సింధు
లోయ నాగరికత ఎక్కువగా పాకిస్థాన్ భూభాగమైన బెలూచిస్తాన్ నుంచి సింధ్ వరకు, జీలం నదికి తూర్పుగా ఉన్న పంజాబ్ నుంచి సట్లెజ్ నదికి ఎగువన ఉన్న రూపార్ వంటి
ప్రదేశాల్లో విలసిల్లింది. ఇటీవలే సింధూ నాగరికతకు సంభందించిన కొన్ని ప్రదేశాలు
వాయువ్య పాకిస్థాన్‌లో కూడా బయల్పడినాయి. ఇంకా ఆఫ్ఘనిస్తాన్, తుర్కమేనిస్తాన్, గుజరాత్ లలో కూడా ఈ నాగరికతకు సంభందించిన
చిన్న చిన్న కాలనీలను కనుగొన్నారు. తీర ప్రాంతాలు పశ్చిమ బెలూచిస్తాన్ లోని
సుట్కాగన్ దర్ నుంచి గుజరాత్ లోగల లోథాల్ వరకు వ్యాపించి ఉండేవి. ఉత్తర
ఆఫ్ఘనిస్తాన్ ఆక్సస్ నది తీరాన షార్టుఘాయివద్ద కూడా సింధు లోయ నాగరికత స్థలాన్ని
కనుగొన్నారు. పాకిస్తాన్ వాయువ్య భాగంలో గోమల్ నది పరిసరాలలో మరొక స్థలం
కనిపించింది. భారతదేశంలో ఇంకొక స్థలం జమ్ములో బియాస్ నది తీరాన ఉంది. మరియు హిందన్
నది వడ్డున ఆలంగీర్‌పూర్ వద్ద (ఢిల్లీకి 28
కి.మీ. దూరంలోనే) కనుగొన్నారు. అధికంగా సింధులోయ నాగరికత స్థలాలు నదీ తీరాలలో
కనిపించాయి. కొన్ని సముద్ర తీరాన కూడా ఉన్నాయి. ఉదాహరణకు బాలాకోట్. కొన్ని దీవులలో
కూడా - ఉదాహరణకు ధోలావిరా
పాకిస్తాన్‌లో హక్రా ప్రవాహం మధ్య ఎండిపోయిన నది దిబ్బలు మరియు భారతదేశంలో వర్షాలు పడినప్పుడు ప్రవహించే ఘగ్గర్ నది ప్రాంతాలలో అనేక "సింధులోయ" లేదా "హరప్పా" నాగరికతకు చెందిన శిధిలావశేష స్థలాలను కనుగొన్నారు. - రూపార్, సోతి, రాఖీగరి, కాలిబంగన్, గన్వారివాలా వాటిలో కొన్ని స్థలాలు. పాకిస్తాన్ మరియు భారతదేశపు సరిహద్దులలో "ఘగ్గర్ - హక్రా" ప్రాంతంలో విస్తరించి ఉన్న బాగొర్, హక్రా, కోటి దిజ్ వంటి జాతుల నాగరికత సంకీర్ణమే ఈ హరప్పా నాగరికత అని జె జి షాపెర్ మరియు డిఎ లీచెన్స్టీన్ అభిప్రాయపడ్డారు. కొద్ది మంది పురాతత్వ శాస్త్రవేత్తల అభిప్రాయాల ప్రకారం ఎండిపోయిన ఘగ్గర్ హక్రా నది మరియు ఉపనదుల పరివాహక ప్రాంతాల్లో దాదాపు 500 హరప్పా ప్రదేశాలు బయల్పడినాయి. సింధూ మరియు దాని ఉపనదుల తీరం వెంబడి కేవలం 100 ప్రదేశాలు మాత్రమే కనుగొనబడ్డాయి గనుక ఈ నాగరికతను "సింధు-ఘగ్గర్-హక్రా నాగరికత" లేదా "సింధు-సరస్వతి నాగరికత" అని పిలవాలని కొంతమంది పురాతన చరిత్ర పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఈ భావాలలో కొన్ని రాజకీయ ఛాయలు కూడా ఉన్నాయి. ఈ విధమైన నామకరణం అనవుసరమని, అశాస్త్రీయం కూడానని ఇతర పురాతన చరిత్ర పరిశోధకులు అంటున్నారు. ఒక కారణం: ఘగ్గర్-హక్రా ప్రాంతం ఎడారిమయమైనందున అక్కడి స్థలాలు చెదరకుండా నిలిచాయి. జనసమ్మర్దం ఉన్న సింధులోయలో జనావాసాల వలన, వ్యవసాయం వలన, మెత్తని మన్నువలన చారిత్రిక అవశేషాలు నాశనమైపోయాయి. మరొకటి: ఘగ్గర్-హక్రా ప్రాంతంలో లభించిన శిధిలావశేషాలు అతిశయంగా చెబుతున్నారు. అంతే కాక ఒకవాడు ఘగ్గర్, హక్రానదులు సిధు నదికి ఉపనదులు. కనుక "సింధు లోయ నాగరికత" అనే పదం మొత్తానికి వర్తిస్తుంది. పురాతన శిధిలాల త్రవ్వకాలలో మొదట కనుగొన్న స్థలం పేరుమీద ఆ నాగరికతకు ఆ పేరు పెట్టడం సామాన్యం కనుక "హరప్పా నాగరికత" అనేది సముచితమైన పేరు.
