Monday 24 May 2021

Sri Shasti devi Stotram lyrics in telugu meaning pdf video download - సంతానం కోసం షష్ఠి దేవి స్తోత్రం

శ్రీ షష్ఠీ దేవి స్తోత్రం
Sri Shasti devi Stotram lyrics in telugu 

సంతానం లేని వారు సంతానం కోసం, పుత్ర సంతానం లేని వారు పుత్ర సంతానం కోసం, షష్ఠిదేవి స్తోత్రాన్ని 21 రోజులు పఠించినా... క్రమం తప్పకుండా వినినా తప్పకుండ సంతానం కలుగుతుంది, పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది అని నమ్మకం, పిల్లల ఆరోగ్యం కోసం... కూడా పఠించవచ్చు... ప్రసవం అయిన 5 వరోజు తర్వత పఠిస్తే పుట్టిన పిల్లలకు మంచిది అని నమ్మకం.. ప్రతి స్త్రీ నేర్చుకోవాల్సిన స్తోత్రం.. పిల్లల పుట్టిన రోజు నాడు ఈ స్తోత్రం చదివితే వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేక.. మంచి సుగుణాలతో పెరుగుతారు... ఒక్కొక్కసారి చిన్నపిల్లలు continuous గా ఏడుస్తుంటూ ఉంటారు... అలాంటి సమయంలో షష్టి దేవి స్తోత్రం చదివి వారి నుదుటన కుంకుమ గానీ విభూతి కానీ పెడితే వారి సమస్య తగ్గుతుంది అని నమ్మకం... 

సంతానం కోసం షష్ఠి దేవి స్తోత్రం - Sri Shasti devi Stotram lyrics in telugu meaning pdf video download
 ధ్యానం |
శ్రీమన్మాతరమంబికాం విధిమనోజాతాం సదాభీష్టదాం
స్కందేష్టాం చ జగత్ప్రసూం విజయదాం సత్పుత్ర సౌభాగ్యదాం |
సద్రత్నాభరణాన్వితాం సకరుణాం శుభ్రాం శుభాం సుప్రభాం
షష్ఠాంశాం ప్రకృతేః పరం భగవతీం శ్రీ దేవసేనాం భజే ||

షష్ఠాంశాం ప్రకృతేః శుద్ధాం సుప్రతిష్టాం చ సువ్రతాం
సుపుత్రదాం చ శుభదాం దయారూపాం జగత్ప్రసూం |
శ్వేతచంపకవర్ణాభాం రక్తభూషణభూషితాం
పవిత్రరూపాం పరమం దేవసేనా పరాం భజే ||

స్తోత్రం |
నమో దేవ్యై మహాదేవ్యై సిద్ధ్యై శాంత్యై నమో నమః |
శుభాయై దేవసేనాయై షష్ఠీ దేవ్యై నమో నమః || ౧ ||

వరదాయై పుత్రదాయై ధనదాయై నమో నమః |
సుఖదాయై మోక్షదాయై షష్ఠీ దేవ్యై నమో నమః || ౨ ||

సృష్ట్యై షష్ఠాంశరూపాయై సిద్ధాయై చ నమో నమః |
మాయాయై సిద్ధయోగిన్యై షష్ఠీ దేవ్యై నమో నమః || ౩ ||

సారాయై శారదాయై చ పరాదేవ్యై నమో నమః |
బాలాదిష్టాతృ దేవ్యై చ షష్ఠీ దేవ్యై నమో నమః || ౪ ||

కళ్యాణదాయై కళ్యాణ్యై ఫలదాయై చ కర్మణాం |
ప్రత్యక్షాయై సర్వభక్తానాం షష్ఠీ దేవ్యై నమో నమః || ౫ ||

పూజ్యాయై స్కందకాంతాయై సర్వేషాం సర్వకర్మసు |
దేవరక్షణకారిణ్యై షష్ఠీ దేవ్యై నమో నమః || ౬ ||

శుద్ధసత్త్వస్వరూపాయై వందితాయై నృణాం సదా |
హింసాక్రోధవర్జితాయై షష్ఠీ దేవ్యై నమో నమః || ౭ ||

ధనం దేహి ప్రియాం దేహి పుత్రం దేహి సురేశ్వరి |
మానం దేహి జయం దేహి ద్విషో జహి మహేశ్వరి || ౮ ||

ధర్మం దేహి యశో దేహి షష్ఠీ దేవీ నమో నమః |
దేహి భూమిం ప్రజాం దేహి విద్యాం దేహి సుపూజితే |
కళ్యాణం చ జయం దేహి షష్ఠీ దేవ్యై నమో నమః || ౯ ||

ఫలశృతి |
ఇతి దేవీం చ సంస్తుత్య లభేత్పుత్రం ప్రియవ్రతం |
యశశ్వినం చ రాజేంద్రం షష్ఠీ దేవి ప్రసాదత ||

షష్ఠీ స్తోత్రమిదం బ్రహ్మాన్ యః శృణోతి తు వత్సరం |
అపుత్రో లభతే పుత్రం వరం సుచిర జీవనం ||

వర్షమేకం చ యా భక్త్యా సంస్తుత్యేదం శృణోతి చ |
సర్వపాపాత్వినిర్ముక్తా మహావంధ్యా ప్రసూయతే ||

వీరం పుత్రం చ గుణినం విద్యావన్తం యశస్వినం |
సుచిరాయుష్యవన్తం చ సూతే దేవి ప్రసాదతః ||

కాక వంధ్యా చ యా నారీ మృతపత్యా చ యా భవేత్ |
వర్షం శృత్వా లభేత్పుత్రం షష్ఠీ దేవీ ప్రసాదతః ||

రోగ యుక్తే చ బాలే చ పితామాతా శృణోతి చేత్ |
మాసేన ముచ్యతే రోగాన్ షష్ఠీ దేవీ ప్రసాదతః ||

జయ దేవి జగన్మాతః జగదానందకారిణి |
ప్రసీద మమ కళ్యాణి నమస్తే షష్ఠీ దేవతే ||

శ్రీ షష్ఠీ దేవి స్తోత్రం సంపూర్ణం ||

👇👇To Download Sri Shasti Devi stotram pdf in telugu please CLICK HERE👇👇

Tags:
Sri Shasti Devi Stotram in Telugu pdf free download,
Sri Shasti Devi stotram importance and significance,
Sri Shasti Devi stotram meaning in telugu,
Sri Shasti Devi Stotram learning video,
Sri Shasti Devi stotram book in telugu,
Sri Shasti Devi Stotram Lyrics in Telugu,

To learn Shashti Devi stotram in telugu follow the video guide




Post a Comment

Whatsapp Button works on Mobile Device only