Thursday 20 February 2014

ఓంకార రహస్యములు: (Part-1)

ఓంకారాన్ని గురించి తెలుసుకోవాలన్నా... దానిని అర్ధం చేసుకోవాలన్నా... ఆచరించాలన్న మనకు ఒక అర్హత అవసరం... అందుకే మన హిందూ ధర్మాలలో మంత్రోపదేశం చేయటం చాల జాగ్రత్తగా చేస్తారు... ఒక రహస్యాన్ని రహస్యంగా కాపాడడంలో విశిష్టత ఉంది... నేను ఆ విశిష్టతకు ఏమయినా భంగం కలిగిస్తుననేమో అని బాధ పడుతున్నాను... కాని మన ఓంకారం గురించి తెలిసిన వాళ్ళు చాల తక్కువ మంది ఉండడటం గమనిచాను.... అందుకే ఈ రోజు నుండి కొంత వివరణ ఇచేందుకు ప్రయత్నిస్తున్నాను... నేను పండితుడిని కాను... ఏమయినా తప్పులుంటే క్షమించండి... 
మిత్రులారా ఓంకారాన్ని గురించి వినడం ఒక ఎత్తు ... అర్ధం చేసుకోవడం ఒక ఎత్తు.... ఓంకారాన్ని స్పష్టం
గా ఉచ్చరించి దానిని అనుభూతి పొందడం ఒక ఎత్తు..... ఆ అనుభవాన్ని మీరూ స్వంతం చేసుకోండి...  దాని అనుభూతిని నాతొ పంచుకోండి... 
ఓంకారం సంస్కృతంలో ''ॐ''అక్షరం దైవంతో సమానం
ఓంకారమనేది.....చాల మంది అనుకునే విధంగా "ఓ" అనే అక్షరం తో ప్రారంభమయి "0" తో ముగిసేది కాదు...
 
ఇది 3 అక్షరముల సంగమం ... అవి ఆ + ఊ + మ్
ఆ --- అనే అక్షరాన్ని నాభి స్థానం నుండి ఉచ్చరించాలి.... అంటే మనం ఈ అక్షరాన్ని పలికేది గొంతు నుండి అయిన భావన నాభి (బొడ్డు) (స్వాధిష్టాన చక్రం) ద
గ్గర మొదలవ్వాలి
... 
ఊ -- ఈ అక్షరం గొంతు (విశుద్ధ చక్రం) నుండి ఉచ్చరించాలి...
మ్ - ఈ అక్షర ఉచ్చారణ మన శీర్శాగ్రం (సహస్రార చక్రం ) నుండి వెళ్లి పోవాలి...
స్వాధిష్టాన చక్రం -- అధిపతి.. బ్రహ్మ... అనగా సృష్టి....
విశుద్ధ చక్రం... అధిపతి... విష్ణు... అనగా స్థితి...
సహస్రారం.. అధిపతి.... శివుడు... అనగా... లయ

ఓంకార సృష్టి నాభి దగ్గర... మొదలయి... స్థితి... గొంతు దగ్గర ఉండి... శీర్శగ్రం దగ్గర లయం కావాలి... 
ఈ మూడు అక్షరాలను జాగ్రత్తగా ఉచ్చారించటం వలన మన లోని 3 చక్రాల గుండా cosmic energy ... మూల శక్తితో సహస్రారం ద్వార sinchronize అవుతుంది...
 
అపుడు శరీరం లో కలిగే నిజమయిన ప్రకంపనాలను మాటలలో వర్ణించ లేము....
(జ్ఞానేంద్రియాలకు అతీతమయిన వాటిని మాటలలో బోధించలేము... )

ఈ విధంగా కనీసం 7 సార్లు ఉచ్చరించి చూడండి..
 

