సంక్రాంతి అంటే ఏమిటి?? మనం ఎందుకు సంక్రాంతి చేసుకుంటున్నాము?? మొత్తం సంవత్సరంలో ఎన్ని సంక్రాంతులు వస్తాయి?? ప్రపంచ యోగాడే గా జూన్ ఇరవై ఒకటినే ఎందుకు నిర్థారించారు??
మన సాంప్రదాయంలో చాలా వరకు పండుగలు చంద్రగమనం ప్రకారం వస్తాయి.. కానీ ముక్కోటి ఏకాదశి, సంక్రాంతులు మాత్రం సూర్యగమనం ప్రకారంవస్తాయి.. అందుకే మన పంచాగంలో ఖచ్చితత్వం ఉంటుంది..సూర్యుడు రాశిలో ప్రవేశించడాన్ని సంక్రమణము అంటారు...అయితే ఈ సంక్రమణాన్నే సంక్రాంతి అంటారు.....
అయితే మనకు పన్నెండు రాశులు ఉన్నాయి కదా.. ఆ పన్నెండు రాశులలోకి సూర్యుడు ప్రవేశించే క్రమంలో మనకు పన్నెండు సంక్రాంతులు వస్తాయి.... సూర్య సంక్రమణం జరిగేటపుడు సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ సంక్రాంతి అంటారు...
Pongal-wishes-wallpapers-greetings-images-Sankranthi-Kanuma-Bhogi |
ఇలా ప్రతి మాసం ఒక సంక్రాంతి ఉంటుంది...
వీటిలో సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమించే మార్పు క్రమంలో తన చుట్టూ తాను కూడా తిరుగుతుంది.. అందువలన సూర్యుడు ఆరు నెలలు ఉత్తరం వైపు ఆరు నెలలు దక్షిణం వైపు కనిపిస్తాడు.. ఇలా ఉత్తరం వైపు కనిపించే క్రమమే ఉత్తరాయణం అంటారు..
మనకు ఒక సంవత్సరం = దేవుళ్ళకు ఒక రోజు...
అయితే ఒక రోజులో పగలు అనేది ఉత్తరాయణం.. రాత్రి అనేది దక్షిణాయణం.. ఈ ఉత్తరాయణమనేది అందుకే మనకు అంత ముఖ్యం.. ఈ రోజు కోసమే భీష్ముడు ఎదురుచూసి ఉత్తరాయణ పుణ్య ఘడియలలోనే పరమపదించారు..
కొన్ని ముఖ్యమైన సంక్రాంతులు..
1. ఆయన సంక్రాంతి -
ఇవి ఒకటి ఉత్తరాయణ పుణ్యకాల ప్రారంభానికి (మకర సంక్రాంతి)
రెండవది దక్షిణాయన పుణ్యకాల ప్రారంభానికి సంకేతములు(కర్క సంక్రాంతి)
ఈ రోజే :: జూన్ ఇరవై ఒకటి.. 'కర్కాటక' సంక్రాంతి.. ఇదే ప్రపంచ యోగాడే..
2. వైషువ సంక్రాంతి - ఇవి రెండు ఋతువుల మధ్య వచ్చే సంధి కాలం..
మొదటిది శీతాకాలం , వేసవి కాలం మధ్య వచ్చే సంధి కాల ప్రారంభం - మేష సంక్రాంతి (వసంతఋతువు లో వచ్చేది))
మరియు వేసవి కాలం వర్షాకాలముల మధ్య వచ్చే సంధి కాలం - తులా సంక్రాంతి (శరత్ ఋతువు లో వచ్చేది)).
సంవత్సరం మొత్తంలో ఈ రెండు రోజులు ఖచ్చితంగా పగలు రేయి సమానంగా ఉంటాయి...
అంటే సూర్యోదయం, సూర్యాస్తమయాలు దాదాపు ఒకే సమయమున సంభవిస్తాయన్నమాట.
3. విష్ణు పది సంక్రాంతి -
సింహ సంక్రాంతి , కుంభ సంక్రాంతి , వ్రుషభ సంక్రాంతి మరియు వ్రుశ్చిక సంక్రాంతి.
4. షద్శితిముఖి సంక్రాంతి - మీన సంక్రాంతి, కన్య సంక్రాంతి, మిథున సంక్రాంతి మరియు ధను సంక్రాంతి.
మిథున సంక్రాంతి రోజు అతి దీర్ఘ పగలు(అంటే పగటి సమయం ఎక్కువగా) ఉంటుంది...
ధనుస్సంక్రాంతి రోజు అతి దీర్ఘ రాత్రి (అంటే రాత్రి సమయం ఎక్కువగా) ఉంటుంది...
ఇప్పటి దాకా రాత్రి పగలు సమ కాలం అనుకునే వాడిని...
కానీ మొత్తానికి చూస్తే సంవత్సరం లో కేవలం కొన్ని రోజులు మాత్రమే రేయింబగళ్ళు సమానంగా ఉన్నాయి...
