Monday, 12 January 2015

భోగి-పండుగ-భోగిపళ్లు-భోగి మంటలు-పొంగలి-బొమ్మలకొలువు-కొన్ని వివరాలు bhogi-bommalakoluvu-bhogimantalu-pongal-bhogipallu

భోగి అంటే పిల్లలకి భోగంగా భోగిపళ్లు పోయడం::
రేగు పళ్లను అర్కఫలాలు అంటారు. పిల్లలకు భోగిపళ్లు పోయడమంటే సూర్యునికి ఆరాధన చేయటమే.. రేగు పళ్ళలో ఆయుర్వేదిక లక్షణాలు ఉన్నాయి.. ఇవి నీళ్ళతో కలిపి స్నానం చేయడం వలన ఆ జలం ఔషధ గుణాలు సంతరించుకుని శీతాకాలం వ్యాపించే కొన్ని చర్మ వ్యాధులు నయం కావడానికి తోడ్పడతాయి.. అందుకే భోగి నాడు భోగి పళ్ళు పోస్తారు..
భోగి రోజు భోగిమంటలమీద - భోగి కుండల మీద నీళ్ళు కాచుకుని ఆ నీళ్ళతో స్నానం చేసేవారు..
సంక్రాంతి ప్రధానంగా రైతు సంబంధిత పండుగ.. పూర్వం/ప్రస్తుతం దాదాపు వ్యవసాయ ఆధారిత దేశమే మనది. ఈ సంక్రాంతికి దాదాపుగా పంటలన్నీ చేతికి వచ్చి అన్ని క్షేత్ర పనులన్నీ దాదాపుగా పూర్తి అయి ఉండే సమయం.. వరి,ప్రత్తి, మిగిలినవ్యవసాయ పంటలన్నీ దాదాపుగా ఇంటిదగ్గరే ఉంచుకునేవారు.. ఆ సమయంలో ఇంట్లో కావలసినంత ఖాళీ ప్రదేశం లభ్యమయ్యేదానికై పాత వస్తువులన్నీ తగులబెట్టే ప్రక్రియ చేసే వారు.. ఇదే భోగి పండుగ.. అందుకే . ఈ భోగి పండుగనాడు పాత వస్తువులను, పాతచీపుర్లను, ఎండిపోయిన కొబ్బరి మట్టలను, తాటాకులను పోగుచేసి తెల్లవారు ఝామున వేసే మంటలనే భోగిమంటలు వేస్తారు. భోగి కుండల మీద నీళ్ళు కాచుకుని ఆ నీళ్ళతో స్నానం చేసేవారు.. ఇలా చేయడం వల్ల శని దూరమవుతుందని అంటారు.
భోగి అంటే భోగభాగ్యాలనిచ్చే పండుగ::
వర్ణ సాంప్రదాయాలు పాటించే పల్లెలు.. ఈ సంక్రాంతికి తమ దగ్గరున్న  పంటలను కంసలి,కుమ్మరి, చాకలి, మంగలి పని చేసే పనివారికి పంచేవారు.. బహుమతులుగా  తెలతెలవారుతుండగానే హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల మేళాలు, పగటివేషగాళ్లు ఇలాంటి జానపద కళాకారులు ఇంటింటికి తిరిగి వారి కళను ప్రచారం చేసుకొంటారు. ఆ కళాకారులను రైతులు, గృహస్థులు గౌరవించి వారు పండించుకొన్న ధాన్యాదులను, కొత్తబట్టలు ఇచ్చి వారిని సంతోషపరుస్తారు. పిల్లలు గాలిపటాలను ఎగురవేస్తారు. పక్షుల కోసం వరికంకులను వాకిళ్లకు కట్టి వాటికి విందుచేస్తారు. ఈ భోగిపండుగ మూడవ నాడు కనుమను జరుపుతూ పశువులను అలంకరించి, పొంగళ్లను పెట్టి పశుపూజను చేస్తారు. అందుకే ఇలా ప్రతి ఒక్కరికి భోగ భాగ్యాలను ప్రసాదిస్తుంది ఈ పండుగ...
భోగి అంటే భోజనం -
భోగి-పండుగ-భోగిపళ్లు-భోగి మంటలు-పొంగలి-బొమ్మలకొలువు-images-wallpapers-photoes
భోగి-పండుగ-భోగి మంటలు-పొంగలి-గంగిరెద్దు-హరిదాసు-images-photoes-wallpapers

ఈ రోజు క్రొత్తగా పండిన వరికంకులనుండి సేకరించిన ధాన్యంతో పొంగలి తయారుచేస్తారు..ఇది మంచి రుచిని పౌష్టికతను అందిస్తుంది.. అరిసెలు, కజ్జికాయలు.. మొదలగునవన్నీ క్రొత్త వరిపిండి తో చేసే వంటలే..
భోగి రోజు చేసే బొమ్మల కొలువు-- ప్రస్తుతం మనం చేసే సైన్స్ ఫేర్ లాంటిదే.. వివిధ వస్తువులను.. విజ్ఞానాన్నీ పిల్లలలో ఊహాశక్తిని పెంచేదిగా.. ఆరోగ్యకరమైన స్నేహభావాలను పెంచేవిధంగా చేసే పండుగే సంక్రాంతి..
_/\_ ::మిత్రులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు::: _/\_

bhogi-pongal-bommalakoluvu-bhogimantalu-bhogipallu-bhogiwhishes-bhogigreetings-bhogishubhakankshalu

Post a Comment

Whatsapp Button works on Mobile Device only