Thursday, 30 October 2014

చిదంబరం పరమాద్భుత క్షేత్రం... జీవితంలో ఒక్కసారైనా దర్శించదగిన శివకేశవులు ఇద్దరూ ఒకే క్షేత్రంలో కొలువైన క్షేత్రం..

చిదంబరం:: పరమాద్భుత క్షేత్రం..
chidambaram temple gopuram images

ఇది సాక్షాత్  పరమశివుడు ఆనంద తాండవం చేసిన ప్రదేశం... శివుని నృత్యం ప్రత్యేకమైనది.. ఇక్కడ చేసేది ఆనంద తాండవం.. 
ఈ నృత్యాన్ని చూసి విష్ణువు పులకించి పోయాడట.. (ఆనంద తాండవాన్ని చూసేందుకు వెళ్ళిన ఆ సమయం ఆది శేషుడికి కూడా తెలియదు... స్వామి వారి మోములోని ఆనందానికి కారణం తెలుసుకోగా అది ఆనంద తాండవాన్ని చూసిన ఆనందమని చెప్తారు శ్రీ మహావిష్ణువు.. వెంటనే ఆదిశేషుల వారికి ఆ తాండవాన్ని చూడాలనే కోరిక కలుగుతుంది... కేవలం ఈ కోరికను నెరవేర్చుకోవడానికే ఆదిశేషులవారు పతంజలి మహర్షి అవతారం ఎత్తవలసి వస్తుంది..)
govindaraja perumal temple images in Chidambaram

అందుకే ఈ క్షేత్రం హరిహర క్షేత్రం.. ఇంకొక విచిత్రమేమంటే శ్రీహరిని చూడాలని వచ్చినవారికి శివదర్శనం.. శివుని చూడాలని వచ్చిన వారికి విష్ణు దర్శనం లభిస్తాయి... ఇక్కడ శివ తత్వం.. విష్ణు తత్వం విడివిడిగా కనపడవు...

చిదంబరంలో శివునికి సంబంధించి నటరాజ స్వామి రూపంలో.. స్ఫటిక లింగ రూపంలో, ఆకాశ లింగ రూపంలో కొలుస్తాము... ఆకాశలింగం అంటే దీనికి వేరే ఆకారం అంటూ ఏమీ ఉండదు. ఆలయపు గోడలో బంగారు రేకుమీద యంత్రంతో బిగించబడి ఉంటుంది. దాని ఎదుట ఒక తెరవేసి ఉంటుంది. లోపలకు వచ్చిన తరువాత ఆ తెర తీసి చూపిస్తారు. అంటే మనకు కనపడనిది చిదంబర రహస్యం అనుకోవాలి.

చిదంబర రహస్యం:
పాశ్చాత్య శాస్త్రజ్ఞుల 8 సంవత్సరాల పరిశోధనల అనంతరం తేలిందేమంటే.. చిదంబరం నటరాజ స్వామి వారి విగ్రహం ఉన్న స్థలం భూమి యొక్క అయస్కాంత క్షేత్ర మధ్యలో ఉందట... ఇదే విషయాన్ని ప్రాచీన తమిళ శాస్త్రవేత్త తిరుమూలార్ అయిదు వేల ఏళ్ళ క్రితమే నిరూపించారని తెలుస్తోంది... చిదంబరంలోని తిరుమందిరం మొత్తం ప్రపంచ శాస్త్ర విజ్ఞానానికే దారి చూపేదిగా ఉందట.

దీనిని అర్థంచేసుకొనేందుకు వంద ఏళ్ళైనా పడుతుందేమో మనకు... ఎందుకంటే అక్కడి శిల్పాల అర్థాలు తెలుసుకోనేందుకు చాలా ఉన్నాయి.. ఉదాహరణకు మానవ ప్రత్యుత్పత్తి సంబంధించిన క్రోమోజోమ్ లు పాముల రూపంలో ఒక దానికి మరొకటి పెనవేసుకున్న విగ్రహమే ఇందుకు ఉదాహరణ.... మనకు భిన్న రూపంలో ఉన్న పాములు మాత్రమే కనపడతాయి..
చిదంబరం పంచభూత క్షేత్రాలలోని ఒక క్షేత్రమని మనందరకూ తెలుసు...
పంచభూతాలు అంటే భూమి,గాలి, నీరు, అగ్ని, ఆకాశం మన ప్రకృతిలో భాగాలైన ఈ పంచభూతములలో పరమేశ్వరుని తత్వం గ్రహించడానికా అన్నట్లు ఈ క్షేత్రాలు నిజంగా అవి ఉన్న స్థలాలు చుస్తుంటే.. మన పూర్వీకులు మనకు ఎంత మంచి తత్వాన్ని, అనుగ్రహించారో తెలుస్తోంది..
పృథ్వీ లింగమైన కంచి ఏకాంబరేశ్వర లింగం, ఆకాశ లింగమైన చిదంబరం, వాయు లింగమైన శ్రీకాళహస్తి లు ఉన్న ప్రదేశాలు గూగుల్ మాప్ లో చూస్తే మనకు ఒక అద్భుతం గోచరిస్తుంది.. అవి మూడు ఒక సరళ రేఖాకృతిలో 79 degrees 41 minutes Longitude మీద ఉన్నాయి... ఇది చాలా చాలా అధ్బుతం...
పంచభూత లింగ క్షేత్రాలు మూడు ఒకే లాంగిట్యూడ్ పై ఉండడం అద్భుతమే కదా..
Chidambaram-3-panchalingkshetra-చిదంబరం-శ్రీకాళహస్తి-కాంచీపురం-పంచభూతలింగ-క్షేత్రాలు
Chidambaram :: 3 panchalingkshetra's  in one coordinate longitude Chidambaram-3-panchalingkshetra-చిదంబరం-శ్రీకాళహస్తి-కాంచీపురం-పంచభూతలింగ-క్షేత్రాలు

