Sunday 14 February 2021

Story behind Valentines Day in Telugu

వామ్మొ “వాలెంటైన్స్ డే” వెనుక ఇంత భయంకరమైన కథ ఉందా??
వాలెంటైన్స్ డే అంటే ప్రస్తుతం ప్రేమికుల రోజుగా ముద్ర పడి పోయింది... ఇప్పుడు ట్రెండ్ ఎంతలా మారిందంటే ఆ రోజు ప్రేమ విషయం తెలుపక పోతే జీవితం చెడి పోతుందేమో అన్నంత ఇదయి పోతున్నారు.. కానీ అసలు ఈ వాలెంటైన్స్ డే కథ ఎలా మొదలయిందో తెలిస్తే... అప్పుడు అసలు ఈ పండుగ చేసుకోవాలో లేదో మీరే నిర్ణయించుకోవచ్చు...


వాలెంటైన్ అనే అతను రోమ్ నగరం లోని ఒక మత గురువు... ఈయన గురించి తెలుసుకోబోయే ముందు అప్పటి రోమ్ లో ఉన్న పరిస్థితుల గురించి తెలుసుకుంటే ఒక మహానుభావుని గురించి అర్థమవుతుంది...

క్రీస్తు శకం 270 కాలంలో అంతా పితృస్వామ్య వ్యవస్థ నడిచే దట రోమ్ లో.. అంతా రోమ్ చక్రవర్తి క్లాడియస్ దే ఇష్టా రాజ్యంగా ఉండేది... ఆయనకు ప్రేమ అన్న వివాహమన్నా ఇష్టం ఉండేది కాదట... ఇప్పుడు జరుపుకున్నట్లే ఫిబ్రవరి 13 నుండి 15 వరకు రోమ్ లో ఉత్సవాలు / పండుగలు జరుపుకునే వారట... రోమన్లు రొమాన్స్ గురించి గానీ శృంగారం గురించి కానీ, ప్రేమ ను గాని నమ్మే వారు కాదు. ఆ కాలంలో రోమ్ లో మహిళలను తీవ్రం గా హింసించేవారు. రక్తపాతానికి, హింసకు, జంతువుల వద్దకు రోమన్లు పెట్టింది పేరు గా నిలిచారు. వారు జరుపుకునే ఏకైక పండుగ “లుపెర్కాలియా”. ఫిబ్రవరి 13 నుంచి 15 వరకు ఈ పండుగ ను చేసుకునే వారు. ఇందులో భాగం గానే జంతు వధ ఉండేది. ఇందులో కుక్కలను, మేకలను బలి ఇచ్చేవారట. ఆడవారిని కొరడాలతో కొట్టేవారు. ఇలా చేయడం వలన దుష్ట శక్తులకు దూరంగా ఉండ వచ్చని, నగరాన్ని శుద్ధి చేయవచ్చని వారు విశ్వసించేవారట. దీనిపై ఎక్కువ గా మహిళలే బలి అయ్యేవారు. స్త్రీలను కేవలం ఒక లగ్జరీ వస్తువులాగా పిల్లలను కనే యంత్రంలా భావిస్తూ... ప్రేమ అనురాగాలకు విలువ లేకుండా హింసించేవారట..

అంతే తప్ప, ప్రేమ, శృంగారం వంటి అంశాలకు వారి జీవితాల్లో అంత ప్రాధాన్యత ఉండేది కాదట. అసలు వారు జీవ శాస్త్రాన్ని కూడా పట్టించుకునేవారు కాదట. వారి భాషలో ప్రేమ కి, రొమాన్స్ కు ఉన్న ఒకే ఒక్క నిర్వచనం హింస. ఈ హింస లో మహిళలు తీవ్రం గా బాధపడేవారు. మహిళల పేర్లను చీటీలలో రాసి, వాటిలోంచి లక్కీ డ్రా లాగా కొన్ని పేర్లను తీసేవారట. ఎవరి పేరు వస్తే.. వారిని కొరడాలతో కొట్టి.. ఆ తరువాత వారికి సంతానోత్పత్తిని ఇచ్చేవారట. అసలు ఇంత హింస, పితృస్వామ్య వ్యవస్థ ఎక్కడనుంచి వచ్చాయో తెలియదు..

