1) ఆదౌ కర్మ ప్రసంగాత్కలయతి కలుషం మాతృకుక్షౌ స్థితం మాం విణ్మూత్రామేధ్యమధ్యే కథయతి నితరాం జాఠరో జాతవేదాః ।
యద్యద్వై తత్ర దుఃఖం వ్యథయతి నితరాం శక్యతే కేన వక్తుం క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భో శ్రీ మహాదేవ శంభో ॥
2) బాల్యే దుఃఖాతిరేకో మలలులితవపుః స్తన్యపానే పిపాసా నో శక్తశ్చేంద్రియేభ్యో భవగుణజనితాః జంతవో మాం తుదంతి ।
నానారోగాదిదుఃఖాద్రుదనపరవశః శంకరం న స్మరామి క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భో శ్రీ మహాదేవ శంభో ॥
3) ప్రౌఢోఽహం యౌవనస్థో విషయవిషధరైః పంచభిర్మర్మసంధౌ దష్టో నష్టోఽవివేకః సుతధనయువతిస్వాదుసౌఖ్యే నిషణ్ణః ।
శైవీచింతావిహీనం మమ హృదయమహో మానగర్వాధిరూఢం క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భో శ్రీ మహాదేవ శంభో ॥
4) వార్ధక్యే చేంద్రియాణాం విగతగతిమతిశ్చాధిదైవాదితాపైః పాపై రోగైర్వియోగైస్త్వనవసితవపుః ప్రౌఢహీనం చ దీనం ।
మిథ్యామోహాభిలాషైర్భ్రమతి మమ మనో ధూర్జటేర్ధ్యానశూన్యం క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భో శ్రీ మహాదేవ శంభో ॥
5) నో శక్యం స్మార్తకర్మ ప్రతిపదగహనప్రత్యవాయాకులాఖ్యం శ్రౌతే వార్తా కథం మే ద్విజకులవిహితే బ్రహ్మమార్గేఽసుసారే ।
జ్ఞాతో ధర్మో విచారైః శ్రవణమననయోః కిం నిదిధ్యాసితవ్యం క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భో శ్రీ మహాదేవ శంభో ॥
6) స్నాత్వా ప్రత్యూషకాలే స్నపనవిధివిధౌ నాహృతం గాంగతోయం పూజార్థం వా కదాచిద్బహుతర గహనాత్ఖండబిల్వీదలాని ।
నానీతా పద్మమాలా సరసి వికసితా గంధధూపైః త్వదర్థం క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భో శ్రీ మహాదేవ శంభో ॥
7) దుగ్ధైర్మధ్వాజ్యుతైర్దధిసితసహితైః స్నాపితం నైవ లింగం నో లిప్తం చందనాద్యైః కనకవిరచితైః పూజితం న ప్రసూనైః ।
ధూపైః కర్పూరదీపైర్వివిధరసయుతైర్నైవ భక్ష్యోపహారైః క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భో శ్రీ మహాదేవ శంభో ॥
8) ధ్యాత్వా చిత్తే శివాఖ్యం ప్రచురతరధనం నైవ దత్తం ద్విజేభ్యో హవ్యం తే లక్షసంఖ్యైర్హుతవ హవదనే నార్పితం బీజమంత్రైః । నో తప్తం గాంగాతీరే వ్రతజననియమైః రుద్రజాప్యైర్న వేదైః క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భో శ్రీ మహాదేవ శంభో ॥
9) స్థిత్వా స్థానే సరోజే ప్రణవమయమరుత్కుం కే (కుండలే)సూక్ష్మమార్గే శాంతే స్వాంతే ప్రలీనే ప్రకటితవిభవే జ్యోతిరూపేఽపరాఖ్యే ।
లింగజ్ఞే బ్రహ్మవాక్యే సకలతనుగతం శంకరం న స్మరామి క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భో శ్రీ మహాదేవ శంభో ॥
10) నగ్నో నిఃసంగశుద్ధస్త్రిగుణవిరహితో ధ్వస్తమోహాంధ కారో నాసాగ్రే న్యస్తదృష్టిర్విదితభవగుణో నైవ దృష్టః కదాచిత్ ।
