Wednesday 28 December 2022

Kashi Yatra tour - Detailed Information - accommodation - visiting places- nearer temples - tour guide - tour planner - video -pdf free download

Kashi Yatra Tour guide - Kashi Tour Plan - Complete Tour guide for Kashi Yatra

కాశీ గురించి కాశీ యాత్ర ఎలా చేయాలి - కాశీ యాత్ర ఎలా చేస్తే సంపూర్ణ ఫలితం దక్కుతుందో యాత్రను ఎలా ప్లాన్ చేసుకోవచ్చో.. ఏమేమి చూడాలి.. ఎలా చూడాలి... లాంటి వాటి చిన్న చిన్న డిటెయిల్స్ కూడా ఇచ్చాము... కాశీ యాత్రకు వెళ్ళే వారికి షేర్ చేయండి... 

Video 👇👇👇


Kashi Yatra Detailed information in telugu 👇👇👇
కాశీలో ఏ ఏ ప్రదేశాలు చూడాలి
ఎక్కడ ఉండాలి
ఎప్పుడు వెళ్లాలి
ఎందుకు వెళ్లాలి
ఎలా వెళ్లాలి
మొదలకు ఎన్నో విశేషాలను ఒక్కొక్కదానిని స్టెప్ బై స్టెప్పు తెలుసుకుందాము మరియు ఈ విశేషాలను డైరెక్ట్ గా చూసే విధంగా శీర్షికలను కూడా ఉంచాను కాబట్టి మీకు ఏ విషయం గురించి కావాలో డైరెక్ట్గా ఆ సమయానికి వెళ్ళిపోవచ్చు... ఫ్రెండ్స్ ఏ విషయాన్ని కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి... ఇప్పటికే కాశీకి వెళ్లినవారు చాలా సార్లు కాశీకి వెళ్లిన వారు కూడా... మొదటిసారిగా కాశీకి వెళ్లే వారికి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది అందుకే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి

కాశీలో చూడవలసిన ఆలయాలు
విశ్వేశ్వర స్వామి ఆలయం
కాశీ అన్నపూర్ణేశ్వరి అమ్మవారి ఆలయం
కాలభైరవ స్వామి వారి ఆలయం
విశాలాక్షి అమ్మవారి ఆలయం
వారాహి అమ్మవారి ఆలయం
గవ్వలమ్మ తల్లి ఆలయం
మణికర్ణిక ఘాట్
దుండి గణపతి
చింతామణి గణపతి
సాక్షి గణపతి

significance to visit Kalabhairava Swamy Temple before Kashi Yatra
కాశి యాత్రను వీలైనంతవరకి ప్రారంభించే ముందు కాలభైరవ ఆలయాన్ని దర్శించి ఆయన అనుమతి తీసుకుని మనం దర్శిస్తే మంచిది అంటారు కాలభైరవ స్వామి అనుగ్రహం లేనిదే మనం కూడా మొదలు పెట్టలేమట అందుకే తప్పనిసరిగా స్వామివారి అనుమతి తీసుకుని మిగతా ఆలయ దర్శనాలని ఘాట్లను చూసేందుకు బయలుదేరితే మంచిది...