సింధులోయ నాగరికతకు దక్షిణ భారత దేశంతో ఉన్న సంబంధాలు తెలిపే అవశేషాలు తాజాగా బయల్పడ్డా యి. కేరళలోని వాయనాడ్ జిల్లా ఎడక్కల్ గుహల్లో హరప్పా నాగరికతకు సంబంధించిన రాతి నగిషీలు లభించాయి. కర్ణాటకలోనూ, తమిళనాడులోనూ సింధులోయ నాగరికతకు సంబంధించిన అవశేషాలు ఎప్పుడో దొరికాయి. అయి తే. కేరళలో కొత్తగా లభించిన అవశేషాలతో హరప్పా నాగరికత దక్షిణ భారత దేశంలోనూ విలసిల్లిందని చెప్పే ఆధారాలు మరింత బలపడ్డాయని చరిత్రకారుడు ఎం.ఆర్.రాఘవ వరియెర్ చెప్పారు.దీంతో కేరళ చరిత్ర లోహయుగానికి కంటే పురాతనమైనదని చెప్పడానికి ఆధారాలు లభించాయని చెప్పారు. కేరళ పురావస్తు శాఖ ఇటీవల జరిపిన తవ్వకాల్లో ఎడక్కల్ గుహల్లో ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న హరప్పా, మొహంజదారో సంస్కృతికి సంబంధించి న చిహ్నాలు లభించాయి. లభించిన ఆధారాల్లో 429 చిహ్నాలను ఇప్పటికి గుర్తించారు. జాడీని పో లిన కప్పును పట్టుకున్న మనిషి బొమ్మ హర ప్పా సంస్కృతికి ప్రతిబింబంగా భావిస్తారు. ఇదేకాక క్రీస్తు పూర్వం 2300 నుంచి క్రీస్తు పూర్వం 1700 సంవత్సరం వర కూ విలసిల్లిన హరప్పా సంస్కృతి కి సంబంధించిన లిపి ఇక్కడ బ యటపడిందని, తవ్వకాలకు నా యకత్వం వహించిన వరియెర్ చెప్పారు.
పుట్టుక::::::::::::::::::::::::::
సింధు లోయ నాగరికత ఎలా ఉధ్బవించిందో తెలిపేందుకు చాలా సిద్ధాంతాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. మొదటగా దీనిని దక్షిణ ఆసియాను బాగా ప్రభావితం చేసిన, మరియు ఇండో యూరోపియన్ వలసల వల్ల ప్రభావితమైన వేదకాలపు నాగరికతలో మొదటి దశగా భావించారు. కానీ వేద కాలపు నాగరికతకు సంబంధించి ఎటువంటి విషయాలు కనుగొనలేకపోవడంతో దీన్ని శాస్త్రవేత్తలు ఆమోదించలేదు. జంతువుల చిత్ర పటాల్లో వేదాల్లో ప్రముఖంగా ప్రస్తావించిన గుర్రాలు, రథాలు కనిపించకపోవడం మొదలైనవి ఇందులో ప్రధానంగా చెప్పబడినవి. ఎముకలపై చేసిన విస్తృత పరిశోధనల ఆధారంగా గుర్రాలు కేవలం క్రీ.పూ రెండవ సహస్రాబ్దిలోనే ప్రవేశపెట్టబడినవని ఋజువైంది. చివరగా సింధూ నాగరికతలో కనిపించే పట్టణ జీవితానికి, వేదాల్లో వర్ణించిన గ్రామీణ జీవితానికి ఎటువంటి పొంతన కుదరలేదు.
