Monday, 3 May 2021

హైడ్రో ప్రాజెక్ట్ కోసం ధారీ దేవి విగ్రహాన్ని తరలించడం వల్లనే 2013 కేదార్ నాథ్ ప్రళయం వచ్చిందా...??? ధారీ దేవి: 108 శక్తి పీఠాలలొ ఒక శక్తి పిఠం - Dhari devi shakti peetham information in telugu

హైడ్రో ప్రాజెక్ట్ కోసం ధారీ దేవి విగ్రహాన్ని తరలించడం వల్లనే 2013 కేదార్ నాథ్ ప్రళయం వచ్చిందా...??? ధారీ దేవి: 108 శక్తి పీఠాలలొ ఒక శక్తి పిఠం - Dhari devi shakti peetham information in telugu

ఈ క్షేత్రం కేదార్ నాథ్ దివ్య క్షేత్రానికి ఎగువ ప్రాంతంలో ఉంటుంది.... 2013 సంవత్సరం కేదార్ నాధ్ వరదలలో దాదాపు ఐదు వేల మంది చని పొయిన విచారకర విషయం మనందరికి తెలిసిందే.. ఆ సమయంలో ధారీ దేవి గురించిన కథనాలను తొలిసారిగా మనం విన్నాము... ఆ క్షేత్రమునకు సంబంధించిన కొన్ని వివరములు...
 
సూమారు 800 ఏళ్ళ క్రితం ఉత్తరాఖండ్లో గార్వాల్ ఎగువ ప్రాంతంలో వచ్చిన వరదలకు ఒక అమ్మవారి విగ్రహం కొట్టుకువచ్చి ఇప్పుడు ధారీదేవిని ప్రతిష్టించిన ప్రదేశంలో ఉన్న ఒక శిలకు తగిలింది. దీంతో అక్కడున్న శిల(రాయి) విలపించిందట.
maa dhari devi images temple information
 ఒక అశరీరవాణి వాక్కులతో సూచనలతో ఆ విగ్రహాన్నీ కనుగొనగలిగారనీ... అప్పటి నుంచి ఆ ప్రాంతంవారు ఆ శిలను పూజిస్తున్నట్టు కథనం... ఈ ఆలయం మరియు మూలవిరాట్టు చుట్టూ పైన గోడలు ఉండవు.. అలా బహిరంగ ప్రదేశంలో ఉంటుంది...
Old Dhari Devi Temple images:👇👇
 
Old Dhari Devi Temple images before power projectMaa dhari devi images👇👇👇
maa dhari devi images


గుడి అలకానంద నది మధ్యలో ఉంటూ, నది యొక్క ధారను ప్రవాహాన్ని) నియంత్రిస్తుంది కనుక ఈ అమ్మవారికి ధారీ దేవి అని పేరు వచ్చిందని ఒక కథనం....

New Dhari Devi temple after construction the power project..     
New Dhari Devi Temple after hydro power project

ధారీదేవి కాళీమాత ప్రతిరూపం. శక్తి స్వరూపిణి. చార్గాం క్షేత్ర దర్శనానికి వచ్చే భక్తులకు రక్షకురాలు, ఉత్తరాఖండ్ గ్రామ దేవత ఈ ధారీ దేవి ధారీ దేవి కేధార్ నాధ్ లో నిత్యం సంచారం చేస్తూ, రక్షిస్తూ ఉంటుంది. ఉదయం బాలిక స్వరూపంలో, మధ్యాహ్నం యవ్వన స్త్రీ రూపంలో, రాతి వేళ ముసలి స్త్రీ రూపంలో దర్శనమిస్తూ, కేధార్ నాధ్ క్షేత్రంలో తిరుగుతూ ఉంటుంది.
బద్రీనాధ్ నుంచి శ్రీనగర్ వెళ్ళే దారిలో, రుద్రప్రయాగకు సుమారు 20 కిలోమీటర్ల దూరంలో, శ్రీనగర్కు 15 కిలోమీటర్ల దూరంలో

ఉంది ధారిదేవి ఆలయం.
ఈ తల్లి యొక్క సగభాగం ఇక్కడ ధారిదేవి రూపంలో పూజింపబడుతుంటే, మిగితా సగభాగం కాళీమట్ ప్రాంతంలో కాళీ దేవి. రూపంలో పూజలందుకొంటున్నది. శ్రీ దేవీ భాగవతంలో చెప్పబడిన శక్తి యొక్క 108 దివ్య క్షేత్రాల్లో ఈ ధారీ దేవి కూడా ఉండడం విశేషం.

ఉత్తరాఖండ్లో అలకానంద నదిపై హైడల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి అక్కడి ప్రభుత్వం ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది. మన రాష్ట్రానికి చెందిన జీవీకే సంస్థ అనుబంధ కంపెనీ అలకానంద హైడ్రో పవర్ కంపెనీ, 330 మెగావాట్ల జలవిద్యుత్ కేంద్ర నిర్మాణానికి సిద్ధమయ్యింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం వలన ధారీదేవి ఆలయం నీట మునుగుతుందని అక్కడి స్థానికులు ఆందోళన చెందారు. బీజేపీ నేతలు, సాధువులు, స్థానికులతో పాటు ప్రాజెక్టు నిర్మాణంతో పర్యావరణానికి హాని జరుగుతుందన్న భయంతో పర్యావరణవేత్తలు కూడా ఈ భారీ జల విద్యుత్ ప్రాజెక్టును గట్టిగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఇక్కడ జరిగే పర్యావరణ విధ్వంసం విషయమై పర్యావరణ శాఖ సుప్రీం కోర్టులో అపిడవిట్ దాఖలు చేసింది.
  

