Sunday, 5 July 2020

gurupurnima information greetings wishes 2021 images

గురు పూర్ణిమ శుభాకాంక్షలు....
పరమశివుడిని ఆది గురువు అని పురాణాలలో ఉంది కదా ...
దానికి సంబంధించిన ఇతివృత్తమిది..
 వేల సంవత్సరాల క్రితం, శివుడు సిద్ధి పొంది, హిమాలయాల్లో పారవశ్య నృత్యం చేసారు. మనం యోగ సాంప్రదాయంలో శివుడిని దేవుడిగా చూడం. ఆయనను ఆదియోగి లేదా మొదటి యోగిగా చూస్తాం. ఆయన పారవశ్యత కదలికలను అధిగమించినప్పుడు, ఆయన నిశ్చలులయ్యారు. పారవశ్యత ఆయనలో కొంత కదలికకు అనుమతిస్తే, ఆయన తాండవ నృత్యం చేసారు. తాము అర్ధం చేసుకోలేని గాఢ అనుభూతినేదో ఆయన పొందుతున్నారని ఆయనను చూచినవారందరూ అర్ధం చేసుకున్నారు. జనాలు వచ్చి, ఆయన వారితో సంభాషిస్తాడేమో అని ఎదురు చూడడం మోదలుపెట్టారు. కాని తాము అక్కడ ఉన్న స్పృహ కూడా ఆయనకు లేకపోవడం వలన వచ్చినవారందరూ కొంతకాలం ఎదురు చూసి వెళ్ళిపోయారు. ఏడుగురు మాత్రం అలాగే వేచి ఉన్నారు. ఈ ఏడుగురు ఆయన వద్ద నేర్చుకోవాలని ఎంతో పట్టుదలతో అక్కడే ఉన్నారు. శివుడు వారిని పట్టించుకోలేదు. “మీకు తెలిసింది మేము తెలుసుకోవాలనుకుంటున్నాం” అని వారు ఆయనను బతిమిలాడారు. శివుడు వారిని పట్టించుకోలేదు, “ అజ్ఞానులారా! మీరున్న స్ధితిలో కోట్ల సంవత్సరాలైనా మీకేమీ తెలియదు. ముందు మీరు అందుకు కావాలిసిన యోగ్యత పొందాలి. ఇందుకోసం ఎంతో సాధన చేయవలిసి ఉంటుంది. ఇది వినోదం కాదు” అంటూ తోసిపుచ్చాడు. అందుకని వారు తయారవటం ప్రారంభించారు- దిన దినం, ప్రతిరోజూ అలా నెలలు, సంవత్సరాలు తరబడి వారు సంసిద్ధమవుతూనే ఉన్నారు. శివుడు వారిని పట్టించుకో కూడదనుకున్నాడు. 84 సంవత్సరాల సాధన తరువాత, ఒక పున్నమి రోజున, సూర్యుడు ఉత్తర దిశ నుండి దక్షిణ దిశలోకి మారుతున్నప్పుడు, మన సంప్రదాయంలో దక్షిణాయనం ఆరంభమవుతుందనే కాలంలో – ఆదియోగి ఈ ఏడుగురిని చూసారు. వారు తేజోవంతులైన జ్ఞానపాత్రులుగా మారారు. వారు జ్ఞానాన్నిఅందుకోవటానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నారు. ఆయన దక్షిణ దిశవైపుకి తిరిగి, ఆది గురువుగా కూర్చున్నారు కాబట్టి, మనం ఆయనని దక్షిణామూర్తి అంటాం. ఆ రోజున మొదటి గురువు జన్మించారు. అందుకని ఆ రోజుని గురుపూర్ణిమ అంటారు. ఆయన వారిని ఇక పట్టించుకోకుండా ఉండలేకపోయారు. వారు ఆయన దృష్టిని ఆకట్టుకున్నారు. తరువాతి 28 రోజులు ఆయన వారిని నిశితంగా గమనించారు. మళ్ళీ పూర్ణ చంద్రోదయమైన రోజున, ఆయన గురువుగా మారాలని నిర్ణయించుకున్నారు. ఆదియోగి తనను తాను ఆదిగురువుగా మార్చుకున్నారు. ఆయన తన కృపను వారిపై కురిపించడానికి దక్షిణ దిశవైపుకి తిరిగి, యోగ శాస్త్ర ప్రసారం ప్రారంభించారు. ఆయన దక్షిణ దిశవైపుకి తిరిగి, ఆది గురువుగా కూర్చున్నారు కాబట్టి, మనం ఆయనని దక్షిణామూర్తి అంటాం. ఆ రోజున మొదటి గురువు జన్మించారు..(నేను ఎక్కడో చదివాను) గురు శిష్య సంబంధంలోని లోతైన అంశాలను సనాతన క్రియ స్పృశిస్తుంది. వ్యక్తిని పరిణామమార్గంలో పయనింపచేసేందుకు తోడ్పడుతుంది. మీరు ఆధ్యాత్మిక మార్గంలో పయనించేందుకు గురువు సత్య దర్శనం చేయిస్తాడు. వేరొక మాటలో చెప్పాలంటే మీరు దర్శించినదానిని మరింత మెరుగుపరుచుకునే మార్గంలో పయనింపచేసేందుకు తోడ్పడతాడు అనాదిగా మన దేశంలో గురువును దైవంగా భావించారు. తల్లి,తండ్రి, గురువులు దైవంతో సమానమని మన పెద్దలు చెప్పారు. ‘గురు బ్రహ్మ...గురు విష్ణు, గురు దేవో మహేశ్వరహ... గురు సాక్షాత్ పరబ్రహ్మ... తసై్మ శ్రీ గురవే నమః’ అని గురువును కీర్తించారు. గురువు త్రిమూర్తులతో సమానమని గురువును అభివర్ణించారు. ఒకప్పుడు మన దేశంలో గురుకులాలు ఉండేవి. తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ గురుకులాల్లో చిన్నవయసులోనే చేర్పించేవారు. అక్కడ గురువులు పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి కొంతకాలం తర్వాత వారిని తల్లిదండ్రుల వద్దకు తిరిగి పంపించేవారు. పురాణ ఇతిహాసాల్లో కూడా గురువులను చాలా గొప్పగా చూపించారు. ప్రస్తుతం వ్యాసపూర్ణిమను గురుపూర్ణిమగా జరుపుకుంటున్నాము...
for stories https://bit.ly/2BDuTqV click the link
 అందరికీ గురుపూర్ణిమ శుభాకాంక్షలు...
gurupurnima information greetings wishes 2021 images
gurupurnima information greetings wishes 2021 images

Post a Comment

Whatsapp Button works on Mobile Device only