Thursday 29 May 2014

తండ్రికి,కొడుక్కి మధ్య ఉన్న కనపడని,కూలిపోని గట్టి వారధి నమ్మకమే --నమ్మకమే అనుబంధం,నమ్మకం శాశ్వతం- A story about Belief

నేను చదివిన ఒక సంఘటన, నా మాటల్లో......
రోజూ కొడుకు చెయ్యి పట్టుకుని కబుర్లు చెబుతూ..
కొడుకేమో తండ్రి చెప్పే మాటలు వింటూ ఊ కొడుతూ..
బాబుని ఆ రోజు కూడా స్కూల్లో వదిలి వచ్చాడు తండ్రి రోజులానే...
ఉన్నట్టుండి మూడంతస్థుల స్కూల్ భవనం కూలిపోయింది,పిల్లల్లో ఈ కొడుకు,
ఇంకా కొంతమంది భవన శిధిలాల మధ్య ఏమీ కాలేదు కానీ,చుట్టూరా పడిపోయిన
గోడల మధ్యన చిక్కుకుపొయ్యారు,ఆ కొడుకు నాన్న,నాన్న అని అరుస్తూనే ఉన్నాడు..
కొంత సేపటివరకు ఎవరికీ ఏమీ అర్ధం కాలేదు పిల్లలకి..కాసేపటికి విషయాన్ని
అర్ధం చేసుకున్న పిల్లలు ఆ బాబు దగ్గరికి వచ్చి 'ఎందుకురా,అంతలా అరుస్తున్నావు,ఎవ్వరికీ ఏమీ వినిపించదు అని ఏడుపు గొంతులతో,దిగులు ముఖాలతో అడిగారు..అప్పుడు ఆ బాబు చెప్పాడు "మా నాన్న ఎప్పుడూ నాతో చెప్పేవారు,నీకు భయం వేసినా,బాధ కలిగినా..నాన్న అని తలుచుకో, లేదా నన్ను పిలు , నేను తప్పక నీ దగ్గరికి వస్తాను,ఆలస్యంగానైనా నిన్ను వెతుక్కుంటూ నేను ఎక్కడికైనా వస్తాను, అని చెప్పి , మళ్ళీ గట్టిగా నాన్నా,నాన్నా అని అరవటం మొదలు పెట్టాడు...ఇంతలో చుట్టూ ఉన్న పడిపోయిన గోడల శిధిలాల నుంచి ఏవో శబ్దాలు రాసాగాయి..పిల్లలకి భయం పెరిగి గట్టిగా ఏడ్చేస్తున్నారు,బాబు మాత్రం ఒకటే మాట "నాన్నా,నాన్నా..అంటూ ఒకటే పిలుపు....కొంతసేపయిన తర్వాత శిధిలాలు తొలగించి బయటినుంచి ఆ బాబు తండ్రి,కొంతమంది సహాయక సిబ్బంది చేతులు అందించి ఆ పిల్లల్ని,బాబుని బయటికి తీసారు....ఆ మిగిలిన పిల్లల తల్లితండ్రులు,ఆ తండ్రిని ఒకటే మాట అడిగారు,మీకెలా తెలుసు, మీ బాబు పిలుస్తాడని,కొన్ని శిధిలాలు తొలిగించేదాకా మాకెవ్వరికీ వినిపించని పిలుపు మీకెలా వినిపించింది, అప్పుడు తండ్రి చెప్పాడు "నా బాబుకి నా మాటల మీద నమ్మకం ఎక్కువ,వాడు ఏ కష్టం వచ్చినా నాన్న అంటూ నన్నే పిలిచి,నేను వాడి దగ్గరికి వెళ్ళే వరకు ధైర్యం కోల్పోడు,మా బాబుకున్న ఆ నమ్మకమే వాడిని ఏ సంఘటన అయినా పోరాడేలా చేస్తుంది,నేను వాడికి సహాయహస్తం అందించేవరకు, అని చెప్పాడు....ఆ తండ్రికి,కొడుక్కి మధ్య ఉన్న కనపడని,కూలిపోని గట్టి వారధి ఆ నమ్మకమే....ఆ నమ్మకమే ఆ బాబుతో పాటూ ఇంకో నలుగురు పిల్లలకు ధైర్యాన్ని,ప్రాణాన్ని పోసింది....నమ్మకమే జీవితం,నమ్మకమే అనుబంధం,నమ్మకం శాశ్వతం.........
Collected post


Whatsapp Button works on Mobile Device only