ప్రాజెక్టు నిర్మాణానికి గట్టిగా పూనుకున్న కంపెనీ అమ్మవారి విగ్రహాన్ని ఎత్తైన ప్రదేశానికి తరలించాలని భావించింది. ప్రాజెక్టు నిర్మాణానికి అనుగుణంగా, నీటిలో మునగనంత ఎత్తున ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేసి దానిపైకి ధారిదేవి విగ్రహాన్ని తరలింపును స్థానికులు అడ్డుకుంటామని హెచ్చరించడంతో ప్రాజెక్టు అధికారులు వ్యూహాత్మకంగా డ్యాంలో నీటిమట్టాన్ని పెంచుతూ వచ్చారు. దీంతో, అమ్మ ఆలయం మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది విగ్రహం మునిగిపోతుందంటూ హడావుడి చేసి, (జూన్ 16,2013), ఆదివారం రాత్రి 7.30కు ధారీదేవి విగ్రహాన్ని తరలించుకోవచ్చంటూ తాత్కాలికంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తూ తుది నిర్ణయాన్ని వాయిదా వేసింది.

విగ్రహాన్ని తరలింపును స్థానికులు అడ్డుకుంటామని హెచ్చరించడంతో, ప్రాజెక్టు అధికారులు వ్యూహాత్మకంగా డ్యాంలో నీటిమట్టాన్ని పెంచుతూ వచ్చారు. దీంతో, అమ్మ ఆలయం మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. విగ్రహం మునిగిపోతుందంటూ హడావుడి చేసి, గత నెల(జూన్ 16), ఆదివారం రాత్రి 7.30కు ధారీదేవి పైభాగాన్ని పెకిలించి, ఎత్తున నిర్మించిన ప్లాట్ ఫామ్ పైకి మార్చారు. విగ్రహాన్ని ప్రవేటు సిబ్బంది సాయంతో మార్చారు.

ధారి దేవి విగ్రహాన్ని మార్చుతున్న సమయంలోనే ఆకాశంలో ఉరుములు, మెరుపులు విపరీతంగా వచ్చాయని ధారీదేవిని పెకిలించిన సిబ్బందే చెప్తున్నారు. కొద్దిసేపటికే భారీ వర్షం మొదలయ్యింది. హిమాలయాల్లో క్లౌడ్ బ్రస్ట్ జరిగి, భారీగా వరద పోటెత్తడంతో పెద్ద నష్టం జరిగింది.

ఇదంతా అమ్మ ప్రకోపించడం వల్లే సంభవించిందంటున్నారు స్థానికులు వందలాది భవనాలు నామరూపాల్లేకుండా పోయినా, వేలాదిమంది కొట్టుకు పోయినా, అలకానంద నది మధ్యలో ఉన్న కేదార్ నాథ్ ఆలయం మాత్రం చెక్కుచెదరకుండా ఉండడం, ఆలయంలోని శివలింగం బురదలో కూరుకుపోకుండ ఉడడం (పూజకోసం తెచ్చిన బిల్వ పత్రాలు శివలింగాన్ని కప్పి ఉంచడం), అంతా అమ్మ మహిమే అంటున్నారు స్థానికులు. 
1882లోనూ ఓ సారి ధారాదేవిని ఈ స్థానం నుంచి తరలించడానికి స్థానిక రాజు, సైన్యంతో కలిసి ప్రయత్నించారు. అప్పుడూ ఇదే తరహాలో భారీగా వరదలు వచ్చి ప్రాణ నష్టం జరిగిందని స్థానికులు చెప్తున్నారు. ఇప్పటి వరదలు కూడా ధారీదేవి ఆగ్రహం వల్లే వచ్చాయని అంటున్నారు. కొన్ని అద్భుతాలకు ఋజువులు చూపించనవసరంలేదు... డ్యాముల వలన ఆర్థికాభివృద్ధి జరుగుతుందనే మాట వాస్తవమే అయినా... ప్రకృతికి వ్యతిరేకంగా చేసే పనులు ఎలా ఉంటాయో అనేదానికి సాక్ష్యం ఈ దుర్ఘటన. కుహనావాదుల వాదనల ఫలితంగానే ఆ విగ్రహాలను ఒక ఎత్తుకు తరలించాలని చేసిన ప్రయత్నమే ఐదువేల మందిని బలికొంది.. ఇంకా కొన్ని వేల జీవితాలపై ప్రభావం పడింది..

ఇప్పటిదాకా మీరు చదివిన ప్రతి అంశం ఈ క్రింది వీడియోలో చూడవచ్చు.. చాలా అద్భుతంగా ఉంది వీడియో... Don't miss Dhari Devi temple video👇👇👇


Post a comment

Whatsapp Button works on Mobile Device only