ఎంత అద్భుతం... ఒక సంవత్సరంలో ఏ రోజు ఎంత సేపుంటుంది.. సూర్యోదయ సూర్యాస్తమయ కాలాలను.. పౌర్ణమి అమావాస్యలను ఘడియ విఘడియలతో సహా ముందుగానే లెక్కవేసుకుని చెప్పేంత పరిజ్ఞానం మన పూర్వీకులకు ఉంది.
అందుకే జ్యోతిష్యం కేవలం మంచి చెడులను మాత్రం చెప్పేది.. భవిష్యత్ ను ఊహించేది మాత్రమే కాదు... అది ఒక శాస్త్రం.. అందుకే ప్రపంచం మొత్తం మన కర్క సంక్రాతికి విలువనిచ్చి ప్రపంచ యోగాడే గా పరిగణించారు..
అంతర్జాతీయ యోగా దినోత్సవం
Pongal-Sankranthi-winter-equinox-world-yoga-day-summer-equinox
సంక్రాంతి-ప్రపంచ యోగాడే
What is Pongal and what is World's Yoga Day
Why Jun, 21 decided for World's Yoga Day
World yoga day dates, why that date fixed for world yoga day, importance behind world yoga day, World yoga day greetings in telugu, World yoga day information in telugu, World yoga day significance in telugu, అంతర్జాతీయ యోగా దినోత్సవం
world yoga day information significance wishes images history in telugu
మీరు ఖగోళశాస్త్రసంబంధిత విషయాలను జ్యోతిషశాస్త్రసంబంధిత విషయాలతో ముడిపెట్టే పొరపాటు చేస్తున్నారు. చాలా శోచనీయమైనవిషయం ఇది.
ReplyDeleteకర్కసంక్రాంతి కాదు కర్కాటక సంక్రాంతి. అలాగే తుల సంక్రాంతి కాదు తులా సంక్రాంతి.
సంక్రాంతులు సూర్యగమనం వలన యేర్పడేడి నిజమే.
ముక్కోటీ యేకాదశీ అన్నది యేవిధంగా సూర్యగమనంతో మాత్రం వచ్చేదో దయచేసి చెప్పగలరా? ఇలా తెలిసీ తెలియని మాటలు వ్రాయకండి దయచేసి. యేకాదశీ అన్నది తిథి కదా, తిధి అన్నది చంద్రసంబంధంలేకుండా ఎలా ఏర్పడుతుందీ అన్న అనుమానమైనా మీకు ఎందుకు రాలేదు?
మరొక విషయం. మన నిరాయన సంప్రదాయిక పంచాగం ప్రకారం కర్కాటకసంక్రమణం అన్నది జూలై 14న జరుగుతుంది కాని జూన్ 21న కాదు. అందుచేత జూన్ 21ని మీరు మనపంచాంగంతో ముడిపెట్తలేరు. ఇది మీకు తెలియక పోవటంతో అత్యుత్సాహపడ్డారు. అంతే.
ధన్యవాదములు కమనీయం గారూ!!
ReplyDeleteముక్కోటి ఏకాదశి.. చాంద్రమాన తిథుల ప్రకారం వచ్చినా కానీ అది మకరసంక్రమణానికి ముందు వచ్చే శుక్ల పక్ష ఏకాదశి రోజున మాత్రమే వస్తుంది.. చాంద్రమాన తిథుల ప్రకారం అధిక మాసాలు కూడా వస్తాయి... అందువలన కొన్ని సంవత్సరాలు పుష్యమాసం లో , కొన్ని సంవత్సరాలు మార్గశిరమాసంలో, కొన్ని సార్లు ధనుర్మాసంలొ ఈ ముక్కోటి ఏకాదశి వస్తాయి.. రెండువేల పదమూడు సంవత్సరం ముక్కోటి ఏకాదశి లేదు.. రెండువేల పన్నెండులో రెండుసార్లు ముక్కోటి ఏకాదశి వచ్చింది ఇందుకే..
ఇంగ్లీషు క్యేలండర్ ప్రకారం జూన్ ఇరవై ఒకటిని.. సమ్మర్ సోల్ స్టైస్ (Summer solstice or Jun Solstice)అంటారు.. అది గరిష్టంగా జూన్ ఇరవై ఒకటి ~ ఒకరోజు అటు-ఇటు ఉంటుంది.. కానీ ప్రస్తుతం అన్నీ దినాలు ఇంగ్లీష్ తేదీల ప్రకారం నిర్ణయిస్తున్నారు కాబట్టి.. ఆ తేదీ ఖరారు చేసారు.. ఇంగ్లీష్ క్యేలండర్ మన క్యేలండర్ మీద ఆధారపడదు కానీ గరిష్టంగా ఆ రోజుకు ఒక రోజు ముందు కానీ తర్వాత కానీ వస్తుంది..
ఖగోళ శాస్త్రం , జ్యోతిష్య శాస్త్రం వేర్వేరు అయినప్పటికీ.. జ్యోతిష్యశాస్త్రం అనేది గ్రహ గ్రమనం మీద ఆధారపడి ఉంటుందనేది విజ్ఞులైన మీకు తప్పక తెలిసిఉంటుంది...
శ్రీరాగ