Monday 24 February 2014

ద్వారక..... శ్రీకృష్ణుడు ఏలిన ద్వారక....Part-2

ద్వారక మహానగరం :

భారతదేశంలో ఉన్న హిందువుల ఏడు పవిత్రక్షే త్రాలలో ద్వారకాపురి ఒకటి.

"
అయోధ్య మథుర మాయ కాశి కాంచి అవంతిక 
పూరి ద్వారకావతి చైవ సప్తైత మోక్షదాయిక" - గరుడ పూర్ణిమ

క్షేత్రం అంటే పవిత్రమైన ప్రదేశం. దైవీక శక్తికి కేంద్రం. జీవుడికి తుది గమ్యమైన మోక్షమును అందించే మోక్షపురి. గరుడ పురాణం పేర్కొన్న ఏడు మోక్షపురాలు వరుసగా అయోధ్య, మథుర, మాయా, కాశి, కాంచి, అవంతిక, పూరి మరియు ద్వారావతి.

1980
దశకంలో గుజరాత్ సముద్ర తీరంలో జరిగిన పరిశోధనలు భారతీయ చారిత్రక నిర్మాణంలో అపూర్వ ఘట్టాన్ని ఆవిష్కరించింది. పశ్చిమాన గోమతి నది అరేబియా సముద్రంలో కలిసే ప్రాంతంలో సాగర గర్భంలో ఒక మహానగరం బయటపడింది..

భారతీయ సంస్కృతిని సజీవంగా, వటవృక్షంగా నిలబెట్టిది. అదే ద్వారక. అయిదువేల ఏళ్ల నాడే అద్భుతాల్ని సృష్టించిన అపూర్వ నగరం... ఇవాళ సాగర గర్భంలో కనిపిస్తోంది.. అయిదు వేల ఏళ్ల తరువాత కూడా చెక్కుచెదరని మహానగరం ద్వారక.. 192 కిలోమీటర్ల పొడవు... 192 కిలోమీటర్ల వెడల్పు.. 36864 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం. నాలుగు వేల సంవత్సరాల నాడే అపూర్వ మహానగరం.. జగన్నాథుడి జగదేక సృష్టి.. 

1.
శ్రీకృష్ణుడు 12 యోజనల వరకు భూమిని సముద్రుడి వద్ద తీసుకుని విశ్వశర్మ చేత ద్వారకా నగరాన్ని కట్టించాడు.
dwaraka-ద్వారక
dwaraka-ద్వారక


2.
కలిశకం (క్రీ.పూ.3102 ) ప్రారంభానికి ముందే శ్రీకృష్ణుడి నిర్యాణంతో పాటు ద్వారక మునిగిపోతుందని చెప్పబడింది. శ్రీకృష్ణుడి ద్వారక కనీసం ఐదువేల యేళ్ల కంటే తక్కువ ప్రాచీనం కాదనేది స్పష్టం.

3.
మగధ రాజైన జరాసంధుడి దురాక్రమణల బెదిరింపుల దృష్ట్యా, ద్వారకావాసులకందరికీ అధికారిక రాచముద్రికలను పంపిణీ చేశారు. యిప్పుడు బయటపడిన ద్వారకా కట్టడాల్లో మూడు తలలున్న జంతువు(Some with Goat, others with Bull) తో వున్న రాచముద్రికల లాంటివి దొరికాయి.

4. Pottery
విషయంలో (Thermo-luminescence పరీక్షల ద్వారా ) క్రీ.పూ. 3528 సం. కిందటివని తేలాయి.
dwaraka-ద్వారక
dwaraka-ద్వారక


5.
ఆర్యుల నాగరికత ఉఛ్ఛస్థాయిలో వున్నప్పటి లిపి యిప్పటి కొన్ని ఇనుము అవశేషాలపై వున్న లిపితో పోలికలు కనిపించాయి.
dwaraka-ద్వారక
dwaraka-ద్వారక


6.
బేద్సా దగ్గిర (మధ్యప్రదేశ్ లో Vidisha) జరిపిన పురావస్తు తవ్వకాల్లో బయటపడిన ఒక దేవాలయం క్రీ.పూ. 300 కిందటిదని తేలింది. అక్కడ దొరికిన ప్రతిమల్లో చాలావాటిల్లో వాసుదేవుడి,బలరాముడి, ప్రద్యుమ్నుడి ,అనిరుధ్ధుడి,ఒక యాదవ వీరుడు సాత్యకి, విగ్రహాలను గుర్తించగలిగారు. అప్పటి కాలంలోనే శ్రీకృష్ణుడి చారిత్రకతను యివి ధృవీకరిస్తున్నాయి.
dwaraka-ద్వారక
dwaraka-ద్వారక


7.
దక్షిణ తీరాన సామంత సింహాదిత్య పాలనలోని ఒక శాసనంలో( క్రీ.పూ .574 ) శ్రీకృష్ణుడి సార్వభౌమత్వాన్ని, ఆయన రాజధానిని ద్వారకాగా అంగీకరిస్తున్నాయి.

