Monday 24 February 2014

గోత్రమంటే ఏమిటి? దాని ప్రాముఖ్యత? గోత్రముల వలన ఉపయోగం?

గోత్రమంటే ఏమిటి? దాని ప్రాముఖ్యత? గోత్రముల వలన ఉపయోగం?

గోత్రం అనగా మూల పురుషుడి పేరు. మనిషి రూపానికి జన్మనిచ్చేది స్త్రీయే అయినా ఆ మనుష్యడి తాలూకు విత్తనానికి (లేక వీర్యకణానికి) జన్మనిచ్చేది మాత్రం పురుషుడే కాబట్టి గోత్రము మూలపురుషుడి బట్టి ఆధారపడి ఉంటుంది.గోత్రము అనగా గో అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.ఆటవిక జీవితమును గడపిన మానవుడు గోవులను వాటి రంగులను తొలుత ఆయా వ్యక్తుల తాతా,ముత్తాతలను గుర్తించుటకు నల్లావులవారు,కపిలగోవువారు,తెల్లావులవారు అని మూలపేర్లను కలిగి ఉండేవారు.ఏ గురువు వద్ద విద్యను అభ్యసిస్తే ఆ గురువు పేరును వశిష్ట,భరద్వాజ,వాల్మీకి అని గురువు పేరును గొప్పగా చెప్పుకునే వారు.తాము ఆ గురువు కు సంబంధించిన వారమని,ఆ గురువులే తమకు ఉత్తమగతులు కలిపిస్తారని వారిపేరే తమ గోత్రమని చెప్పుకునే వారు.ఆ తరువాత భూములను కలిగిన బోయ/క్షత్రియులు భూపని,భూపతి,మండల అనే గోత్రాలను ఏర్పరుచుకున్నారు.ముఖ్యముగా బ్రాహ్మణులు వేదవిద్యను అభ్యసించి తాము నేర్చుకున్న వేదమునే యజుర్వేద,ఋగ్వేద అని గోత్రాలను వేదముల పేర్లతో ఏర్పరుచుకొన్నారు.గోత్రాలు ఆటవిక కాలము/ ఆర్యుల కాలంలోనే ఏర్పడ్డాయి.తొలుత గోత్రములను బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మాత్రమే కలిగి ఉన్నారు. ఒకే మూల(తండ్రికి)పురుషుడికి పుట్టిన పిల్లల మధ్య వివాహ సంబంధములు ఉండ రాదని, వేరు గోత్రికుల మధ్య వివాహములు జరపటము మంచిదని గోత్రములు అందునకు ఉపకరిస్తాయని, ప్రాముఖ్యతను గుర్తించి అన్ని కులాలవారు గోత్రములను ఏర్పరచుకొన్నారు. తండ్రి(మూల పురుషుడు) చేసిన పని, వాడిన పనిముట్లు కూడా గోత్రముల పేర్లుగా నిర్ణయించ బడినాయి. క్రైస్తవుల మతగ్రంథం బైబిల్లో కూడా గోత్ర ప్రస్తావన ఉంది. కొన్ని గోత్రాలు విద్య నేర్పించిన గురువుల పేర్ల మీద ఏర్పడితే, మరికొన్ని గోత్రాలు వంశంలో ప్రముఖ వ్యక్తుల పేర్ల మీద,ఉపయోగించిన ఆయుధము, వాహనము పేర్ల మీద ఏర్పడ్డాయి. ఉదాహరణకు క్షత్రియ బుషి అయిన విశ్వామిత్రుడు వంశంలో పుట్టిన ధనుంజయుడి పేరు మీద గోత్రం ఉంది, ఖడ్గ, శౌర్య, అశ్వ, ఎనుముల, నల్లబోతుల పేర్లమీదా గోత్రములు ఉన్నాయి.(డా.చిప్పగిరి 2012)
బ్రాహ్మణుల గోత్రములు[మార్చు]