most of the Kashi Ghat will surrounded by these temples
కాశీలో మొత్తం 56 ఘాట్లు ఉంటాయి ప్రతిఘట్లో కూడా ఒక వినాయకుడి గుడి శివాలయం తప్పనిసరిగా ఉంటాయి... ఈ 56 కాట్లలోని వినాయకుడి గుడ్లు మొత్తం శక్తి కేంద్రాలే గతంలో ఈ శాస్త్రవేత్త ఎందులో ఉండే ఎనర్జీని గుర్తించి వాటిని మీద పరిశోధన చేసి దానిని నిర్ధారించారు ఈ విషయంలో అతనికి డాక్టరేటు కూడా వచ్చింది... సామవేదం షణ్ముఖ శర్మ గారు ఒక ప్రవచనంలో ఈ విషయాన్ని చాలా ప్రముఖంగా చెప్పారు... దుండి గణపతి కాశీ విశ్వేశ్వర స్వామి వారి మొదటి వైపు ఉంటుంది... అన్నపూర్ణేశ్వరి అమ్మవారు మరియు సాక్షి గణపతి ఆలయాలు మరొక గేటు వైపు ఉంటాయి... అయితే ఎంత మను అనుకున్న కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అంతా కన్ఫ్యూజ్ అవుతుంది అందుకోసమే ప్రతిసారి కూడా మనం విచారించుకొని వెళ్తేఒకదాని తర్వాత ఒకటి దర్శిస్తే సరిపోతుంది.
.
Kashi Vishweshwara Carridor present status
కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయం ఇప్పుడు విశ్వనాథ కారిడార్ లో ఒక భాగంగా ఉంది... ఎంత కారిడార్ ఇంప్రూవ్ అయినా గాని ఇంకా విశాలాక్షి అమ్మవారి ఆలయానికి దుండి గణపతి సాక్షి గణపతి విశాలాక్షి వారాహి... కాలభైరవ స్వామి.. .. ఇలా ఆలయాలకు వెళ్ళాలి అంటే మాత్రం ఆ ఇరుకు సందుల నుండే వెళ్లాల్సి వస్తుంది .. ప్రస్తుతం సాంకేతిక వ్యవస్థ సదుపాయాలు ఎంత అభివృద్ధి అయినా కనీసం ఒకటి నుంచి రెండు కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి ఉంటుంది... అయితే ఈ స్థితిని కూడా మనం అవలీలగా దాటేయవచ్చు ఎలాగంటే ...

Using Rapido and Ola Byke is an excellent mode of transport in Kashi
ప్రస్తుతం కాశీలో రాపిడో ఓలా బైక్ లాంటి సదుపాయాలు కూడా వచ్చాయి ఒక్కొక్క బైక్ మీద కనీసం ఇతర ట్రావెల్ చేసేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది చాలా సులభంగా ఉపయోగించుకునే విధంగా ఉంటుంది మీరు ఉన్న బస దగ్గర నుండి ప్రత్యేకంగా ఏ ఆలయానికి కావాలో ఆలయానికి డైరెక్ట్ గా కూడా మనం మాట్లాడుకొని బుక్ చేసుకోవచ్చు... ఇద్దరి కంటే ఎక్కువగా ఉన్నారు అనుకుంటే రెండు బైక్స్ కాల్ చేసుకోవచ్చు లేదు ఎలక్ట్రిక్ ఆటోలు కూడా ఉన్నాయి కానీ ఎలక్ట్రిక్ ఆటోలలో మనం వెళ్తే కనీసం కొంచెం దూరమైనా నడవాల్సి ఉంటుంది...

Using Packages is always economical and our expenses will be in budget
లోకల్ ఆలయాలను చుట్టి రావడానికి ప్యాకేజీ లాగా మాట్లాడుకుంటే చాలా సులభంగా ఉంటుంది కానీ కాశీ లాంటి మహా పుణ్యక్షేత్రంలో కనీసం ఒక 15 నుంచి 20 నిమిషాలు ఏ క్షేత్రంలోనైనా ధ్యానం చేయగలిగితే అది చాలా అద్భుతంగా మనకి జీవితాంతం గుర్తుండే పోతుంది అందుకోసమే కనీసం ధ్యానం చేసే తీరిక ఉంటే మంచిది...
 