ఆరోజుల్లో ఏ పరిజ్ఞానం ఉంటే ఇది సాధ్యం... కుహనా మేధావులకేం తెలుస్తుంది..
మానవులలోని నవరంధ్రాలకు సూచనగా చిదంబరం ఆలయంలో తొమ్మిది ద్వారాలుంటాయి..
మానవుడు ఒక రోజు చేసే ఉచ్చ్వాస నిశ్వాసల సంఖ్య 21600 (15 x 60 x 24 = 21600)
సరిగ్గా ఈ ఆలయ పై కప్పు 21600 బంగారు పలకలతో తాపడం చేసి ఉంటుంది...
ఈ 21600 బంగారు పలుకలు 72000 బంగారు మేకులతో తాపడం చేసి ఉంటాయి.. ఈ 72000 అనేవి మానవునిలో ఉన్న నాడుల సంఖ్య...
మన శరీరంలోకి ప్రసరించే శక్తి అనేది కంటికి కనపడదు...ఇక్కడ శివలింగం కూడా అదృశ్య రూపంలో ఉంటుంది అక్కడ ఏమీ ఉండదు..( ఆ స్థలంలో ఒక కర్టెన్ వేలాడదీయబడి ఉంటుంది.. )అదే చిదంబర రహస్యం...
కనకసభా మండపం లోని నాలుగు స్థంభాలు నాలుగు వేదాలను సూచిస్తాయి..
పొన్నాంబళం అనేక్షేత్రం లో ఐదు మెట్లు పంచాక్షరిని శి, వా, య, న, మః ను సూచిస్తాయి...
పొన్నాంబళం లో 28 స్థంభాలు.. ఆగమ శాస్త్ర ప్రకారం శివుని కొలుచుటకు తెలిపే ఆగమములకు సంకేతం.
28 స్థంభాలు..  64  దూలాలసాయంతో నిలబడి ఉంటాయి.. ఇవి  64  కళలకు సంకేతం...
అడ్డ వరుసలో వాటిని కలుపుతున్నదూలాలు.. మానవ దేహంలోని నరములకు సంకేతాలు...
9 బంగారు గోపురం పై ఉన్న 9  కలశాలు తొమ్మిది శక్తులకు సంకేతాలు...
అర్థ మండపంలో ఉన్న ఆరు స్థంభాలు ఆరు శాస్త్రాలకు ప్రతీకలు...
అర్థ మండపానికి ఆనుకుని ఉన్న మండపం లోని పద్దెనిమి స్థంభాలు అష్టాదశ పురాణాలకు సంకేతాలు..
నటరాజస్వామి నర్తించిన నృత్యం విశ్వైక నృత్యంగా ప్రకటితమైనది..
ప్రాచీన కాలంలోనే గుర్తించబడిన ఈ సత్యాలు నెమ్మదిగా ఒక్కొక్కటే వెలుగుచూస్తున్నాయి...
చిదంబరం.. జీవిత కాలంలో ఒక్కసారైనా చూడవలసిన క్షేత్రం...
To see the temple and history please see the following video 👇👇👇


Chidambaram :: 3 panchalingkshetra's  in one coordinate longitude Chidambaram-3-panchalingkshetra-చిదంబరం-శ్రీకాళహస్తి-కాంచీపురం-పంచభూతలింగ-క్షేత్రాలు


Some other ancient interesting temples information you may interested see the following links 👇👇👇👇




Tags:
Chidambaram temple images history significance;
Temples in Chidambaram,
Chidambaram temple information in telugu, 

Post a Comment

Whatsapp Button works on Mobile Device only