Friday 27 June 2014

ఆషాఢ మాసాన్ని శూన్యమాసమని ఏ ఇతరత్రా శుభ కార్యాలు జరుపకూడదని అంటారు.అస్సలు ఈ మాసాన్ని ఎందుకు శూన్యమాసంగా పరిగణించారు?ఆశాఢమాస విశిష్టత

ఆషాఢ మాసాన్ని శూన్యమాసమని ఏ ఇతరత్రా శుభ కార్యాలు జరుపకూడదని అంటారు..
ఎందుకంటే ఇందులో ఒక రహస్యం ఇమిడి ఉంది..
ఆషాఢ మాసంలో సూర్యుడు కర్కాటక రాశి లో ప్రవేశిస్తాడు.. అందుకే ఈ మాసం నుండే దక్షిణాయనం ప్రారంభమవుతుంది...

వాస్తవానికి ఆషాఢం కూడా పవిత్ర మాసమే..
ఈ మాసం లో వచ్చే తొలి ఏకాదశి  విష్ణువుకు ఎంతో ఇష్టమయినదట

ఈ నెలలో ఉన్న పండుగలు:

1.  ఆషాఢ శుద్ధ విదియ నాడు ‘పూరీ’ జగన్నాథుని రథ యాత్ర మొదలవుతుంది,
2.  శుద్ధ పంచమి న వచ్చే స్కంధ పంచమి గాపిలుస్తారు, ఈరోజున స్కంధుణ్ణి ఆరాధిస్తారు.
3.  షష్ఠి నాడు కుమార స్వామిని ఆరాధిస్తారు అందుకే ఇది కుమారషష్ఠి అయింది.
4.  దక్షిణాయనంలో గతించినవారు పితృదేవతల శుభాశీస్సులందుకుని చంద్రలోకం చేరుతారని పురాణ కథనం..          అందుకే సప్తమిని భాను సప్తమి అని పిలుస్తారు..
5.  తొలి ఏకాదశి...ఆషాఢంలో వచ్చే తొలి ఏకాదశి అని చెప్పే ఈ ఏకాదశి శ్రీ మహా విష్ణువు అత్యంత ప్రీతికరమైన
     రోజు...ఇంకొక విశేషమేమంటే ఈ రోజు రాత్రి మరియు పగలు ఖచ్చితంగా ఘడియ, విఘఢియలతో సహా
     సమానంగా ఉంటాయి.... సంవత్సరం మొత్తంలో ఇలా వచ్చే రోజులు చాలా స్వల్పం.. ఈ ఏకాదశిని శయనైక
     ఏకాదశి అని కూడా పిలుస్తారు..
6.  వ్యాసపూర్ణిమ లేదా గురుపూర్ణిమ,
7.  అషాఢంలో చేసే సముద్ర స్నానాలు ఎంతో ముక్తి దాయకాలు


ఇక ప్రధాన విషయమేమంటే ...మన భారత దేశం ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడిన దేశం...ఈ మాసంలోనే వర్షాలు ప్రారంభమయ్యేవి.... ..
ఆషాఢం మాసానికి ముందు వచ్చే పున్నమికి ఏరువాక పున్నమి అని పేరు... ఏరువాక పున్నమినుండే అసలు సిసలైన వ్యవసాయ పనులు మొదలవుతాయి.. ఏరువాక పున్నమి నాడు నాగళ్ళకు పూజలు చేసి వ్యవసాయాన్ని ప్రారంభిస్తారు మన రైతన్నలు..ఈ నెల అంతా పూర్తిగా పొలం పనులతో చాలా పని ఒత్తిడి లో ఉంటారు..

అందుకే ఏ శుభ కార్యాన్ని తలపెట్టినా రెండు పనులను ఒకేసారి చెయ్య వలసి వచ్చి.. ఏదో ఒక విఘ్నం రావడానికి అవకాశముంది... అందుకే పూర్తి ఏకాగ్రత వ్యవసాయంపైనే దృష్టి నిలపడానికి ఈ నెలలో ఏ  వేడుకలకు అవకాశం లేకుండా శూన్యమాసంగా చేసి ఉండవచ్చు..  మన పూర్వీకులు ఎంత ఖచ్చితమైన వారో చూడండి.. మనకు ఎంత మంచి సాంప్రదాయాలనిచ్చి పోయారో... 


 ఈ నెలలోనే తెలంగాణాలో బోనాల పండుగ నిర్వహిస్తారు.. సాధారణంగా వర్షాకాలం మొదట్లో వచ్చే క్రొత్త నీరు వలన కొన్ని సాంక్రమిక వ్యాధులు తలెత్తే అవకాశముంది.. ఈ బోనాల పండుగలో అన్నం , పెరుగు,వేప ఆకు, బెల్లం మిశ్రమంతోనే నైవేద్యం తయారవుతుంది.. ఇది చాలా మంచి రోగ నిరోధకరమైన ఆహారం..

Post a Comment

Whatsapp Button works on Mobile Device only