Tuesday, 28 October 2014

ఫేస్ బుక్ అకౌంట్ ను భద్రంగా కాపాడుకోవడం ఎలా?? Facebook Tips and Tricks


ఫేస్ బుక్ అకౌంట్ ను భద్రంగా కాపాడుకోవడం ఎలా??
ప్రస్తుత కాలంలో ఫేస్ బుక్ అకౌంట్ లేని వారు చాలా తక్కువ.. మనలో చాలా మంది ఇప్పుడు మొబైల్ లో అంతర్జాలాన్ని వినియోగిస్తున్నాం.. రైల్వే టికెట్ బస్ / టికెట్ / బ్యాంకు లావాదేవీలు మొదలగునవి చాలా మంది  మొబైల్ లోనే వినియోగిస్తున్నారు..  మనం తెలిసో తెలియకో చేసే చిన్న చిన్న తప్పులు మన బ్యాంకు ఖాతాలను కూడా  హ్యాక్ అయ్యేవిధంగా చేయవచ్చు.. మన మొబైల్ బ్యాలెన్స్ ను ఖాళీ చేయవచ్చు.. అందుకే క్రింది జాగ్రత్తలు తీసుకుంటే మన అకౌంట్ హ్యాక్ కాకుండా అంటే వేరొకరి చేతుల్లోకి వెళ్ళకుండా నియంత్రించుకోవచ్చు... 
. అప్లికేషన్ పర్మిషన్:
ఈమధ్య కొత్తగా వచ్చే క్యాండిక్రష్ సాగా, లాంటి గేములు మొదలగునవి అప్లికేషన్ యాక్సెస్ గురించి అడుగుతాయి.. మనం ఒక్కసారి ఆ యాప్ కు పర్మిషన్ ఇచ్చామంటే మన జుట్టు వారి చేతికందించినట్లే.. అవి ఏ గేమ్ అయినా సరే .. చివరికి యాండ్రాయిడ్ వైరస్ రిమూవర్ అప్లికేషన్ అయినా సరే.. మన అకౌంట్ యాక్సిసింగ్ కు మనం వారికి అవకాశం ఇవ్వకూడదు... ఈ విధంగా చేయడం వలన మన మొబైల్ నిదానించడమే కాక మనం వాడే అన్ని రకాల లింకులు/సైట్ల వివరాలను సేకరించేందుకు సెర్చ్ రోబట్లకు మనం అవకాశం ఇచ్చినట్లవుతుంది... 
స్పామీ వీడియో లింకులు::
మనకు తెలియని మనుష్యుల నుండి వచ్చే వీడియోల లింకు తెరవ కూడదు.. కొన్ని కొన్ని వీడియోల టైటిల్స్ చూడగానే వెంటనే ఒక సారి చూడాలని అనిపిస్తుంది.. దానిని తెరువగానే వేరే ఒక సైటుకు మనను తీసుకెళ్తుంది.. అవి స్పామ్ సైట్లు అందుకే వీడియోల పట్ల జాగ్రత్తగా ఉండాలి..
డౌన్ లోడ్ నోటిఫికేషన్:
మీరు ఒక వీడియోను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఒక కోడెక్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని ఒక డౌన్ లోడ్ నోటిఫికేషన్ వస్తుంది.. ఇది ట్రాజన్.. మెసేజ్.. ఒకసారి డౌన్ లోడ్ చేసుకుంటే మన కంప్యూటర్ /మొబైల్ లోకి మనమే ట్రాజన్ ను డౌన్ లోడ్ చేసుకున్నట్లు...
ఫేస్ బుక్ టీం, సెక్యూరిటీ టీం, ఫేస్ బుక్ సెక్యురిటీ పేర్లతో వచ్చే మెసేజ్ తో పాటు వచ్చే లింకులు కూడా ఇటువంటివే..
ఇటువంటి హ్యాకింగ్ బాధలు పడకూడదంటే...
మీరు ఎప్పుడూ ఉపయోగించే  ఫోన్ నెం. ను రిఫరెన్స్ క్రింద ఇచ్చి... అక్కడి ప్రైవసీ ఆప్శన్ ను ఒన్లీ మి అని ఉంచుకోండి.. అందువలన ఆ నెం. కేవలం మీకు తప్ప ఎవరికీ కనపడదు... ఒకవేళ మన అకౌంట్ కు ఏదైనా ముప్పు వస్తే వెంటనే మనం తిరిగి తెచ్చు కోవచ్చు..
మీకు బాగా తెలిసిన వారినే మిత్రులుగా ఎంచుకోండి.. 
మీ ఫేస్ బుక్  అకౌంట్ ఓపెన్ చేయగానే మీ ఫోన్ కు మెసేజ్ వచ్చేలా నోటిఫికేషను ను టర్న్ ఆన్ చేసుకోండి...
మీ ఫేస్ బుక్ పాస్ వర్డ్ ను తరచుగా మారుస్తూ ఉండండి... 
పదిలంగా మీ అకౌంట్లు ఉంచుకోండి... వీలైనంత మంచి విషయాలను పంచుకోండి, తెలుసుకోండి.. ఆనందించండి..


How to prevent Face book account from being hacked

How to prevent Face book account from being hacked

Face Book Tips

Post a Comment

Whatsapp Button works on Mobile Device only