Friday 21 February 2014

మన రాజకీయాలు, మన పరిస్థితి-మన తెలుగు జాతి, మన దేశ ప్రగతి మళ్ళీ ఎప్పుడు పట్టాల మీదకు వస్తుందో ... ఏమో...

మన రాజకీయాలు, మన పరిస్థితి:
అందరూ ఇలా ఉన్నారని కాదు నా ఉద్దేశ్యం....
మంచి చదువు చదివిన వారు రాజకీయాల్లోకి రావటం లేదు ...
ఒక వేళ అలా జరిగినా చదివిన చదువును మంచి పనులకు వాడు కోవడం లేదు...
ఒకవేళ అలా వచ్చిన కేజ్రీవాల్, జయప్రకాష్ గారి లాంటి
వారిని నిలవనీయడం లేదు....., పని చేయనీయడం లేదు...
అత్యంత విలువయిన సభలను నడవనీయడం లేదు..
అస్సలు దేశ పురోభివృద్ధి నిలిచిపోయింది...
పారిశ్రామిక వృద్ధి నిలిచి పోయింది...
వ్యావసాయిక వృద్ధి నిలిచిపోయింది...
మానవ వనరులు, మౌలిక వసతుల ఏర్పాటు నిలిచిపోయింది..
అనవసరంగా అమాయక ప్రజలను రెచ్చగొట్టే..
ప్రాంతీయ వైషమ్యాలను రెచ్చగొట్టే వాళ్ళే మనకు దొరుకుతున్నారు....
తమిళనాడు మాదిరి ఎన్నిక చాలా మంచిదేమో.. కనీసం పనులైనా అవుతాయి...
కనీసం చుక్క నీరు.. పేరెన్నిక గన్న డ్యాములు రిజర్వాయర్లు, నదులు లేని తమిళనాడు చూసి
ఇకపైననైనా పాలకులు జాగ్రత్త పడితే తెలుగు జాతి అభివృద్ధి ఖాయం...


మన తెలుగు జాతి, మన దేశ ప్రగతి మళ్ళీ ఎప్పుడు పట్టాల మీదకు ఎపుడు వస్తుందో ... ఏమో...
SRIRAGA

Post a Comment

Whatsapp Button works on Mobile Device only