Wednesday, 15 October 2014

Unsolved mistories in India, Krishna's butter ball, Mahabalipuram

ఇప్పుడు మనం చూస్తున్న ఈ రాయిని... Krishna's Butter Ball అని పిలుస్తారు..
ఇది మహాబలిపురంలో ఉంది...
Unsolved mistories in India, Krishna's butter ball, Mahabalipuram







దీనికి దాదాపు 1200 సంవత్సరాల చరిత్ర ఉంది... 20 అడుగుల పొడవు వెడల్పు, ఎత్తులు కలిగి చాలా ప్రదేశాలలో దాదాపు గోళాకృతిని కలిగి కేవలం రెండు చదరపు గజాల స్థలంలో నిలచి ఉంటుంది...
Unsolved mistories in India, Krishna's butter ball, Mahabalipuram
ఈ రాయి ఉన్న కొండ ప్రదేశం చాలా జారుడుగా ఉండి మనం జాగ్రత్తగా నడిచేవిధంగా ఉంటుంది... దాదాపు  250  టన్నుల బరువు వున్న ఈ రాయి అక్కడ చెక్కు చెదరకుండా ఉండడమే ఒక మిస్టరీ...
జాగ్రత్తగా రాయిని పరిశీలించండి...
Unsolved mistories in India, Krishna's butter ball, Mahabalipuram
దాని క్రింద ఉన్న జనాల పరిమాణం చూస్తుంటే అర్థమవుతుంది అది ఎంత పెద్ద రాయోనని...
1908 సంవత్సరంలో ఈ ప్రదేశాన్ని పరిశీలించిన ఆర్థర్ లాలీ అనే బ్రిటిష్ దొర ఈ ప్రదేశం చాలా అపాయకరంగా ఉంది.. దీనిని తొలగిస్తేనే మంచిది లేకపోతే ఎవరికైనా ప్రాణాపాయం సంభవించవచ్చు అని తలచి... ఒక ఏడు ఏనుగులను తెప్పించి పెద్ద పెద్ద గొలుసులను ఉపయోగించి ఎత్తునుండి పల్లానికి దొర్లించడానికి ప్రయత్నించారట... కానీ వారు కొంచెం కూడా ఆ రాయిని జరుపలేక వెనుదిరిగారని ఒక కథనం...
కొంతమంది ఈ రాయిని ఏదో ఆలయం కోసం తయారీకి ప్రారంభించి మధ్యలో వదిలేసారని భావించారు.. కానీ ఆ రాయి మూలం అలా కొండ నుండి బయటకు వచ్చినట్ట్లు లేదు... ఆ రాయికి కొండకు వర్ణాలలో చాలా వ్యత్యాసం గమనించారట... అందుకే ఈ రాయి బయటనుండే వచ్చిందని ఒక భావన... ఒక వేళ ఏదో గుడికై నిర్మాణం ప్రారంభించి మధ్యలో వదిలేసేదైతే ఇక్కడ కొండలలో చాలా శిల్పాలు డైరెక్ట్ గా కొండలలోనే మరల్చారు.. కానీ ఈ రాయిని ఒక్కరు కూడా ముట్టలేదు.. అందుకే ఇది ఇక్కడ ఒక ప్రత్యేకత అయింది.. ఈ ప్రదేశంలో అనేక ఆలయాలను కట్టించిన పల్లవరాజు నరసింహ వర్మన్ ఈ రాయిని దేనికీ ఉపయోగించవద్దని ఇది ఆకాశదేవుని రాయని ఏ శిల్పీ ముట్టకూడదని శాసించాడని ఒక కథనం...
ఇలాంటి రాళ్ళు పెరూ లోని మాచుపిచు లో,


కొన్ని మెక్సికన్ నగరాలలో ..
అదీను గ్రహాంతర వాసులు(ఎలియన్స్-ఎగిరేపళ్ళాలు) పరిభ్రమిస్తున్నారనే ఊహాగానాలు ఉన్న ప్రదేశాలలోనే ఉండడం గమనార్హం...
250 టన్నుల రాయిని అంత పైకి తీసుకురావాలంటే ఎన్ని క్రేన్ లు అవసరమో... ఆ రోజుల్లో ఆ సాంకేతికత ఎలా సాధ్యమైందో... అందుకే ఇది ఎప్పటికీ అంతుపట్టని మిస్టరీ జాబితాలో చేరి పోయింది...

Unsolved mistories in India, Krishna's butter ball, Mahabalipuram

Post a Comment

Whatsapp Button works on Mobile Device only