Tuesday, 23 December 2014

ఆలయాలు ఎందుకు?? మనం ఆలయానికి ఎందుకు వెళ్ళాలి?? Temples - cosmic energy

ఆలయాలు ఎందుకు?? మనం ఆలయానికి ఎందుకు వెళ్ళాలి??

పంచేద్రియాలు(కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం) మనకు జ్ఞానాన్నిచ్చే ఇంద్రియాలు... వీటి ద్వారానే మనం జ్ఞానాన్ని గ్రహించ గలుగుతాము..
పంచభూతాలు (గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం) మనకు తెలుసు.. వీటికి ఎంత శక్తి ఉందో కూడా మనకు తెలుసు..
అటువంటిదే విశ్వ శక్తి కూడా... ఈ విశ్వ శక్తి అనేది విశ్వంనుండి గ్రహించే శక్తి.. ఇది పంచేద్రియాలకు అతీతమైనది
అయితే ఈ శక్తిని గ్రహించే వేర్వేరు పద్ధతులను యోగశాస్త్ర గురువు పతంజలి మహర్శి మనకు అందించారు.. వీటిని పంచేద్రియాలద్వారా మాత్రమే గుర్తించలేము.. మనకు అలా మనకు లభించే ఈ శక్తిని యోగశక్తి అనీ, ప్రాణశక్తి అనీ, విశ్వశక్తి అనీ పిలుస్తారు... అయితే యుగాలు ఒక దానినుండి మరొకటి ప్రారంభమైన కాలక్రమేణా ఇటువంటి యోగ శాస్త్ర రహస్యాలు ... రహస్యాలుగానే మిగిలి పోయి.. ప్రజలలో సాంసారిక వ్యామోహాలలోనే మునిగి... ఆధ్యాత్మిక సారాన్ని గ్రహించలేక పోతున్నారని.. అలనాటి యోగులు ముందుగానే గ్రహించి తమ యోగ శక్తిని కొన్ని విగ్రహాలలో నిక్షిప్తం చేసి వాటిని దర్శించుకుంటే ఆ యోగ/ప్రాణ/విశ్వ శక్తి అనుభూతిని పొందేవిధంగా మన ఆలయాలను విగ్రహారాధన పద్ధతులను సృష్టించారు..
మన ఆలయాలు విశ్వశక్తి నిలయాలు.. వీటి నిర్మాణం కూడా ఒక సైన్స్ అని చెప్పవచ్చు. మనకు తెలుసు.. పిరమిడ్ క్రింద ఉంచబడిన ఆహారం ఎక్కువసేపు చెడిపోకుండా ఉంటుంది.. పిరమిడ్ క్రింద ధ్యానం కొన్ని వేల రెట్ల ఫలితాన్నిస్తుందని... మన ఆలయ గోపుర నిర్మాణము.. గర్భగుడి ఉన్న ప్రదేశం.. మూలమూర్తి ని ప్రతిష్టించిన ప్రదేశం గమనిస్తే అవి అన్నీ ఒక పద్ధతి ప్రకారం కొలతల ప్రకారం కట్టబడిన వని అర్థంచేసుకోవడానికి ఎంతో సేపు పట్టదు... అయితే విశ్వనుండి వచ్చే ఆ కాస్మిక్ ఎనర్జీ(విశ్వశక్తి) మన ఆలయ గోపురం గుండా.. శ్రీ చక్రం ద్వారా మూలవిరాట్టు ద్వారా ఆలయ శక్తి ఎప్పటికీ నిలచి ఉండే విధంగా డిజైన్ చేయబడింది.. (ఇది ఎలా అంటే ఎక్కడో అంతరిక్షంలో ఉన్న ఉపగ్రహంనుండి మన ఇంట్లో ఉన్న టివి చానెల్ ఆపరేట్ అవుతున్న మాదిరిగా అన్నమాట...) ఇలా ప్రసారం కాబడే శక్తే ఈ ప్రాణ శక్తి...
మనం ఆలయాన్ని దర్శించుకున్నప్పుడు ఈ శక్తిని గ్రహించ గలిగితే ఆధ్యాత్మికం గా పురోగమిస్తాము.... మనకున్న చిన్న చిన్న కోరికలనుండి ముక్తి అయి గమ్యస్థానానికి చేర్చే స్థాయి కి చేరుకుంటాము..
దేవాలయాలలోని మనం గ్రహించిన శక్తిని గుర్తు చేసుకునేందుకు ఆ మూలవిరాటు చిత్రాలు మన పూజా గదిలో ఉంచుకుని పూజచేస్తాము.. ఇక్కడ మనం కేవలం ఆ విగ్రహ రూపును కాక ఆ శక్తిని గుర్తు చేసుకోవాలి.. దీనినే నిరంతర ధ్యానం అంటారు.. ఎవరైతే అనునిత్యం ఈ శక్తిని దర్శించగలరో. వారు ధన్యమైనట్లే... ఈ శక్తిని ఎవరు ప్రసారం చేయగలరో వారు నిజమైన గురువులు..
గర్భగుడిలో మనం ఆ శక్తి(ట్రాన్స్ మిషన్) ని గుర్తించగలిగిన నాడు.. ఈ వ్యాసంలోని అంతరార్థం మీకు అర్థమవుతుంది.. ఒక్కసారి ఆ రుచి చూసిన తర్వాత ఇహలోక వ్యామోహాలు ఏవీ వాటి ముందు పనిచేయవు..
అందరికీ ఆ భగవంతుని వీక్షణా కటాక్ష ప్రాప్తిరస్తుః !!!

Post Tags:

What is the use of visiting the temples frequently,
temple visit uses,
how to get the cosmic energy received from Hindu temples,

  1. విగ్రహారాధన ఏదో పెద్ద నేరమయిన్నట్లుగా వ్యాసాలు వ్రాస్తున్న వారికి కనువిప్పు కలిగేలా చేసారు. మంచి విషయం చెప్పారు. రోజుకి పది సార్లు గాల్లో ప్రార్ధనలు చేసేకన్నా, ఒక్క క్షణం ఆ దివ్య మంగళ రూపాన్ని తలుచుకుంటే ఒళ్ళు పులకించిపోదా?

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదములు!!జగదీశ్ గారు!! _/\_

      Delete

Whatsapp Button works on Mobile Device only