ఉన్మన్యాఽవస్థయా త్వాం విగతకలిమలం శంకరం న స్మరామి క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భో శ్రీ మహాదేవ శంభో ॥
11) చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠకర్ణయుగలే (వివరే)నేత్రోత్థవైశ్వానరే ।
దంతిత్వక్కృతసుందరాంబరధరే త్రైలోక్యసారే హరే మోక్షార్థం కురు చిత్తవృత్తిమచలామన్యైస్తు కిం కర్మభిః ॥
12) కిం వాఽనేన ధనేన వాజికరిభిః ప్రాప్తేన రాజ్యేన కిం కిం వా పుత్రకలత్ర మిత్రపశుభిర్దేహేన గేహేన కిం ।
జ్ఞాత్వైతత్క్షణభంగురం సపది రే త్యాజ్యం మనో దూరతః స్వాత్మార్థం గురువాక్యతో భజ మన శ్రీపార్వతీవల్లభం ॥
13) ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం యౌవనం ప్రత్యాయాంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః ।
లక్ష్మీస్తోయతరంగభంగచపలా విద్యుచ్చలం జీవితం తస్మాత్త్వాం (మాం)శరణాగతం శరణద త్వం రక్ష రక్షాధునా ॥
14) వందే దేవముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం ।
వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం ॥
15) గాత్రం భస్మసితం చ హసితం హస్తే కపాలం సితం ఖట్వాంగం చ సితం సితశ్చ వృషభః కర్ణే సితే కుండలే ।
గంగాఫేనసితా జటా పశుపతేశ్చంద్రః సితో మూర్ధని సోఽయం సర్వసితో దదాతు విభవం పాపక్షయం సర్వదా ॥
16) కరచరణకృతం వాక్కాయజం కర్మజం వా శ్రవణనయనజం వా మానసం వాఽపరాధం ।
విహితమవిహితం వా సర్వమేతత్క్ష్మస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో ॥
॥ఇతి శ్రీమద్ శంకరాచార్యకృత శివాపరాధక్షమాపణ స్తోత్రం సంపూర్ణం ॥
శ్రీ ఆదిశంకరాచార్యా విరచితము శ్రీ శివ అపరాధ క్షమాపణ స్తోత్రము అర్దము :-
1) ఓ శివా! తల్లి గర్భమునందున్న నన్ను పూర్వజన్మలో చేసిన పాపకర్మ చుట్టుకొనుచున్నది. అపవిత్రములైన మల, మూత్రముల మధ్యనున్న నన్ను తల్లి కడుపులో ఉన్న జఠరాగ్ని ఉడకబెట్టుచున్నది. గర్భము నందు ఉన్నపుడు ఏఏ దుఃఖము పీడించునో దానిని వర్ణించుట ఎవడి తరము? శ్రీ మహాదేవా ! శంభో ! నా అపరాధమును క్షమించుము.
2) పసితనము నందు మిక్కిలి దుఃఖముననుభవించి , మలములో దొర్లుచూ పాలుత్రాగదలచి ఇంద్రియములను కదిలించుటకు కూడా శక్తిలేని వాడనైతిని, మలమునందు పుట్టు పురుగులు నన్ను పీడించుచున్నవి. నానా రోగములచే దుఃఖితుడనై పరాధీనుడనై శంకరుని స్మరించలేకుంటిని. శ్రీ మహాదేవా ! శంభో ! నా అపరాధమును క్షమించుము.
3) నేను యువకుడనైనంతనే సుఖములను ఆశించు పంచేంద్రియములనే సర్పములచే మర్మస్థానము నందు కరువబడితిని. మంచి చెడులు తెలుసుకొను వివక్షణా జ్ఞానము నశించినది. పుత్ర, ధన, యువతి సుఖమునను భవించుటలో మునిగితిని. అభిమానము నిండి గర్వించిన నా హృదయము శివధ్యానము విడిచినది. శ్రీ మహాదేవా ! శంభో ! నా అపరాధమును క్షమించుము.