Best Accommodation in Kashi
బస గురించి మనం తీసుకుంటే కేదార్ ఘాట్ సమీపంలో చాలామంది తెలుగు మాట్లాడేవారు మనకి తారసపడతారు.. తారకరామ ఆంధ్ర ఆశ్రమం మరియు సైకిల్ స్వామి వారి ఆశ్రమం ఈ ఘాట్ దగ్గరే ఉంటాయి... సైకిల్ స్వామి వారి ఆశ్రమంలో బస కొంచెం పూర్వకాలపు ఎల్లను తలపిస్తుంది కానీ ఆహారం మాత్రం చాలా బాగుంది... తారక రామాంధ్ర ఆశ్రమంలో అన్ని రకాలైన బసలు మనకి లభిస్తాయి... అంటే బ్యాచిలర్ అకామిడేషన్ నుండి మొదలుకొని ఇద్దరు ఉండే దానికి ముగ్గురు ఉండే దానికి మరియు నెల మొత్తం ఉండేదానికి వేరు వేరు పరిస్థితులకు తగిన విధంగా మనం గదులను రిజర్వ్ చేసుకోవచ్చు... అక్కడ ఉండే గదులు మాత్రమే కాక మనం రిక్వెస్ట్ చేస్తే వారికి affliated గా ఉన్న కొన్ని భవనాలలో వసతి కూడా మనకు కల్పిస్తారు... ఇంకా ఎన్నో ప్రైవేటు ఆశ్రమాలు లాడ్జీలు అన్నీ కూడా అన్నపూర్ణేశ్వరి కాశీ అన్నపూర్ణేశ్వరి సాయి అన్నపూర్ణేశ్వరి అనే పేరుతోటి మనకి చాలా కన్ఫ్యూజన్ గా ప్రతి ఆశ్రమం కూడా నిజమేనేమో అన్నంత ఇదిగా కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇదివరలో ఎవరో దాతలు ఏర్పాటు చేసిన సత్రాలే... మనం తగువిధంగా bargain చేస్తే ఒక మనిషికి 150 రూపాయలు నుంచి 250 రూపాయల దాకా బస చార్జీలు ఉంటాయి.. కొన్ని సత్రాలలో అయితే మధ్యాహ్నం మరియు సాయంత్రకాలంలలో భోజనం కూడా ఉచితంగా ఇస్తున్నారు.. 

శ్రీ తారకరామాంధ్ర ఆశ్రమము
088742 88882

సైకిల్ స్వామి ఆశ్రమము - వారణాసి
ఫోన్ నెంబర్: 0542 245 0502




గతంలో కాశీలో చాలా మోసం అనేటట్టుగా ఉండేది కానీ ప్రస్తుతం ఆ సిచువేషన్ లేదు... మేము దాదాపుగా ఏడు రోజులు ఉన్నాము ఎక్కడ కూడా మోసానికి సంబంధించిన ఆనవాళ్లు కూడా మా దరి చేరలేదు... మరీ కేదార్ ఘాట్ దగ్గర అయితే విశ్వనాథ శాస్త్రి( అనే పండితుల దగ్గర నుంచి మొదలుకొని అన్ని రకాల కార్యక్రమాలు కూడా తెలుగువారి ద్వారానే నిర్వహించుకున్నాము...

ప్రతి దానికి ఒక ప్యాకేజీ ఉంటుంది జాగ్రత్తగా ముందు సెట్ చేసుకోవాలి... పితృ కార్యక్రమాలకు దాదాపుగా 2000 రూపాయల దాకా తీసుకున్నారు... పంతులుగారు కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే తీసుకున్నారు మిగతాయి మేము బ్రాహ్మణ బోజన ఖర్చుల కింద ఇచ్చాము... అందుకే పితృ కార్యాలకి దాదాపుగా 2 వేల కంటే ఎక్కువ అవ్వట్లేదు.. అయ్యవారి తోటి మీరు సెట్ చేసుకునేటప్పుడు అయ్యవారి పారితోషికం మరియు బ్రాహ్మణ బోజనాలతో సహా అని తెలుసుకొని చేయండి సరిపోతుంది... 
Vishwanatha Shastry Phone no. - 9415223961, 8779055088, 9336073363

Best Boating time in Kashi
మేము వెళ్లిన సమయంలో గంగా నదిలో ప్రవాహం ఎక్కువగా ఉండటం వలన బోటింగ్ చేయడానికి కుదరలేదు కానీ వేర్వేరు చానల్స్ ఇచ్చిన సమాచారం ప్రకారం సాయంత్రం 4:30 కి బోటింగ్ మొదలు పెడితే గంగా హారతి సమయంలో బోటు నుంచి గంగాహారతిని చూసే విధంగా ప్లాన్ చేసుకుంటే మంచిది...

