Tuesday, 17 May 2022

TirumalaGiri Sri Venkateshwara Swami Temple information Sthala Puranam in telugu pdf free download video - తిరుమలగిరి- శ్రీ వెంకటేశ్వర స్వామి

TirumalaGiri Sri Venkateshwara Swami Temple information Sthala Puranam in telugu pdf free download video
తిరుమలగిరి- శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, జగ్గయ్యపేట, కృష్ణాజిల్లా
(ఈ ఆలయం యొక్క వీడియో పోస్ట్ చివరలో ఉంచాము... మిస్ కావద్దు)

మన భారతదేశం ఎన్నో పుణ్యక్షేత్రాలకు పుట్టిల్లు...
కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన ప్రదేశం తిరుమల తిరుపతి... ఆ వెంకటేశ్వర స్వామి ఆలయాలు ప్రపంచం మొత్తం ఉన్ననూ... ఈరోజు మనం పరిచయం చేస్తున్న ఈ తిరుమలగిరి పుణ్యక్షేత్రానికి ఒక ప్రత్యేకత ఉంది... అన్ని వెంకటేశ్వర స్వామి క్షేత్రాలలో వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రధానంగా కోలచడం జరుగుతుంది... కాని ఈ క్షేత్రములో స్వామి వారిని పుట్ట రూపంలో కొలుస్తారు...

ఒకసారి భృగు మహర్షి పరీక్షకోసం స్వామివారి వక్షస్థలమును పాదములతో తంతారు... వాస్తవంగా భృగు మహర్శి వారు లక్ష్మీ దేవి అమ్మవారికి పితృ సమానులు అయిననూ... తన నివాస స్థలము అయిన వక్షస్థలాన్ని భృగుమహర్షి తన్నినా స్వామి వారు ఏమీ అనలేదని... లక్ష్మీదేవి అమ్మవారు అవమానంగా భావించి స్వామివారిపై అలిగి వెళ్ళి పోతుంది.. లక్ష్మీ దేవి అమ్మవారు వెంకటేశ్వర స్వామి వారిని వదిలి వైకుంఠం వదిలి అలిగి వెళుతుంది... అమ్మవారి కోసం స్వామి వారు తిరుగుతూ తిరుగుతూ అలిసి ఒక పుట్టలో విశ్రమించడం... ఆకలి గొన్న ఆయన ఆకలి తీర్చడానికి బ్రహ్మ దేవుడు గోవు రూపంలో పాలు ఇవ్వటం ఆ కథ గురించి అందరికీ తెలిసిందే...
వెంకటేశ్వర స్వామి వారు పుట్టలో సేదతీరిన ప్రదేశం ఇదే అని ... ఇక్కడి భక్తుల కోరిక మేరకు స్వామి వారు ఆ పుట్ట రూపంలో ఇక్కడ వెలిశాడని క్షేత్ర పురాణం .
వెంకటేశ్వర స్వామి వారు శ్రీదేవి భూదేవి సహితము గా పుట్ట రూపంలోనే ఇక్కడ కొలువు అందుకుంటారు....
అందుకే అన్ని దేవాలయాలలో ఉన్నట్లుగా ఇక్కడ అభిషేకములు ఉండవు...
పుట్టలో ఉన్న రంధ్రాల స్థానంలో నామములు దర్శనమిస్తాయి... అందుకే ఈ వెంకటేశ్వర స్వామిని నామాల వెంకటేశ్వర స్వామి అని కూడా పిలుస్తారు...
ఈ క్షేత్రం లో సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మాత్రమే దర్శనములు ఉంటాయి ... మిగిలిన వేళల్లో ఇక్కడ దర్శనం ఉండదు... అర్చకుల వారి తో సహా చీకటి పడకముందే మొత్తం కొండ దిగి రావాల్సిందే... స్వామివారు ఇక్కడ సర్ప రూపంలో సంచరిస్తారు అని కథనం ఉంది... అలా చీకటి పడిన తరువాత ఆ రూపాన్ని చూసి చాలా మంది చనిపోయారని అప్పటినుండి రాత్రివేళల్లో కొండపై సంచారాన్ని నిషేధించారని ఒక కథనం ప్రచారంలో ఉంది... పుట్టపై నీరు పోస్తే పుట్ట కరిగిపోతుంది అందుకే ఈ క్షేత్రంలో లో ఎటువంటి అభిషేకములు జరగవు...

