Monday 24 February 2014

పంచారామాలలోని ఒకటైన అవరావతీ , కృష్ణానదీ స్నానఘట్టాన్ని ఇసుక మాఫియా ఆక్రమించుకున్న వైనం

నమస్తే మిత్రులారా!
నిన్న కుటుంబ సమేతంగా తీర్ధయాత్ర కై అమరావతీ క్షేత్రానికి వెళ్ళాము... మేము కృష్ణానదిలో స్నానం చేసిన తర్వాత మాత్రమే దర్శనానికి వెళ్ళటం మా ఆనవాయితీ.. అక్కడ నదీ తీరానికి చేరి స్నానఘాట్ వద్దకు వెళ్ళే సరికి చాలా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాం.. ఎందుకంటే అక్కడ స్నానఘాట్ లు
స్నానఘాట్ లా లేవు!!!!.. స్థలంలో టిప్పర్ లారీ స్టాండు లా ఉండే ప్రదేశం ఉంది...
దాదాపు 20  నుండి 30 మర పడవలలో నదిలోని ఇసుకను మోటార్ల ద్వారా
తోడుతూ వెంటనే స్నాన ఘట్టం దగ్గర స్టాండులో ఉన్న టిప్పర్ లో ఇసుక లోడును నింపుతూ...

దానినుండి వచ్చిన వ్యర్థ జలాలు స్నాన ఘాట్టాలలో కలవడం నిరంతర ప్రక్రియగా కనపడింది.. మొదట స్నానం చెయ్యాలనిపించలేదు... చాలా ఉదయాన్ని రావటం.. ఎక్కువ రద్దీ లేకపోవటం మూలాన ఒక 10 అడుగుల దూరం తర్వాత నదిలో ఎక్కువ కలుషితంగా అనిపించలేదు... అందుకో కొంచెం ధైర్యం చేసి స్నానంచేయటానికి నదిలో దిగాము... అడుగు అడుగుకు లోతులో తేడా చూసుకుంటూ.. ఒక 6 అడుగులు లోపలికి వేసి ఇక ధైర్యం చేయలేదు...  మేము స్నానం చేసిన అర గంటలో దాదాపు 10 పడవల అన్ లోడీంగ్ పూర్తి అయింది... ప్రతి సారి పడవనుండివచ్చే వ్యర్థాలు మా మీదుగానే వెళ్ళాయి... చాలా కలుషితమయంగా ఉంది... సమస్య ఏమిటంటే తీరప్రాంతాలలో తవ్వకూడదు.. అందువల్ల గుంటలు పడి లోతు మడుగులుగా మారే అవకాశముంది...
అవరావతి దగ్గరి కృష్ణానది చాలా  ప్రమాదకరం.. దానికి తోడు నీటి మడుగులు ఖచ్చితంగా ఇంకా ప్రమాదకర స్థితిలోకి నెట్టుతాయి.. కానీ ఒడ్డున ఉన్న ఒక పోలీసు వారి హెచ్చరిక జాగ్రత్తలు సూచించడం మాత్రం చేయగలిగారు.. ఇసుక మాఫియాను మాత్రం నిరోధించలేక పోయారు... రాజకీయ నాయకుల అండ లేకుండా ఇది సాధ్యమేనా... పంచారామాలలో ఒక దివ్య క్షేత్రంలో ఇలా జరగటం చాలా శోచనీయం...
ఎలాగోలా స్నానం పూర్తి చేసుకుని పరమ శివుడి దర్శనం పూర్తి చేసుకుని ధ్యాన బుద్దుడిని దర్శించుకుని బయటకు వచ్చాం... యాత్ర అంతా చక్కగా సాగింది.. కానీ స్నానఘట్టాన్ని మాత్రం మర్చిపోలేక మీతో పంచుకుంటున్నాను...
SRIRAGA


Post a Comment

Whatsapp Button works on Mobile Device only