Thursday 6 November 2014

అతి తక్కువ ధరతో హెయిర్ రిమూవర్, స్కిన్ నోరిషర్, స్క్రబ్బర్, స్కిన్ గ్లోయింగ్ పౌడర్, మసాజర్, బ్లాక్ హెడ్ రిమూవర్, స్కిన్ టోనర్, స్కిన్ వైటెనర్ లను అది కూడా ఒకే పౌడర్ లో ఈ లక్షణాలన్నీ ఉండేలా తయారు చేసుకోవాలని ఉందా?? Herbal powder

అతి తక్కువ ధరతో హెయిర్ రిమూవర్, స్కిన్ నోరిషర్, స్క్రబ్బర్, స్కిన్ గ్లోయింగ్ పౌడర్, మసాజర్, బ్లాక్ హెడ్ రిమూవర్, స్కిన్ టోనర్, స్కిన్ వైటెనర్ లను అది కూడా ఒకే పౌడర్ లో ఈ లక్షణాలన్నీ ఉండేలా తయారు చేసుకోవాలని ఉందా??క్రింది సూచనలను పాటించండి... ఇవి మన తరతరాలనుండి పెద్దలు మనకిచ్చిన సాంప్రదాయాలు..
ఇప్పుడు ఇక్కడ ఉదహరించిన ఈ పౌడర్ మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.. మీరు చేయవలసినదల్లా ఒకటే.. ప్రతిరోజూ స్నానం చేసే టపుడు సబ్బుకు బదులు ఒకసారి ఈ పౌడర్ను సబ్బులాగా శరీరానికి రుద్దుకుని స్నానం చేయడమే... దాదాపు చాలా మంది రెండు సార్లు సబ్బురుద్దుకుని స్నానం చేస్తాం కదా.. అందులో మొదటిసారి ఈ పౌడర్ తో రెండవసారి సబ్బుతో ఇలా దాదాపు ఆరు నెలలు స్నానం చేయండి... మీ చర్మం యొక్క పరిస్థితిని గమనించండి... ఈ పౌడర్ లో పసుపు ఉంటుంది కాబట్టి.. మొటిమలు, బ్లాక్ హెడ్స్, క్రిమి కీటకాలు మీ చర్మంపైకి చేరవు... ఈ పౌడర్ లో పిండి పదార్థాలు చర్మానికి కావలసిన పోషకాలను డి-విటమిన్ ను అందిస్తుంది.. అందుకే చర్మపు కాంతి పెరిగి చాలా ఆకర్షణీయంగా కనపడతారు... చామన చాయలో కూడా చాలా చాలా అందం ఉంది... ఆ అందం మరింత ఇనుమడిస్తుంది మన చర్మపు కాంతితో... ఈ పౌడర్ లో ఉన్న పసుపు హెయిర్ రిమూవర్ లా పనిచేస్తుంది.. అందుకే శరీరంపై ఎక్కడా ఆవాంచిత రోమాలు ఉండవు.. మగవారు ఈ పౌడర్ వాడే టప్పుడు పసుపు లేకుండా వాడడం మంచిది.. ఈ పౌడర్ లో పసుపు మన మేని చాయను పెంచుతుంది... నెమ్మదిగా పసుపు వర్ణంలోకి మారవచ్చు మన మేని చాయ..
కావలసిన పదార్థాలు/తయారు చేసుకునే విధానం::
పెసలు అర కిలో
శనగలు 50 గ్రాములు
బియ్యం 25 గ్రాములు
కచ్చూరాలు 10 గ్రాములు
బావంచాలు 10 గ్రాములు
కస్తూరి పసుపు 10 గ్రాములు
మంచిగంధం 10 గ్రాములు
బాదం పప్పు 25 గ్రాములు
వట్టి వేళ్ళు 10 గ్రాములు
కుంకుడు పొడి 25 గ్రాములు
శీకాయ పొడి 25 గ్రాములు
వీటిని ముందు చిన్న ముక్కలు చేసుకుని అప్పుడు మిక్సీ లో వెయ్యండి
లేదంటే మిక్సీ బ్లేడ్ గోవిందా
మరీ మెత్తగా అక్కర లేదు . జల్లించకుండా వాడండి .
మీ మేని మెరుపుకి ఇదే రహస్యం అని ఎవరికీ చెప్పకండి
మన దగ్గర అన్ని పదార్థాలు ఉండనవసరం లేదు.. కనీసం శనగలు, బియ్యం ఉండి మిగిలినవి కొన్ని ఉన్నా పర్లేదు..
ఇంతకీ ఈ పదార్థం పేరు తెలుసా.... దీనినే మనం సున్ని పిండి అంటాము...
పాటించి చూడండి...

సున్ని పిండి 
Sunni pindi

Sunni pindi


Post a Comment

Whatsapp Button works on Mobile Device only