Tuesday, 3 June 2014

ఉదయాన్నే లేవగానే ఎవరి ముఖం చూడాలి - కర దర్శన శ్లోకం - KARADARSHANA SHLOKAM

కర దర్శన శ్లోకం

ఉదయాన్నే లేవగానే ఎవరి ముఖం చూడాలి?

మనం సాదారణంగా ఏదైనా పని చేసినప్పుడు లేదంటే ఆ రోజు ఏమి కలిసిరానప్పుడు ''పొద్దున్నే లేచి ఎవరిముఖం చూశానో కాని'' అని ఎత్తుకుంటారు.
ఉదయం లేవగానే దేవుడి ముఖం కనిపించేలా కాళ్ళ దగ్గర మీకు నచ్చిన దేవుడి చిత్రపటం చూడండి. కాళ్ళ దగ్గర పెట్టుకుంటే అపచారం కదా అని కొందరికి సందేహం. కాళ్ళదగ్గర అంటే కళ్ళకి తగిలేలా పెట్టుకోవడం లేదు కదా ఎదురుగ వున్నగోడకి తగిలిస్తున్నాం. అంతే కాకుండా దేవుడు సర్వాంతర్యామి. అయన సర్వం నిండి ఉన్నాడు. అలాంటప్పుడు నీ కాళ్ళ దగ్గరే ఉన్నాడు అని ఎందుకు అనుకుంటున్నారు. కానీ మనసులో గిలి ఉన్నవారికి ఇంకో చిన్న సందేశం. 
ఉదయం లేచిన వెంటనే మీ అరచేతులు చూసుకోండి. దీనికి కూడా ఒక కారణం ఉంది. 
అరచేతి ముని వెళ్ళు లక్ష్మి దేవి స్థానం. అరచేయి సరస్వతి స్థానం, అరచేయి కింద మణికట్టు శక్తి స్థానం. దీనికి ప్రమాణం ఏంటి అని సందేహమా?
లక్ష్మీదేవి చంచలం అనే విషయం అందరికి తెలుసు కదా! ధనం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఎవ్వరికి తెలియదు. అందుకని ఎప్పుడు దూకేద్దామా అని మునివేళ్ళ మీద కుర్చుని వుంటుంది. మనం ఎవరినైనా డబ్బు గురించి అడిగేటప్పుడు బొటనవేలు చూపుడువేలు టిక్కు టిక్కు మని కొడుతూ అడుగుతాం కదా. అలాగే సరస్వతి దేవి అరచేతిలో ఉంటుంది. మనం పుస్తకం పట్టుకుని చదవాలనుకుంటే అరచేతిలోనే పట్టుకుంటాం. ఏమి చేస్తున్నావు అని ఎవరైనా అడిగితె అరచేతులు రెండు దగ్గర పెట్టు ముడిచి చదువుతున్నాను అని చూపిస్తాం. అలానే మనం ఎవరిననైన కొట్టాలి అనుకున్నా, లేక కోపం వచ్చిన పిడికిలి బిగిస్తాం. ఆ పిడికిలి బలం (శక్తి) అంతా మణికట్టు మీదే ఆధారం. కనుక అరచేతిని చూసుకుంటే ముగ్గురు అమ్మల్ని దర్శించినట్టు ఉంటుంది. ఎవరిని తిట్టుకోకుండా ఉంటాము. కాబట్టి మీకు వీలైన పద్దతిని వాడుకోండి.

కర దర్శన శ్లోకం:
కరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతి
కరమూలేతు స్థిత గౌరీ ప్రభాతే కర దర్శనం

Post a Comment

Whatsapp Button works on Mobile Device only