ఎప్పుడు వెళ్ళాలి??
కాశీని వర్షాకాలంలో వరదలు ముంచి వేసినప్పుడు దర్శిస్తే ఘాట్లన్నీ మునిగిపోయి గట్ల అందాన్ని మనం పూర్తిగా చూడలేము...
కాశీ ని మనం డిసెంబర్ నుంచి ఫిబ్రవరి నెలలో దర్శించుకుంటే గంగా ప్రవాహం సంబంధించిన వరద తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది మంచి సమయం... ఈ సమయంలో ఘాట్లన్నీ వరద నీరు లేకుండా మనకి పూర్తిగా దర్శనమిస్తాయి.. సాధారణంగా అన్ని ఘాట్లు తిరగటానికి మనకి అరగంట కంటే ఎక్కువ పట్టదు కానీ విడివిడిగా మనం రోడ్డు ద్వారా ఘట్లను సందర్శించాలంటే మాత్రం చాలా ఎక్కువ సమయం తీసుకుంటుంది మరియు ఎక్కువ ఖర్చు కూడా అవుతుంది... ప్రతిఘట్లో ఉన్న సూర్య దేవాలయాలను మరియు గణపతి ఆలయాలను సందర్శిస్తే మంచిదే కాకపోతే మీకున్న సమయ సౌలభ్యాన్ని బట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి...
 
Plan for Lunch or Dinner at Kashi Annapurneshwary Temple
కాశీ అన్నపూర్ణేశ్వరి ఆలయంలో తప్పనిసరిగా మీరున్న చేరుకున్న సమయాన్నిబట్టి బోజన కార్యక్రమాలను కచ్చితంగా చేయండి మిస్ కాకుండా... అద్భుత ప్రసాదం అది..

Kashi Vishwanath Darshan
కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయానికి ఇప్పుడు రద్దీ చాలా ఎక్కువగా ఉంది ఇదివరకటిలా స్వామివారిని ముట్టుకోవడానికి అనుమతి ఉండటం లేదు కేవలం కొన్ని ప్రత్యేక సమయాలలో మాత్రమే దానికి అనుమతిస్తున్నారు కాబట్టి సమయాన్ని చూసుకొని ఆ సమయంలో మాత్రమే దర్శించుకునే విధంగా ప్లాన్ చేసుకోండి...

Kashi and Gnanavapi
కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో జ్ఞానవాపి మసీదుకు ఎదురుగా ఉన్న నందిని జ్ఞానవాపి మందిరాన్ని కూడా ఒకసారి పరికించండి స్వామివారిని ఆలయంలో కనీసం 15 నిమిషాలు అన్న కూర్చుని ధ్యానం చేసుకునే విధంగా ప్లాన్ చేయండి

Dashaashwamedha Ghat links to various temples in Kashi
కాశీలోని ప్రధాన ఆలయాలు మరియు ఘాట్లన్నీ దశాశ్వమేధ ఘాటుని అనుసంధారంగా చేసుకొని నిర్మాణం జరిగింది కాబట్టి మనం ఏ ఆలయాన్ని దర్శించుకోవాలన్నా దశాశ్వమేధ ఘాట్ నుంచే ప్రారంభించాల్సి వస్తుంది.. దశాశ్వమేధ ఘాట్ నుంచి కాశీ విశ్వేశ్వర ఆలయానికి వెళ్లే త్రోవలోనే కుడి చేతి వైపు మనకి ఈ బోర్డు కనబడుతుంది ఈ బోర్డులో మీరు స్పష్టంగా తెలుగులో కూడా రాసి ఉండటాన్ని గమనించవచ్చు చాలా క్లియర్ గా ప్రతి మలుపు దగ్గర కూడా బోర్డులు ఉంటాయి... ముందుగా విశాలాక్షి అమ్మవారి ఆలయం ఆ తర్వాత వారాహి అమ్మవారి ఆలయం వస్తాయి... 2 వేర్వేరు సందులలో ఉంటాయి ఒక్కొక్కసారి మనం ఆలయాన్ని దాటి వెళ్ళిపోతాం కూడా... అంత పేరు ప్రఖ్యాతి పొందిన ఆలయాలు చాలా సింపుల్ గా మనకి కనపడతాయి..