8.
ద్వారకా నగరం ఉత్తరాన శంఖోధ్ధర వరకు , దక్షిణాన ఒఖమది వరకు, తూర్పున పిందాత వరకూ విస్తరించి వుంది. శంఖోధ్ధర కు తూర్పున 30-40 మీ. ఎత్తైన పేరుతో ఒక పర్వతంరాయివటకపేరుతో మహాభారతంలో ప్రస్తావించబడింది ( ఇప్పటి Bet Dwaraka కు తూర్పున వున్న పర్వతం).

9.
హరివంశంలో, శిశుపాలవధలో, సుధామ చరితంలో, శ్రీమద్భాగవతంలో, స్కంధ పురాణంలో, విష్ణు పురాణంలో ద్వారకా నగరపు వివరణలు, కట్టడాల తీరుతెన్నులూ మనకు కనబడతాయి.
dwaraka-ద్వారక
dwaraka-ద్వారక


10.
ప్రాచీన చరిత్ర గురించి తెలిసిన యే కొద్దిగా తెలిసినవారైనామెగస్తనీస్గురించి పరిచయం చేయనఖ్ఖరలేదు. అతని గ్రంధంలో Herakles ని , Saorasenoi ని (Surasena) ఆరాధించేవారని రాశారు. Herakles కి శ్రీకృష్ణుడికి రాచసంబంధమైన వాటిల్లో కానీ, వీరోచీతమైన గాథల్లో కానీ ఇరువురూ పాలించిన రాజ్యాల భౌగోళికాంశాల్లో కానీ సారూప్యాలు కనబడుతాయి.Herakles ని ప్రస్తావించినపుడు ‘maddurai’ అనీ మనకు కనిపిస్తుంది.

11.
క్రీ.పూ 180-165 గ్రీకు రాజు Agathocles విష్ణు చక్రంతో వున్న వాసుదేవుని ప్రతిమల్తో ముద్రించిన నాణాలని పంపిణీ చేసేవాడు.

12.
అఫ్ఘానిస్తాన్ లో పురావస్తు తవ్వకాల్లో దొరికిన నాణాల్లో ( క్రీ. పూ. 175-135 ) కృష్ణుడి, బలరాముడి ప్రతిమలతో ముద్రించిన నాణాలు బయటపడ్డాయి.

13.
క్రీ.పూ 113 లో ఒక గ్రీకు యాత్రికుడు Heliodorus దగ్గిర వాసుదేవుని ప్రతిమతో స్థూపాన్ని నిర్మించి దాని పై ఇలా చెక్కించాడు.

14.
ప్రఖ్యాత వ్యాకరణ శాస్త్రవేత్త ఫనిని ( క్రీ.పూ. 5 ) తనఅష్టధ్యాయయిలో పలు ప్రస్తావనలు కనబడతాయి. అవి కృష్ణుడు, ప్రాచీన కాలం లో గోమతీ నదీ తీరాన వెలసిన 'చక్రగీత ' నగరం గురించి. 'వాసుదేవకులని ' కృష్ణున్ని కొలిచేవారిని పిలుచుకునేవారు.

15.
కౌటిల్యుడి అర్థశాస్త్రంలో 'దుర్గావిధాన’ , ‘దుర్గానివేషప్రకరణాల్లో యీ నగర వైశాల్యం, కట్టడ విధానాలు కనబడతాయి.

16. ‘
శిశుపాలవధలో రెండో సర్గలో 31 శ్లోకాలనుంచి 33 వరకు ద్వారావతి, ద్వారకా అనే పేర్ల మీద కొన్ని వివరణ లున్నాయి.

మన నాగరికత.. మన సంస్కృతి.. మన ప్రతిభకు పట్టం కట్టిన ద్వారక.
dwaraka-ద్వారక
dwaraka-ద్వారక

dwaraka-ద్వారక
dwaraka-ద్వారక

dwaraka-ద్వారక
dwaraka-ద్వారక

dwaraka-ద్వారక
dwaraka-ద్వారక

dwaraka-ద్వారక
dwaraka-ద్వారక

dwaraka-ద్వారక
dwaraka-ద్వారక

dwaraka-ద్వారక
dwaraka-ద్వారక

క్రీస్తుపూర్వం 4000 సంవత్సరాల నాటి. ద్వారక.. ఇప్పుడు సాగర గర్భంలో.. 

Whatsapp Button works on Mobile Device only