచరణలన్నీ ప్రకృతితో సహజీవనం చేయడమెలాగో నేర్పడానికే ఉన్నాయి. ప్రకృతిలో మార్పులు సంభవించే కాలంలో ముఖ్యంగా ఈ వ్రతాచరణలుంటాయి.. వైశాఖ మాసం, శావణమాసం, కార్తీక మాసం, మాఘమాసం ఇటువంటివి. ఈ మాసాలలో తెల్లవారు ఝామున నిద్ర లేవడం, చన్నీటి శిరస్నానంచేయడం, సహజ సిద్ధమైన పండ్లను ఆహారంగా స్వీకరించడం, చాపమీదే శయనించడం, జప-తప-యజ్ఞ యాగాది క్రతువులను ఆచరించడం, దాన ధర్మాదులు చేయడం వంటివి నియమంగా ఆచరించమని మన పురాణాలు తెలిపాయి. వీటి వలన వ్యక్తిలో బాహ్య శుచి, అంతశ్శుచి కలుగుతాయి...
Post a Comment