Sunday, 19 September 2021

Dhanvantari Mantram lyrics in telugu pdf free download video

ధన్వంతరి మంత్రం - Dhanvantari Mantram in telugu

ధ్యానం |
అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణాఽమృత
రోగాన్మే నాశయాఽశేషానాశు ధన్వన్తరే హరే |
ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజో ధియం శ్రియం
స్వభక్తేభ్యోఽనుగృహ్ణన్తం వందే ధన్వన్తరిం హరిమ్ ||

ధన్వన్తరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠన్తి యే |
అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవన్తి తే చిరమ్ ||

మంత్రం |
ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ [వజ్రజలౌకహస్తాయ] సర్వామయవినాశనాయ త్రైలోక్యనాథాయ శ్రీమహావిష్ణవే స్వాహా |

గాయత్రీ |
ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వన్తరిః ప్రచోదయాత్ |

తారకమంత్రం |
ఓం ధం ధన్వంతరయే నమః |
‘‘సుదర్శన వాసుదేవ ధన్వంతరిగా ప్రసిద్ధుడైన దేవదేవునికి నమస్సులు. చేతిలో అమృత కలశాన్ని ధరించినవాడూ, అన్ని భయాలనూ పోగొట్టి, సర్వ రోగాలనూ నివారించేవాడూ, ముల్లోకాలకూ పతి, ముల్లోకాలకూ శ్రేయస్సు చేకూర్చేవాడూ, మహా విష్ణువుకు మారురూపమూ అయిన ధన్వంతరి కృప అందరినీ ఆరోగ్యవంతుల్ని చేస్తుంది. ఆ ఆయుర్వేద పురుషుడికి నమస్సులు’’ అని భావం.


ఆకస్మిక, దీర్ఘకాలిక వ్యాధుల నివారణకూ, వ్యాధుల వ్యాప్తి కారణంగా కలిగే భయాలన్నీ పోవడానికీ ధన్వంతరిని నిత్యం ప్రార్థించాలి. ‘‘వ్యాధి తొలగిపోవాలి. నేను సంపూర్ణ ఆరోగ్య వంతుణ్ణి కావాలి’’ అని మనసులో గాఢంగా సంకల్పించుకొని, ఈ ధన్వంతరీ మహా మంత్రాన్ని వీలైనన్నిసార్లు పఠించినా, మననం చేసుకున్నా అపమృత్యు భయం తొలగిపోతుందనీ, ఆరోగ్యం సిద్ధిస్తుందనీ పెద్దల మాట.
తీవ్రమైన అనారోగ్యంతో బాధపడేవారు ధన్వంతరి ధ్యానిస్తూ ఈ మంత్రాన్ని ఉపాసన చేస్తే ఉత్తమమైన ఆరోగ్యం సిద్ధిస్తుంది

To Download Dhanvantari Mantram in telugu pdf click below

Tags:
dhanvantari mantram in Telugu pdf free download,
dhanvantari mantram importance and significance,
dhanvantari mantram meaning in telugu,
dhanvantari mantram learning video,
dhanvantari mantram book in telugu,
dhanvantari mantram Lyrics in Telugu,

Post a Comment

Whatsapp Button works on Mobile Device only