4) ముసలితనము నందు ఇంద్రియములు పనిచేయక తాపత్రయముచే సంప్రాప్తించిన రోగములతోనూ , బంధుజన వియోగములతోనూ, నా శరీరము కృశించిపోయినది. మనస్సు జ్ఞాపక శక్తిని కోల్పోయి దీనమై అసత్యములైన ఆశలతో భ్రమించుచూ పరమేశ్వరుని ధ్యానించుటలేదు. శ్రీ మహాదేవా ! శంభో ! నా అపరాధమును క్షమించుము.
5) ఓ శివా ! ప్రాతఃకాలమునందే స్నానము చేసి నీ అభిషేకము కోసమై నేనెన్నడూ గంగాజలము తీసుకురాలేదు. నిన్ను పూజించుటకై దట్టమైన అడవికి పోయి ముక్కలు గాని మారేడు దళమును ఎప్పుడూ తేలేదు. నిన్ను అలంకరించుటకై సరస్సునందు వికసించి, పరిమళములు వెదజల్లుతున్న పద్మములమాల తీసుకురాలేదు, శ్రీ మహాదేవా ! శంభో ! నా అపరాధమును క్షమించుము.
6) ఓ శివా ! పాలతో , తేనెతో, నేతితో , పెరుగుతో బెల్లముతో నీ లింగమును నేను అభిషేకించలేదు. చందనము మొదలైన సుగంధ ద్రవ్యములు పూయలేదు. బంగారు పూలతో పూజించలేదు, ధూపములతో, కర్పూరముతో, దీపములతో, నిన్ను అర్చించలేదు. వివిధములైన రుచులుకల పిండి వంటలతో నీకు నైవేద్యం పెట్టలేదు. శ్రీ మహాదేవా ! శంభో ! నా అపరాధమును క్షమించుము.
7) ఓ శివా ! ప్రతిపదము అర్దముకానిదీ, ప్రాయశ్చిత్తముతో నిండినదీ, అగు కర్మమార్గమునందు స్మార్తపూజ కర్మను ఆచరించుట నాకు శక్యం కాదు. బ్రహ్మ మార్గముననుసరించు వారిచే చేయదగిన శ్రౌతకర్మ నాకెట్లు సాధ్యమగును ? శ్రవణ మననములు తెలుసుకొని నిదిధ్యాస మెట్లు కలుగును? శ్రీ మహాదేవా ! శంభో ! నా అపరాధమును క్షమించుము.
8) ఓ శివా ! "శివ " అను నామమును ధ్యానించి మిక్కిలిగా దానము చేయలేదు. లక్షల కొలది బీజమంత్రములతో హోమము చేయలేదు. వ్రతములతో, జపముతో, నియమముతో, గంగాతీరము నందు తపస్సు చేయలేదు. జపించవలసిన శివ మంత్రములను జపించలేదు. శ్రీ మహాదేవా ! శంభో ! నా అపరాధమును క్షమించుము.
9) ఓ శివా!నగ్నమైనవాడు, సంసార బంధములు తొలగినవాడవు, సత్వరజస్తమో గుణములు లేనివాడు, అజ్ఞానాంధకారము నశించినవాడు. ముక్కు చివరి దృష్టిని కేంద్రీకరించి తపస్సు చేయువాడు, సంసార మందలి గుణముల నెరిగినవాడు నా కెప్పుడు కనబడలేదు. ఉన్మాదావస్థలో మతి చెలించినవాడనై నిన్ను స్మరించలేదు. శ్రీ మహాదేవా ! శంభో ! నా అపరాధమును క్షమించుము.
10) ఓ శివా ! సహస్రారపద్మము నందు నిలచి ప్రణవమయమైన వాయువుచే కుంభితమైన సూక్ష్మమార్గమునందు ప్రశాంతమగు మనస్సును విలీనము చేసినచో శివుడను పేరుకల నీ దివ్యరూపము యొక్క వైభవము తెలియును. లింగమునందు, వేదవాక్యమునందు సకల జీవరాసుల యందు నిండి ఉన్న శంకరుని నేను స్మరించలేదు. శ్రీ మహాదేవా ! శంభో ! నా అపరాధమును క్షమించుము.