Varahi Temple Details in Kashi
వారాహి అమ్మవారు కాశీ పట్టణానికి గ్రామ దేవత... ఈ అమ్మవారు చాలా ఉగ్రరూపం లో ఉంటుంది డైరెక్ట్ గా చూసినా కొంతమంది మతిస్థిమితం తప్పు అన్ కంట్రోల్ గా ఉండటం వలన అమ్మవారిని డైరెక్ట్ గా చూపించరు మొదటి అంతస్తు నుంచి రెండు రంధ్రముల ద్వారా మాత్రమే చూపిస్తారు ఒక రంద్రం నుంచి చూస్తే అమ్మవారి కాళ్లు కనపడతాయి మరొకరు రంద్రం నుండి చూస్తే అమ్మవారి తలలో కొంత భాగం మాత్రమే కనపడుతుంది.... వారాహి అమ్మవారు రాత్రంతా నగరవీధుల్లో కాపలాగా తిరుగుతుందట... రాత్రి మొత్తం కాపులగా ఉండి తెల్లవారుజామున 5:30 గంటలకు ఆలయానికి చేరుతుంటుంది కాబట్టి ఆ సమయంలో మాత్రమే దర్శనం ఉంటుంది...కాబట్టి ఈ ఆలయం కేవలం ఉదయం 5:30 నుండి 7 గంటల మధ్య వరకు మాత్రమే ఉంటుంది తర్వాత ఆలయం మూసివేస్తారు కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఆ ఆలయాన్ని దర్శించుకునే విధంగా ప్లాన్ చేయండి...

Manikarnika Ghat information in telugu
మణికర్ణిక ఘాట్లో ఒక కుండం ఉంటుంది... ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో దేవతలందరూ అక్కడికి వచ్చి స్నానం చేస్తారని అలా చేసేటప్పుడు మనం కూడా అదే కొండల్లో స్నానం చేయడం వలన పుణ్యఫలం దక్కుతుందని ఒక్కరి కంటిలోనైనా మనం కనుక పడితే మనకు మోక్షం ప్రాప్తిస్తుంది అని ఒక నమ్మకం ఉంది కాబట్టి ఆ కుండంలో స్నానం చేసేందుకు ప్రయత్నించండి... అక్కడ బ్రాహ్మణులు కుండంలో మరియు ఘాట్లో కూడా స్నానం చేపిస్తారు కాబట్టి ఒకేసారి గంగా స్నానాన్ని కూడా చేసినట్లు అవుతుంది...

Maa Vishalakshi Temple information in telugu
విశాలాక్షి అమ్మవారి ఆలయంలో రెండు విగ్రహాలు ఉంటాయి మొదటి విగ్రహానికి ఎడమవైపు జస్ట్ వెనకాలే మనం పరికించి చూస్తే ఇంకొక విగ్రహం కనబడుతుంది... అదే అసలు విగ్రహం ముందు ఉన్నది ఉత్సవ విగ్రహం లాంటిది... అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి కూడా వీలుగా ఉంటుంది ఎక్కువ రద్దీగా కూడా అనిపించలేదు... మేము అమ్మవారి ఆలయంలో ఎదురుగా అంటే ఎడమ చేతి వైపు ఒక మూలలో కూర్చుని లలిత పారాయణం చేయగలిగాము ఎవరు ఏమీ అనలేదు... మౌనంగా కూర్చొని కొద్దిసేపు ధ్యానం చేస్తే చాలా అద్భుతమైన అనుభూతికి లోనవుతారు తప్పక ధ్యానం చేయండి.. ఈ ఆలయంలో అమ్మవారి చీరలను మనకి విక్రయిస్తారు... మీ బడ్జెట్ ప్రకారం తప్పక ఒకటైన తీసుకోండి... ఈ ఆలయం వెలుపల చాలా చీరల దుకాణాలు ఉంటాయి ఆటో వారు తప్పక ఈ దుకాణాల దగ్గరికి తీసుకువెళ్తారు జాగ్రత్తగా bargain చేసి తీసుకోండి... అమ్మవారి కుంకుమను జాగ్రత్తగా తీసుకుని ఇంటి దగ్గరికి తీసుకువచ్చి నిత్యం ధరిస్తే మంచిది...