మరొక వివరణ "పూర్వ ద్రవిడ సిద్ధాంతం" (ప్రోటో-ద్రవిడియన్ సిద్ధాంతం) ద్రవిడ సంస్కృతిపై ఆధారపడి ఉంది. దీన్ని మొదటి సారిగా రష్యా, మరియు ఫిన్లాండ్ కు చెందిన పరిశోధకులు ప్రతిపాదించారు. వీరు ఈ నాగరికతకు సంబంధించిన చిహ్నాలు ద్రవిడ భాషల నుంచి రాబట్టవచ్చునని కొన్ని ప్రయత్నాలు చేశారు. ప్రస్తుతం ద్రావిడ భాషలు అధికంగా దక్షిణ భారతదేశం మరియు శ్రీలంక ప్రాంతంలో ఉన్నాయి గాని కొద్ది భాషలు లేదా మాండలికాలు భారత దేశం ఇతర ప్రాంతాలలోను, పాకిస్తాన్‌లోను వినియోగంలో ఉన్నాయి. (బ్రహుయి భాష ద్రవిడ భాషా వర్గానికి చెందినది. దీనిని బెలూచిస్తాన్ ప్రాంతలో మాట్లాడుతారు.) కనుక ఈ వాదానికి కొంత బలం చేకూరుతున్నది. ఫిన్నిష్ ఇండాలజిస్ట్ ఆస్కో పర్పోలా అభిప్రాయంలో సింధు లోయ నాగరికతలో వాడిన లిపి అన్ని చోట్లా ఒకే విధంగా ఉంది కనుక ఆ నాగరికత వివిధ భాషల సమ్మేళనం అనడానికి కారణం కనుపించదు. కనుక ద్రావిడ భాషల పురాతన రూపం సింధులోయ జనుల భాష అయి ఉండవచ్చును. ఈ పూర్వ ద్రవిడ సిద్ధాంతాన్ని కూడా ఇదమిత్థంగా ఆమోదించడానికి సరైన ఆధారాలు లభించడంలేదు. ఎందుకంటే పూర్వ ద్రవిడ సిద్ధాంతం ఏక భాషా సంపర్కంపైన ఆధారపడి ఉంది. మరే సాంస్కృతికమైన ఆధారాలు లభించలేదు.

Collected info:
informative article.more such relics are likely to be found in other parts of Indian subcontinent by more thorough archealogical investigations.some evidence of the cities described in our puranas (2000-1000B.C.)ALSO MAY BE FOUND.Unfortunately our governments or politicians are not interested in culture or heritage.
ReplyDeleteనేను ఈ భరత గెడ్డ మీద జన్మించినందుకు గర్వంగా ఉంది. నేను హిందూగా ఉన్నందుకు సంతోషంగా ఉంది కానీ కొందరు (dash)వారు మన హిందూ గ్రందాలలో (మన పవిత్ర వేదాలలో ) జీసస్ అనునటు వంటి వారిని దేవుడిగా చెప్పి ఉందట. నిన్న రాత్రి ఒక వీడియోలో చూసాను ఎవరో Bro. Edward విలియం గారు అట, వైజాగ్ లో ఒక ఉపన్యాసం లో మన సంప్రదాయలో ఎక్కడా కూడా దేవుడు ఎలా ఉండాలో చెప్పారు కనీ మహా శివుడిని, విష్ణువుని, బ్రమ్మ ని ఎవరిని కూడా దేవుడు అని చేపలేదట. అటువంటి వాలకు ఎలా చెపితే అర్ధమవుతదీ మన సంస్కృతి గొప్పది మన జాతి గొప్పది అని ....
ReplyDeleteI like this article...
ReplyDelete>> వారు మన హిందూ గ్రందాలలో (మన పవిత్ర వేదాలలో ) జీసస్ అనునటు వంటి వారిని దేవుడిగా చెప్పి ఉందట.
ReplyDeleteఇది మాత్రం నిజమేనండి. నాకు గుర్తున్నంతవరకు.. ౠగ్వేదం, తాండియా బ్రాహ్మణంలో వుంది..