Friday 28 February 2014

మురుడేశ్వర్ దేవాలయం - స్థల పురాణం

మురుడేశ్వర్ చరిత్ర ఎంతో అద్భుతంగా ఉంటుంది. ప్రపంచంలోని శివ విగ్రహాలలో రెండవ ఎత్తైన విగ్రహం ఇక్కడ ఉంది. మురుడేశ్వర్ కర్నాటక రాష్ట్రంలో పశ్చిమ తీర ప్రాంతంలో ఉంది. ఈ ప్రదేశం భారత పురాణాలలో ప్రసిద్ధి చెందిన రామాయణ కాలం నాటిదని చెపుతారు. అతిపెద్ద శివ విగ్రహం పట్టణం అంతా కనపడే రీతిలో ఇక్కడి బీచ్ లో ప్రతిష్టించారు. సుందరమైన, పచ్చటి పచ్చిక బయళ్ళతో కల ఒకచిన్న కొండపై శివుడి అతిపెద్ద విగ్రహం ప్రతిష్టించబడినది, నందీశ్వరుడితో సహా ఈ విగ్రహానికి ఒక దేవాలయం నిర్మించారు. మురుడేశ్వర్ సందర్శించేవారికి ఈ శివ దేవాలయ దర్శనం భక్తులు తమను తాము మరచిపోయే రీతిలో ఒక అత్యంత మధురానుభూతిగా ఉంటుంది.
ప్రతిష్టాత్మక శివ భగవానుడి విగ్రహంమురుడేశ్వర్ దేవాలయం ప్రధానంగా ఒక ద్వీపంలో ఉండి మూడు పక్కల అరేబియా మహా సముద్రం ప్రవహిస్తుండటంతో ఈ పుణ్య తీర్ధం దేశ విదేశాలలో ఎంతో ప్రాచుర్యం సంతరించుకొంది. మహాసముద్ర వాతావరణం కారణంగా, అది సముద్రపు గాలి, వర్షాలు, మరియు పెను గాలులకు ప్రభావించబడింది. అతి పెద్దదైన శివ భగవానుడి విగ్రహం కొంతమేరకు దాని సహజ అందం కోల్పోయింది. దానిపై మొదట్లో గల ఆకర్షణీయమైన బంగారు పూత పోయింది. అంతే కాక విగ్రహంలోని ఒక చేయి విరిగిపోయింది. రావణుడు తీవ్ర కోపంతో శివుడి లింగాన్ని తునకలు చేసినపుడు ఒక ముక్క ఈ ప్రదేశంలో పడటంతో, ఈ ప్రదేశంలో నిర్మించిన ఈ దేవాలయం హిందువులకు మతపరంగా ఎంతో పవిత్రత సంతరించుకొంది. దేవాలయ ప్రవేశ భాగం ప్రపంచంలోనే అతి పొడవైనదిగా ఉంటుంది






Post a Comment

Whatsapp Button works on Mobile Device only