Kalabhairavaswamy temple information intelugu 
కాలభైరవ స్వామి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసే విధంగా ఉంటుంది అయితే ఈ ప్రదక్షిణ ప్రాకారంలో మనకి.. చుట్టూ నెమలితో చేసిన చిన్న కొరడా లాంటి దానితో వీపు మీద కొడుతూ ఉంటారు ఇలా చేస్తే యమలోకంలో మనం భవిష్యత్తులో అనుభవించే కొన్ని శిక్షలను తప్పించుకోవచ్చు అని ఒక నమ్మకం ఉంది కాబట్టి ఎవరో ఒకరి దగ్గర ఎంచుకొని తప్పనిసరిగా దాంతో వీపు పైన కొట్టించుకోండి...
బయట మనకు కాలభైరవ స్వామి కి సంబంధించిన కాశీధారాలు మరియు వేరువేరు వస్తువులు కనపడతాయి ఒకవేళ విమానంలో ప్రయాణించే వారైతే ఇంటి ముందు కట్టే ఒక బిళ్ళ ఉంటుంది ఆ బిళ్ళను మాత్రం తప్పనిసరిగా బ్యాగేజీలో వెళ్ళిపోయే విధంగా చేసుకోండి విమానంలో కాక్పిట్లోకి దీనిని అనుమతించరు...

Gavvalamma Temples information in telugu
గవ్వలమ్మ ఆలయానికి వెళ్ళినప్పుడు మనకి నాలుగు గవ్వలను ఇస్తారు ఆ గవ్వలను అమ్మవారి మీదకు అక్షింతలు లాగా వెయ్యమంటారు మనం మూడు గవ్వలను మాత్రం వేసి ఒక గవ్వను ఇంటికి తెచ్చుకోవాలి మర్చిపోకండి... ఈ గవ్వను మన డబ్బులు పెట్టలో గాని డబ్బులు ఉంటే బీరువాలో గాని ఉంచుకోవాలి ... గవ్వలు శ్రీ లక్ష్మీ దేవి అమ్మవారికి ఇష్టమైన వస్తువు వాటిని మన ధనం ఉంచే దగ్గర ఉంచితే... ధనలక్ష్మి దేవత మనల్ని అనుగ్రహిస్తుంది అని నమ్మకం...

Information about Saranath, Kashi Fort, Birla Temple in Kashi
కాశీలో ఇంకా సారనాథ్ దగ్గర బౌద్ధ స్తూపాలను కాశీరాజు కోటను ఇంకా బిర్లా మందిరాన్ని కొన్ని ప్రదేశాలను ప్యాకేజీలా చేసుకొని మనం ప్రత్యేకంగా వెళ్ళవచ్చు... ప్రతి సత్రంలో కూడా వాటికి సంబంధించిన వివరాలు మనకు దొరుకుతాయి మీరు వెళ్ళాలి అనుకుంటే ఎవరో ఒకరిని సంప్రదించండి అది చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుంది విడివిడిగా వెళ్తే మాత్రం ఎక్కువ ఖర్చవుతుంది...

Visiting places near Kashi
కాశీ చుట్టుపక్కల కూడా గయా.. ప్రయాగ.. అయోధ్య.. నైమిశారణ్యం... హరిద్వార్ కేదార్నాథ్ బద్రీనాథ్ లాంటి వాటికి కూడా ప్యాకేజీలు కనపడతాయి... జాగ్రత్తగా ఎంచుకుంటే మనం ఆయా ప్రదేశాలను చూడవచ్చు..