history-behind-valentines-day
ఇలాంటి పరిస్థితుల్లో రోమ్ లో వాలెంటైన్ అనే క్రైస్తవ మత గురువు వచ్చారు. ఆయన ఇలాంటి వ్యవస్థకు, హింసకు వ్యతిరేకం గా ఉండేవారు. ప్రేమను పంచాలని చెప్పేవారు. ఆయన తాను నమ్మిన ప్రేమ సిద్ధాంతాలను యువతీ, యువకులకు తెలిపేవారు. ప్రేమ చిగురించేలా కృషి చేసారు. యువతీ యువకులు ప్రేమించుకుంటే.. వారికి దగ్గరుండి పెళ్లి చేసేవాడు. అయితే, ఆ కాలం లో రోమన్ చక్రవర్తి గా ఉన్న క్లాడియస్ కు ప్రేమ అన్నా, వివాహం అన్నా ఏహ్య భావం ఉండేది. దీనితో ఆయన పెళ్లిళ్లపై నిషేధం విధించాడు.
actual-facts-behind-valentines-day

అయితే, వాలెంటైన్ కారణం గా రాజ్యం లో ఎక్కువ గా ప్రేమ పెళ్లిళ్లు జరిగేవి. ఈ విషయం తెలుసుకున్న క్లాడియస్ వాలెంటైన్ ను బంధించాడు. అతను రాజద్రోహం చేశాడంటూ..అతనిపై ఆరోపణలు కురిపించి అతన్ని క్రూరం గా శిక్షించాడు. అతను జైలు లో ఉన్న సమయం లో జైలు అధికారి కూతురిని అతడు ప్రేమించాడు. చివరకు వాలెంటైన్ ను ఫిబ్రవరి 14 న ఉరి తీశారు. చనిపోయే చివరి క్షణం వరకు అతను ఆమెను తలుచుకుంటూనే ఉన్నాడు. ఆమె ప్రేమిస్తున్నానని చెబుతూ.. ఆమెకు ఒక లేఖ కూడా రాసాడు. చివరిలో యువర్ వాలెంటైన్ అని పేర్కొన్నాడు. అలా… అతని పేరు ప్రేమికులకు పర్యాయపదం గా మారిపోయింది..
the-history-of-valentines-day

అతన్ని ఉరి తీసిన రోజున రోమ్ లో నిరసనలు వెల్లువెత్తాయి. ఆరోజును వారు ప్రేమికుల దినోత్సవం గా జరుపుకోవడం ప్రారంభించారు.
అలా ఈ ఫిబ్రవరి 14 వాలెంటైన్ తాతయ తద్దినమెల్లా... ప్రేమికుల దినోత్సవం గా మారింది....

క్రమం గా రోమ్ లో హింస స్థానం లో ప్రేమ అవతరించింది. అప్పటి నుంచి ఫిబ్రవరి 14 వ తేదీని వాలెంటైన్స్ డే గా జరుపుకుంటూ వచ్చారు. కాల క్రమం లో అమెరికా వంటి దేశాల్లో కూడా ఈ పండుగ జరుపుకోవడం ప్రారంభమైంది. భారత్ లో కూడా 1990 దశకం నుంచి ఈ రోజును ప్రేమికుల దినోత్సవం గా జరుపుకునే సంప్రదాయం వచ్చింది. అయితే, ఇది భారతీయుల సంప్రదాయం కాదని, ఇక్కడ మహిళలను హింసించే అంత క్రూరమైన మనస్తత్వాలు ఉన్న వ్యక్తులు లేరని, ఇక్కడ ఇలాంటి రోజుని జరపాల్సిన అవసరం లేదని పలువురు వ్యతిరేకతను వ్యక్తం చేసే వారు కూడా ఉన్నారు.
history-behind-valentines-day, actual-facts-behind-valentines-day,the-history-of-valentines-day, valentines day greetings wishes images wallpapers mes

Post a Comment

Whatsapp Button works on Mobile Device only