అయినప్పటికీ తెల్లవారి ఆలయమును తెలిసినప్పుడు చూస్తే అభిషేకం జరిగిన ఆనవాళ్లు కనపడతాయట... ముక్కోటి దేవతలు ఇక్కడకు వచ్చి స్వామిని రాత్రివేళల్లో అభిషేకిస్తారని కథనాలు ఉన్నాయి...

ఇంకా ఈ క్షేత్రంలో మంచి వేసవి సమయంలో కూడా కొండపై ఉన్న ఈ పుష్కరిణిలో నీరు ఉండటం ఆశ్చర్యాన్ని కలగిస్తోంది... ఈ పుష్కరిణిలో స్నానం చేసిన వారికి ఎన్నో వ్యాధులు నయమవుతాయని నమ్మకం... స్వామివారి పుష్కరిణి సమీపంలోనే స్వామివారి పాదముద్రలు కూడా కనపడతాయి...

ఇక్కడ క్షేత్రపాలకుడిగా మల్లేశ్వరునిగా ఈశ్వరుని కొలుస్తారు ఆయనకు ఇంకొక కొండపై ప్రత్యేకంగా శివాలయం కూడా ఉంది...

వెంకటేశ్వర స్వామి వారి ఆలయమునకు మెట్ల దారి మాత్రమే కాక ఘాట్రోడ్డు కూడా ఉంది... మెట్ల మార్గంలో గరుడ విగ్రహం ఆంజనేయ స్వామి వారి గుడి కోనేరు స్వామివారి పాద ముద్రలు మరియు నిత్యాన్నదాన పథకం ఉన్న ప్రదేశం కూడా కనబడుతుంది... ప్రతిరోజు మధ్యాహ్నం దాదాపు ఒక రెండు వందల మంది కి నిత్యం ఆహారం ఉండే విధంగా దాతల సహకారంతో ఈ కార్యక్రమం365 రోజులూ నడుస్తుంది... మధ్యాహ్నం 1:30 లోపు దర్శనం అయిపోతే భోజనం ఉచితంగా అందుకునే వీలుంది... ఖమ్మం నల్లగొండ సూర్యాపేట కృష్ణా జిల్లాలలో చాలామందికి ఈ క్షేత్రం కొంగు బంగారం లాంటిది.... మేము కూడా చిన్నప్పుడు ఏడవ తరగతి పదవతరగతి లాంటి పెద్ద పెద్ద పరీక్షలు పాసైన తర్వాత తలనీలాలు ఇచ్చిన వారమే... ఇది భక్తులందరికీ కొంగుబంగారం ఈ క్షేత్రం ఎంతో మహిమాన్వితమైన క్షేత్రం... ఇక్కడకు వచ్చి కోరిన కోరికలు తప్పని సరిగా నెరవేరతాయి ...

కృష్ణాజిల్లా జగ్గయ్యపేట కు అతి సమీపంలో ఉన్నది ఈ క్షేత్రం ఒకేరోజు వేదాద్రి మరియు తిరుమలగిరిని దర్శించుకోవచ్చు...

మా You Tube Channel ని Subscribe చేసుకోండి. మాకు కొంచెం support ఇచ్చినట్టుగా ఉంటుంది. 


మా స్తోత్ర సూచిక లోని >>శివ స్తోత్రాలు << కోసం లింక్ చూడండి

మా YouTube Channel ను SUBSCRIBE చేయండి.. మమ్ము కొంచెం Encourage చేసినట్లు అవుతుంది.. Please subscribe our Channel
👉👉👉To Subscribe us please click here👈👈👈


ఈ వీడియోలో ఆలయాన్ని ఆలయ విశేషాలను పూర్తిగా చూడవచ్చు.. 



మా బ్లాగు లోని వేర్వేరు ముఖ్యమైన ఆలయ విశేషాలను స్థలపురాణములను గురించిన పోస్ట్ క్రింది లింక్ లో మీరు చూడవచ్చు...
👇👇

Post a Comment

Whatsapp Button works on Mobile Device only