Best Kashi Travelling tips
రైలులో కాశీని చేరటానికి దాదాపు 20 నుండి 24 గంటల వరకు పడుతుంది... కుటుంబంతో లేజర్ గా వెళ్లాలి అనుకునేవాళ్లు ఇలా వెళ్లొచ్చు... అయితే IRCTC వారు కొన్ని ప్యాకేజీలను ఇస్తారు ఆ ప్యాకేజీ లో భాగంగా వెళ్తే చాలా తక్కువ ఖర్చుతో వెళ్లవచ్చు... ఇంకా లోకల్ ప్యాకేజ్ ఏమన్నారేమో చెక్ చేసుకుని అలా అయినా వెళ్లొచ్చు.. లోకంలో దాదాపు 15 మంది 20 మంది అలా ఒక గ్యాంగ్ లాగా వెళ్తే సపరేట్గా ఏసీ బస్సు వేసుకొని దారిలో వచ్చే క్షేత్రాలు అన్ని చూసుకుంటూ చూయించుకుంటూ వెళ్తారు అలా అయిన ట్రై చేయవచ్చు...


కాశీ గయా ప్రయాగలలో ఒకసారి మనం పిండ ప్రదానం చేస్తే జీవితకాలంలో మిస్సయ్యే ఒకటి రెండు పితృ కార్యాల లో ఏర్పడే లోపం కూడా సరి చేయబడుతుంది అని ఒక కథనం ఉంది...


కాశీ పట్టణంలో పిండ ప్రదానాలు చేయటానికి ప్రధానంగా వెళ్లాలి అనుకునేవారు మహాలయ పక్షాలలో వెళ్తే మంచిది... అప్పుడు ఎన్నో రెట్ల పుణ్యఫలం మనకు దక్కుతుంది మన పితృదేవతలను కూడా తృప్తిపరిచిన వారం అవుతాము.. కాశీ పట్టణం అనేది తిరుపతి కాంచీపురం ల లాగా విహారయాత్ర కాదు అది ఒక మహాస్మశానం... ప్రత్యేకంగా మణికర్ణిక ఘాట్లో నిరంతరం స్థితులు కాలుతూనే ఉంటాయి మనకి ఎన్నో శవాలు ఎదురవుతూ ఉంటాయి అందుకే జీవితంలో ఒక స్థాయికి చేరిన వారు మాత్రమే కాశీకి వెళ్ళాలి అని అనేది ఇదివరలో మన పెద్దలు ఒక శాస్త్రంలా చెప్పారు... కాశీకి వెళ్లిన తర్వాత అదోరకమైన అలౌకికభావన చాలా రోజులు ఉంటుంది అది ఇహలోకంతో సంబంధం ఉండేది కాదు అందుకే సంసారానికి వీటన్నిటికీ వివాహ బంధానికి దూరం అవుతారు అనే ఉద్దేశంతో పూర్వం పెద్దలు కొన్ని నియమాలను ఏర్పరిచారు... కాశీలో జరిగే పితృ కార్య తంతులను కానీ శవదహనాలను కానీ వీడియో తీయకూడదు.

ఇది మా YouTube Channel... దయచేసి మా చానెల్ ను subscribe చేయగలరు.. మీరు కూడా మాకు సహాయం చేసినట్లు అవుతుంది

Tags:
complete kashi tour in Telugu,Kashi temple 4K videos,Kashi Vishwanath carridor present status video 4K download Kashi Yatra full details in telugu, Varanasi videos in telugu , varanasi, kashi tour plan in telugu 4k videos, varanasi tour full details in telugu, kashi tour details in telugu, kashi tour guide in telugu, kashi tour full information in telugu, varanasi telugu, varanasi best tour plan, varanasi tour, varanasi tour guide, kasi temple varanasi telugu, varanasi tourism, varanasi telugu asramama, varanasi city tour, tourist places in varanasi, telugu hotels varanasi, varanasi kashi tour, kashi varanasi tour, kashi vishwanath temple

Post a Comment

Whatsapp Button works on Mobile Device only