Thursday 8 December 2022

Arthnareeshwara Temple information and complete tour guide in telugu free download pdf video

Arthnareeshwara Temple information and complete tour guide in telugu free download pdf video
హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక అద్భుతాన్ని చూద్దాం.. మీకు కనబడుతున్న ఈ కొండ అంత ఆంజనేయ స్వామే ఒక అద్భుతం...

ఈ కొండలో ఆంజనేయస్వామి రూపం కనపడుతుందా ఫ్రెండ్స్ మీకు...

అయితే ఆంజనేయ స్వామి రూపాన్ని పోలిన ఈ కొండని చూడాలి అంటే మనం తమిళనాడులోని ఈ రోడ్డు పట్టణానికి అత్యంత సమీపంలో ఉన్న Thiruchengode పట్టణానికి వెళ్లవలసి ఉంటుంది...

 

ఈ పట్టణంలోని ఈ కొండ మీదే అర్ధనారీశ్వర స్వామి వారి ఆలయం ఉంటుంది...
చోళులు కట్టించిన అతి పురాతనమైన ఈ ఆలయం దాదాపు 1000 సంవత్సరాల కంటే పైన చరిత్ర కలిగినది... అద్భుతమైన శిలా సంపదతో విరాజీల్లుతూ చూపులను కట్టిపడేసే ఈ ఆలయం మొత్తం వీక్షించాలంటే కనీసం ఒకరోజు పడుతుంది అంత అద్భుతంగా ఉంటాయి శిల్పాలు...
arhtanarishwarar Temple sculptures information


జీవితకాలంలో ఒకసారైనా దర్శించదగిన ఆలయములలో ఈ ఆలయం కూడా ఉంటుంది అంటే అతిశయోక్తి కాదు ఎందుకంటే... లింగ రూపంలోనే మహాశివుని అర్చించే మనకు మనిషి రూపంలో మహాశివుడు దర్శనమిచ్చే క్షేత్రాలు చాలా తక్కువగా ఉంటాయి... అందునా ఓకే శిల్పంలో అమ్మవారు మరియు అయ్యవార్లు ఇద్దరు అర్ధనారీశ్వరుల దర్శనం ఇచ్చే క్షేత్రం కేవలం ఇది ఒక్కటి మాత్రమే... పేరుకు తగ్గట్లే ఈ ఆలయాన్ని గనక భార్యాభర్తలు ఇద్దరూ కలిసి దర్శనం చేసుకుంటే వారి కాపురం జీవిత కాలంలో ఎటువంటి పొరపొచ్చాలు కలుగవు అట. దాదాపు విడాకుల దాకా వెళ్ళిన జంటలు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకుంటే వారి మధ్యలో ఉండే కలతలన్నీ తొలగిపోతాయి అని వారు జీవితకాలం అన్యోన్యంగా జీవిస్తారు అని స్థలపురాణము .. ఎంతో మహిమాన్వితమైన ఈ క్షేత్రాన్ని కోరి దర్శించగలక్షేత్రాల లిస్టులో మనం ఉంచుకోవచ్చు ... ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి... 


అలా క్షేత్రపాలకుడి రూపమే కొండ మొత్తం కనపడడం... క్షేత్రాన్ని చూడటానికి వచ్చిన వారికి లభించే ఇంకొక బంపర్ గిఫ్ట్ లాంటిదే ...
 
తిరుచెంగోడ్ పట్టణం తమిళనాడులోని ఈరోడ్ కు అత్యంత సమీపంలో ఉంటుంది...
ఇలా సయనించిన ఆంజనేయస్వామి ఆకారంలో ఉండే కొండ కేవలం ఇక్కడ మాత్రమే ఉండటం అది మనకు అత్యంత సమీపంలో ఉండటం మన అదృష్టం ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథనం మా కథనాలు కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వెంటనే మా స్టోరీస్ మీకు అందేందుకు బెల్ ఐకాన్ నొక్కండి
...

Post a Comment

Whatsapp Button works on Mobile Device only