మనం పాటించే హిందూ క్యాలెండర్ లో 12 నెలలు ఉంటాయి అని తెలుసు కదా... అవి (చైత్ర వైశాఖ ... పాల్గుణ)...ధనుర్మాసం ఒక ప్రత్యేకమైన కోవకి చెందినది... 12 మాసాలలో ఈ మాసం పేరు ఉండదు... ఇది ఆ పన్నెండు నెలలు లో రెండు మాసాల్లో మధ్యలో వచ్చి పోయే మాసం... ఎందుకంటే ఈ ధనుర్మాసం *ఉత్తరాయణ కాలము(సూర్య గమనమును ఆధారంగా చేసుకొని వస్తుంది కాబట్టి అది సౌరమానం కిందకి వస్తుంది)నకు ముందు వచ్చే మాసం లో ధనుస్సు రాశిలో వస్తుంది... అది ఒకసారి మార్గశిరమాసంలో రావచ్చు లేదా పుష్యమాసంలో రావచ్చు... అందుకే ధనుర్మాసం పేరు మాసాల లిస్టులో వుండదు... ధనుర్మాసంలో వచ్చే ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అని గాని వైకుంఠ ఏకాదశి అని అంటారు .... అయితే మార్గశిర మాసంలో వచ్చే ఏకాదశి ని ముక్కోటి ఏకాదశి అని పుష్యమాసంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని అంటారు.... మనం పాటించే చైత్ర, వైశాఖ ఇలాంటి మాసాలు అన్నీ చాంద్రమానం ప్రకారం వచ్చేవి... కానీ ధనుర్మాసం మాత్రం... సౌరమానాన్ని పాటి స్తూ వచ్చేది.. అది కూడా సూర్యుడు ధనస్సు రాశిలో వచ్చేప్పుడు మాత్రమే వచ్చేది... అందుకే ధనుర్మాసంలో వుండే రోజుల సంఖ్య ప్రతి సంవత్సరం మారుతూ వుంటుంది.... దానిని ఫాలో అవుతూ వచ్చే ముక్కోటి ఏకాదశి ఇంగ్లీష్ కేలండర్ లో ఒక్కోసారి జనవరి కి కూడా జరిగి పోతూ ఉంటుంది...సాధారణంగా *ముక్కోటి ఏకాదశి డిసెంబర్ లో వస్తుంది...
*ఉత్తరాయణ పుణ్యకాలం గురించి:
మనకు ఒక సంవత్సరం అయితే దేవతలకు అది ఒక రోజుతో సమానం... దేవతలకు ఒక పగలు సమయం మనకు ఆరు నెలల తో సమానం... రాత్రి సమయం మరొక ఆరు నెలల కు సమానం... దేవతల పగలుని ఉత్తరాయణం అని రాత్రిని దక్షిణాయనం అని అంటారు... అందుకే దేవతలకు పగలు కాలం మనకి పుణ్య కాలం అవుతుంది.. శ్రీ మహావిష్ణువు ప్రాతఃకాలంలో నిద్రలేచే సమయమే ముక్కోటి ఏకాదశి తిథి.(.అలాంటి ఉత్తరాయణ పుణ్య కాలాన్ని ఎంచుకొని మరీ ముక్కోటి ఏకాదశి నాడు భీష్మపితామహుడు స్వచ్ఛంద మరణం పొందారు.)..
ఆ సమయంలో శ్రీ మహావిష్ణువుని దర్శించడానికి మూడు వరుసలలో దేవతలు కొలువై ఉంటారట...( కోటి అంటే వరుస అని అర్థం... మూడు వరుసలలో దేవత లు కొలువుతీరి ఉంటారు కాబట్టి వారిని ముక్కోటి దేవతలు అంటారు... కానీ అందరూ అనుకుంటున్నట్లు మూడు కోట్ల దేవతలు ఉంటారని కాదు)
మకర సంక్రమణం ఆధారంగా చేసుకొని వచ్చే రెండు పండుగలలో.. మొదటిది ముక్కోటి ఏకాదశి రెండోది మకర సంక్రాంతి...
ఈ ధనుర్మాసం విష్ణు భక్తులకు చాలా ముఖ్యమైన... ప్రీతిపాత్రమైన మాసం...
Post a Comment