Thursday, 17 December 2020

Secrets and greatness of vaikuntha pali parama pada sopana patam

మన ప్రాచీన మహర్షులు పరమపద సోపాన పటం ని తయారు చేయడం వెనుక ఎంతో కృషి చేశారో ఈ పోస్ట్ ని చూస్తే అర్థమవుతుంది... 

నిజంగా మన పిల్లలకు ఈ ఆట ఆడటం తోటే ఏమేమి చేయాలో ఏమి చేయకూడదో... పూర్తిగా వివరించే విధంగా ఎంత చక్కగా డిజైన్ చేయబడిందో... ఒక్కసారి చూడండి... మన భవిష్యత్తు తరాలవారికి చేరాలంటే తప్పనిసరిగా షేర్ చేయండి మీరు తెలుసుకోండి... Don't miss the Post... It's our culture and heritage...😊😊🙏 

పరమపద సోపాన పటము తయారు చేసిన వారు పదమూడో శతాబ్దంలోని జ్ఞానదేవ్ అనే ముని, కవి... మునివర్యులు ఒక పిల్లల ఆట తయారు చేశారు. ఆ ఆట పేరు మోక్ష పదం... ఇదే పరమపదసోపానపటం యొక్క మొదటి పేరు...

కానీ మన సంస్కృతిని, ఆచారాలను అన్నిటినీ నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్న బ్రిటిష్ వారి కన్ను ఆటల్లో కూడా మనవారు పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు అని గ్రహించి ఆ ఆటని మొత్తం బ్రిటీష్ వారు మార్పు చేసి Snakes and Ladders గా విడుదల చేసారు, వారికి కలిసి వొచ్చిన అంశం అప్పటికి ముద్రణా వ్యవస్థ అందుబాటులోకి రావడం. 

 అలా మోక్ష పదం కాస్తా వైకుంఠపాళిగా రూపాంతరం చెందింద.

పాత కొత్త ఆటలో వంద చతురస్రములు ఉంటాయి, తేడా వొచ్చి మన మునీశ్వరులు జ్ఞానదేవ్ రూపొందించిన ఆటలో 12వ చతురస్రరం అంటే 'నమ్మకం' అని, 51వ చతురస్రరం అంటే 'విశ్వసనీయత' అని , 57 వ చతురస్రరం వొచ్చి 'దాతృత్వాన్ని' సూచిస్తుంది, అలాగే 76వ చతురస్రరం 'జ్ఞానాన్ని' సూచిస్తుంది, 78వ చతురస్రరం 'మునివృత్తి'ని సూచిస్తుంది. ఆ గళ్ళ క్రింద నిచ్చెన ఉంటుంది . ఆ గడిలో పాచిక పడితే నిచ్చేనె ఎక్కి వేగంగా ఆటలో పైకి వెళ్లే అవకాశం ఏర్పడుతుంది. అలాగే కే 41వ గడి 'అవిధేయతకు' ప్రతీకగా ,44వ చతురస్రరం లో పడితే 'అహంకారం' అని, 49వ గళ్లోకి పడితే 'అశ్లీలత' అని, 52వ గడిలోకి ప్రవేశిస్తే 'దొంగతనం' అని, 58వ గడిలో 'అబద్దలాడుట' అని , 62వ చతురస్రరం లోకి ప్రవేశిస్తే 'తాగుబోతు' అని, 69వ గదిలోకి అడుగు పెడితే 'అప్పులుపాలు' అని, 73వ గడిలోకి ప్రవేశిస్తే 'హంతకుడు/హత్యలు' అని 84వ చతురస్రరం లోకి వెళితే 'కోపిష్టి' అని, 92వ చతురస్రరం 'దురాశను' 95వ గడి 'గర్వాన్ని' సూచిస్తాయి. చివరగా 99వ గడి 'కామాన్ని' సూచిస్తాయి. ఈ గళ్ళల్లో పాము నోరు తెరుచుకుని ఆయా గుణాలను బట్టి కిందకు జారిపోతారు. ఆటలోనే మంచి చెడు నేర్చుకోవాలి అని ముని చెప్పకనే తెలుస్తుంది పిల్లలకు. చెడు మార్గన్ని ఎంచుకునే వారు అధం పాతాళానికి చేరుకుంటారు. మంచి గుణాలు అలవర్చుకుంటే జీవితంలో పైకి ఎదుగుతాము అని ఆటలో కూడా చెప్పడం. 

100వ చతురస్రరం లోకి ప్రవేశిస్తే "మోక్షం" ప్రతి నిచ్చెన పై భాగంలో ఎవరో ఒక దేవుడు/దేవత లేకపోతే వివిధ స్వర్గాలో , కైలాసం, వైకుంఠం లేదా బ్రహ్మలోకం ఇలా ఉంటాయి ఆట ఆడుతుంటే పిల్లలకు ఉత్సాహంగా నిజ జీవితంలోని ఒడిదుడుకులు కనిపిస్తాయి. నిచ్చెన ఎక్కితే మంచి కర్మలు చేసినట్టు, పాము నోట్లో పడితే పాపాలు పడినట్టు రూపొందించారు. అంతటి మహత్తరమైన ఆటను కూడా వక్రీకరించి తమదైన ముద్రవేసుకొని ఏ విధమైన సందేశం లేకుండా చేశారు

Post courtesy:
The WhatsApp University

Post a Comment

Whatsapp Button works on Mobile Device only