భారత దేశమునందు కల బ్రాహ్మణ కుటుంబాలు శాఖోపశాఖలుగా విస్తరించి ఉన్నారు. ప్రతి కుటుంబానికి ఒక గోత్రము, ప్రతి గోత్రానికి ముగ్గురు (త్రయార్షేయ) లేదా అయిదుగురు(పంచార్షేయ) ఋషుల వరస ఉంటుంది. ఈ ఋషుల వరసే ఈ కుటుంబాల మధ్య వారధి. బ్రాహ్మణ వివాహ విధి ప్రకారము, స్వగోత్రీకులు(ఒకే గోత్రం ఉన్న అబ్బాయి, అమ్మాయి) వివాహమాడరాదు. అలానే, త్రయార్షులలో మొదటి ఋషి కలవరాదు. వీరు దాయాదుల లెక్కన వస్తారు. ప్రతి గోత్రము సప్తర్షులలో ఒకరి నుండి వచ్చినదే.
బౌద్ధాయనస్రౌత-సూత్రము ప్రకారము విశ్వామిత్ర, జమదగ్ని, భారద్వాజ, గౌతమ, అత్రి(క్రిష్ణాత్రియ), వశిష్ట, కాశ్యప, అగస్త్య అనే 8 మంది ఋషులు,వారి సంతానము పేర్లే బ్రాహ్మణ గోత్రములు. ప్రజాపతి కి, ఈ 8 మంది ఋషులకి సంబంధము లేదు. వీరిని, వీరి సంతానమును గోత్రములని, మిగతావారిని "గోత్రవ్యయవ" అని అందురు. గోత్రములన్నీ గుంపులుగా విభజింపబడ్డాయి. వశిష్ట గణము నాలుగు గా విభజింపబడింది. అవి ఉపమన్యు, పరాశర, కుండిన, వశిష్ట. వాటికి మళ్ళీ పక్షాలు వున్నాయి. గణము, పక్షము, గోత్రము, ఇలా వస్తాయి. గణము, పక్షము, గోత్రము, అన్నీ కలిపి చదవడానిని ప్రవర అంటారు. పరాశర గోత్రానికి ప్రవర "వశిష్ట, శాక్త్య, పరాశర". ఉపమన్యు కి "వశిష్ట, భరద్వసు, ఇంద్రప్రమద". 19 మంది ఋషులు దాకా, ఏకార్షేయ, ద్వార్షేయ, త్రయార్షేయ, ఇలా ఎంత మందితో అయినా ప్రవర ఉండవచ్చు. ఆంధ్రదేశము లో కాశ్యపస గోత్రానికి కనీసము రెండు ప్రవరలు ఉన్నాయి. ఒకటి త్రయార్షేయ ప్రవర, ఇంకొకటి సప్తార్షేయ ప్రవర. ప్రవరలు రెండు విధాలుగా వున్నాయి.
శిష్య - ప్రశిష్య - ఋషి పరంపర
పుత్ర పరంపర
పుత్ర పరంపర లో ఒక ఋషి కలిసినా, వివాహము నిషిద్ధము. శిష్య - ప్రశిష్య - ఋషి పరంపరలో సగము, లేదా అంతకన్నా ఎక్కువ మంది ఋషులు కలిస్తే వివాహము నిషిద్ధము

Collected info: Malyavantham Charan Saradhi Dixit
  1. గోత్రానికి మూల పురుషుడు ఒక ఋషి అయితే, మరి కొన్ని గోత్రాలకి ముగ్గురు / ఐదుగురు / ఏడుగురు ఋషుల పేర్లు ఉన్నాయి ఎందుచేత?

    ReplyDelete
  2. గోత్రము అనేది ఎంతో లోతైన వైజ్ఞానిక జన్యు సూత్రములు లతో నిర్మించబడిన వొక అద్భుతమైన సంప్రదాయం.మెందల్స్ జన్యు సూత్రాలకు గోత్రమే వొక ఆధారం ..మెందల్స్ జన్యు సూత్రాలలో F-1/-F-2,/F-3 అనే పదాలను మీరు వినివుంటారు.వెతికి అర్ధం FIRST FILIYAL GENERATION/SECOND FILIYAL ND 3RD FILIYAL GENERATIONS...మొదటి ఫైలియాల్ జనరేషన్ లోని రుషి జన్యు లక్షణాలు f-2 లోని ఋషికి ,అక్కడినుంచి మూడోవ తరం లోని రుషి కి సంక్రమిస్తాయి..ఈ విషయాలను దృష్టిలో ఉంచుకునే మన మహారుషులు ప్రవర లో ఆ ముగ్గురు ఋషులను ఉంచారు..కంసాలి వారికి అయిదు ,దేవతలకు ఏడు వంతున ప్రవర రుషలుంటారు.ఏక గోత్రికుల మధ్య వివాహం కూడదు అన్నది[ జన్యు సూత్రాలలోని అర్ధం మనవారికి అప్పుడే తెలుసుగనుక ]ఇందుకే ...

    ReplyDelete

Whatsapp Button works on Mobile Device only