11) ఓ శివా ! మనోహరుడవు, వేదాంతముచే తెలియబడువాడవు, హృదయపద్మము నందు వెలుగొందు చున్నవాడవు, ప్రకాశవంతుడవు, సత్యము, శాంతము, అగు స్వరూపము కలవాడు, సకల మునుల హృదయ పద్మములందున్న వాడవు, సత్వరజోస్తమో గుణములు లేనివాడవు, అగు నిన్ను మేలుకువ యందు కానీ గాఢనిద్ర యందు కాని ఎన్నడూ స్మరించలేదు. శ్రీ మహాదేవా ! శంభో ! నా అపరాధమును క్షమించుము.
12) చంద్రుడు తలపై ప్రకాశంచుచున్న వాడు, మన్మధుని సంహరించినవాడు, గంగను ధరించినవాడు, శుభము చేయువాడు, మెడలోను చెవులయందు సర్పాభరణములను ధరించినవాడు, కంటియందు మండుచున్న అగ్ని కలవాడు, ఏనుగు చర్మము చుట్టుకున్నవాడు, మూడు లోకములకు సారమైనవాడు అగు శివుని యందు ఓ చిత్తమా ! మోక్షము కొరకై నిష్కల్మషముగా ప్రవర్తించుము, వేరు కర్మలతో ఏమి ప్రయోజనము?
13) వాహనములతో, ధనముతో, గుర్రములతో, ఏనుగులతో, అధికారముతో, పుత్రులతో, భార్యతో, మిత్రులతో, పశువులతో, శరీరముతో, ఇంటితో ఏమి ప్రయోజనము?ఇదంతా క్షణములో నశించుపోపునని తెలుసుకోని ఓ మనసా ! వీటిని దూరముగా వదిలిపెట్టుము. ఆత్మలాభము కొరకై గురు ఉపదేశము ద్వారా శ్రీ పార్వతీవల్లభుని సేవించుము.
14) పౌరోహిత్యము, రాత్రిసంచారము, గ్రామాధికారిగా ఉండుట, నౌకరిచేయుట, మఠాధిపతిగా వ్యవహరించుట, అబద్ధములాడుట, సాక్ష్యముపలుకుట, పరాన్నము భుజించుట, వేదములను ద్వేషించుట, దుష్టులతో సహవాసము, ప్రాణుల పట్ల దయలేకుండుట అనునవి ఓ పశుపతీ ! నాకు జన్మాంతరము లందు కలుగకుండు గాక!
15) చూచుచుండగానే ఆయువు నశించుచున్నది. ప్రతిదినమూ యవ్వనము క్షీణించుచున్నది. గడిచిన రోజులు మరలా తిరిగిరావు. కాలము లోకమును భక్షించుచున్నది. నీటి అలలవలే లక్ష్మీ (సంపద) చంచలమైనది. మెరుపు వలే జీవితము చంచలమైనది. కనుక శరణాగతుడనైన నన్ను కరుణతో నీవే ఇప్పుడు రక్షించుము.
Tags:
Sri Shiva Aparadha kShamapana Stotram in Telugu pdf free download,
Sri Shiva Aparadha kShamapana stotram importance and significance,
Sri Shiva Aparadha kShamapana stotram meaning in telugu,
Sri Shiva Aparadha kShamapana Stotram learning video,
Sri Shiva Aparadha kShamapana stotram book in telugu,
Sri Shiva Aparadha kShamapana Stotram Lyrics in Telugu,
Sri Shiva Aparadha kShamapana Stotram in Telugu pdf free download,
Sri Shiva Aparadha kShamapana stotram importance and significance,
Sri Shiva Aparadha kShamapana stotram meaning in telugu,
Sri Shiva Aparadha kShamapana Stotram learning video,
Sri Shiva Aparadha kShamapana stotram book in telugu,
Sri Shiva Aparadha kShamapana Stotram Lyrics in Telugu,
Post a Comment