కొబ్బరికాయని భగవంతునికి నివేదించడానికి చాలా కారణాలున్నాయి...
ఆధ్యాత్మిక కారణం:
మనం బావి నీరు, నది నీరు, చివరికి గంగానది అయినా సరే ఏవో చేపలు.. ఇతర జలచరాలు ముట్టుకున్నవే అయి ఉంటాయి... కానీ కొబ్బరి కాయలోని నీరు ఎవరూ ముట్టుకోనిది.. ఎంగిలి పడనిది.. స్వచ్చమైనది అయి ఉంటుంది..అందుకే ఈ నీరు అభిషేకానికి పనికి వస్తాయి...
ప్రతి గుడిలో కొబ్బరి ముక్కల ప్రసాదం ఖచ్చితం ఎందుకయ్యింది!!
కొబ్బరికాయ మనకు ఎందుకు ప్రధాన ఆహారవనరమయ్యింది...* కొబ్బరిని పచ్చిగ తిన్నా వంటకాల్లో ఉపయోగించినా చక్కని రుచితో పాటు పోషక విలువలూ శరీరానికి
అందుతాయి. బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి..
* అధిక బరువుతో బాధపడుతున్న వారు శరీరంలో జీవక్రియల రేటు మెరుగుపడాలంటే కొబ్బరి వాడకం
మొదలుపెట్టడం మంచిది..
* తక్కువ కేలరీలు, కొవ్వు కలిగి ఉండి తక్షణ శక్తిని అందిస్తుంది. కొబ్బరి ఉత్పత్తులను ఆహారంగా
తీసుకున్నప్పుడు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది... కొన్ని గంటల పాటు ఆకలి వేయదు.. నీరసం
రాదు.
* దీనిలో ఉండే లారిక్ యాసిడ్ తల్లి పాలను ఉత్పత్తి చేయడంలో కీలకంగా పనిచేస్తుంది.
* వైరస్ ఫంగల్ ఇన్ఫెక్షన్ లను నిరోధిస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది..
* కొబ్బరి నుండి దాదాపు అరమై ఒక్క శాతం డైటరీ పీచు లభిస్తుంది. ఇది రక్తంలోని చక్కెర నిల్వల్ని
పెరగనివ్వకుండా సమన్వయం చేస్తుంది..
* జీర్ణ వ్యవస్థ ను ఆరోగ్యంగా ఉంచుతుంది..
* కొబ్బరి శరీరంలో ని ఇన్సులిన్ ను పెంచడానికి తోడ్పడుతుంది.
* మంచి కొలెస్ట్రాల్ ను పెంచి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
* కొబ్బరిలో ఉండే సహజ పోషకాలు, అరోమా పరిమళాలు ఒత్తిడిని దూరం చేస్తాయి..
* అల్జీమర్స్ తో బాధ పడే వారు కొబ్బరిని రోజు వారి ఆహారంగా చేర్చుకుంటే మంచిది..
ఇన్ని ప్రయోజనాలున్నాయి కాబట్టే మన పూర్వీకులు దీనిని ప్రసాదంలో భాగంగా చేసారు...
Post a Comment