Monday 19 July 2021

Toli Ekadashi significance information in telugu pdf - తొలి ఏకాదశి విశిష్టత

తొలి ఏకాదశి విశిష్టత:

తెలుగు కేలండర్ (పంచాంగం) ప్రకారం మనకు మొత్తం 12 నెలలు ఉన్నాయి...
వీటిలో ప్రతి మాసానికి ఒక నిర్ధిష్టమైన పేరు ఉంది...
నెలలో రెండు పక్షాల(15రోజుల)కు గాను ప్రతి పక్షం(శుక్ల, కృష్ణ) కు ఒక ఏకాదశి ఉంటుంది.....
చంద్ర గమనమును ఆధారంగా చేసుకుని చంద్రుడు పెరిగే పరిమాణమును బట్టి... అది అమావాస్యనుండి... పౌర్ణమి వరకు... ఒక పక్షం తిరిగి పౌర్ణమి నుండి అమావాస్యవరకు ఒక పక్షం... ఇలా ప్రతి మాసంలో ఉన్న ఆ నిర్థిష్ట పౌర్ణమి అమావాస్యలకు పేర్లు నిర్థారించబడినవి...
ఇలా మొత్తం 24 ఏకాదశులకు 24 పేర్లు ఉన్నాయి... ఇలా ప్రతి ఏకాదశి రోజు ఉదయం వేళలు ఎలా ఉంటాయి... వాతావరణం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.. మన సనాతన ధర్మం యొక్క ఖచ్చితత్వం ఇది... అలా ఉన్న 24 ఏకాదశులు ఉన్నాయి మనకు..
 
శ్రీమహావిష్ణువు ఈ రోజు నుండే నిద్రను మొదలు పెడతారట... అందుకే ఈ ఏకాదశిని శయనైక ఏకాదశి అని పిలుస్తారు... అలా విష్ణు భగవానుడు .. నాలుగు నెలల పాటు యోగ నిద్రలో ఉంటారు... ఈ నాలుగు నెలలను చాతుర్మాసాలుగా పిలుస్తూ.. చతుర్మాస దీక్షలు చేస్తారు... తిరిగి శ్రీవారు కార్తీక మాసంలో నిద్ర లేస్తారని పురాణాలు చెపుతున్నాయి....
 
వాస్తవంగా ఈ నాలుగు నెలలు వర్షఋతు కాలం... మన సనాతన ధర్మం ఎన్నో విషయాలను... సైన్సు అని పేరు చెప్పకుండా మనను సిద్ధం చేస్తుంది... అలా seasonal change కు సంబంధించి మనను జాగరూకత పరుస్తూ... అటు ఆధ్యాత్మికంగా..మరియు.. ఆరోగ్యపరంగా ఉండేలా చేస్తాయి మన పండుగలు... అలాటిదే ఈ పండుగ కూడా... ఈ పండుగలో ప్రసాదంగా పేలాల పిండిని పంచుతారు...
 
పేలాలలో బెల్లాన్ని, యాలకులను చేర్చి దంచి ఈ పిండిని తయారుచేస్తారు ఈ దినాన ప్రతి దేవాలయంలోను పేలా పిండిని ప్రసాదం కూడా ఇస్తారు.ఆరోగ్యపరంగా కూడా ఈ పిండి చాలా మంచిది. బాహ్య ఉష్ణోగ్రతలకు అనుగుణంగా దేహం మార్పులు చెందుతుంది. గ్రీష్మ ఋతువు ముగిసి వర్ష ఋతువు ప్రారంభమయ్యే సమయం. కావున శరీరానికి ఈ పిండి వేడిని కలుగజేయడమేగాక, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. వర్షాకాలంలో వ్యాధి బారిన పడటానికి ఉన్న అనేక అవకాశాలను ఇది తిప్పికొడుతుంది

You may interest also:




Post a Comment

Whatsapp Button works on Mobile Device only