ఈ క్రింది సూచనలు పాటించండి:
ఒకసారి పూర్తి ఉచ్ఛారణకు కనీసం 10 సెకన్ల నుండి 15 సెకన్ల సమయం పడుతుంది... ఒక సారి పూర్తి ఊపిరి తీసుకున్న తర్వాత.. ఉచ్చారణ మొదలు పెట్టండి... బయటకు స్పష్టంగా పలకండి...( లోలోపల మననం చేసుకోవద్దు... )
3 అక్షరాలకు సమమయిన ప్రధాన్యతనివ్వండి... దీనిలో కూడా రహస్యముంది...
ఆ: ఇది బ్రహ్మ స్థానము... అంటే సృష్టి స్థానం: ఈ స్థానంలో ఎక్కువ సేపు ధ్యానం చేయటం వలన మనలో కోరికలు, ఆలోచనలు పెరుగుతాయి.. అందుకే ఈ స్థానంలో ఎక్కువ సేపు ధ్యానం చేయకూడదు.. మనం ఇంతకు ముందు అనుకున్న ఒక్క సారి ఓంకార మంత్ర ఉచ్చారణలో దీని నిడివి 3 నుండి 5 సెకన్ల లోపు ముగియాలి.. ఎందుకంటే ఇక్కడ చేసే ధ్యానం వలన కోరికలు, ఆలోచనలు శక్తిని పుంజుకుని విజృంభించి మనకు శాంతి లేకుండా చేయవచ్చు...
ఊ: ఇది స్థితి స్థానము:
ఈ స్థానంలో ధ్యానం.. మన ఆలోచనలకు ఒక స్థితిని కల్పిస్తుంది.. ఇక్కడ చేసే ధ్యానానికి శ్రీ మహావిష్ణువు సహకారం ఉంటుంది.. అందుకే మన ఉచ్చారణలో చాలా మందికి ఈ ఊ కారమే వినపడుతుంటుంది...
మ్ కారము:
ఈ స్థానంలో ధ్యానం.. మన ఆలోచనలకు/కోరికలకు ఒక రకంగా చివరిది.. ఈ స్థానంలో మనకు ఈశ్వరీయ దివ్య శక్తి లభిస్తుంది.. శివుడంటే లయ కారుడు అంటే.. ఇక్కడ అన్నీ భస్మమవుతాయి.. అందుకే యోగులు, అఘోరాలో చేసే ఓంకార ఉచ్చారణలో మ్ కారం ఎక్కువగా వినపడుతుంటుంది.. ఇక్కడ ఎక్కువ సేపు ధ్యానం మనం అన్నిటికీ విరాగిగా మారేలా చేస్తుంది ...బాగా గమనిస్తే శివుని డమరుకంనుండి ’మ్’ కారం స్పష్టంగా వినవచ్చు.. అంటే ఒక్క ఓంకార ఉచ్చారణ లో ఇన్ని తేడాలున్నాయన్న మాట... అందుకే ఓంకారాన్ని చాలా స్పష్టంగా సమానంగా ఉచ్చరించగలగాలి... ఈ విషయం వలననే మనగురువులు చాలా జాగ్రత్తగా మంత్రోపదేశం చేస్తారు....
నేను వ్రాసిన దాని గురించి ఎక్కువగా భయపడకుండా ఒక్క 7 సార్లు స్పష్టంగా ఓంకారాన్ని ఉచ్చరించి చూడండి.. దానిలో ని ప్రకంపనలు గమనించండి... ఒక సారికి 2 వ సారికి మధ్య విరామ సమయంలో మనలో వచ్చే శక్తి ప్రసారాన్ని గమనించండి... నిజంగా మన హిందూ ధర్మ గొప్పదనం మనకు తెలుస్తుంది...
ఇంకొక్క విషయం...ఓంకారాన్ని మూగవాడు కూడా పలుక వచ్చు... ఎందుకంటే ఈ ఉచ్చారణకు నాలుకతో పని లేదు.. అందుకే ఓంకారానికి అంతటి విశిష్టత....
మరికొన్ని ఓంకార రహస్యాలను ఇంకొక టపాలో వివరిస్తాను..

మీరు పొందిన అనుభూతిని నాతో తప్పక పంచుకోండి..
నేను పండితుడిని కాను... ఏమయినా తప్పులుంటే క్షమించండి...
  1. ఇప్పుడే మీ బ్లాగ్ని చూశాను. అమూల్యమైన విషయాలను చక్కగా తెలియజేస్తున్నారు. ఓంకారం గురించి మీ వివరణ బాగుంది.

    ReplyDelete
  2. thank you for your explanation. please continue...

    ReplyDelete
  3. omkaram chanting daily compulsory na leka 3 days ki okasari cheyavacha

    ReplyDelete

Whatsapp Button works on Mobile Device only