Friday, 5 September 2014

మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి ఆలయం - పానకాల స్వామి మహత్యం:::సైన్సు కారణాలు:::: Mangalagiri Sri Laxmi Narasimha Swamy


మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి ఆలయం - పానకాల స్వామి మహత్యం:::సైన్సు కారణాలు::::
ఈ దేవాలయంలో విగ్రహమేమీ ఉండదు; కేవలం తెరుచుకుని ఉన్న నోరు ఆకారంలో ఒక రంధ్రం ఉంటుంది.

Mangalagiri Sri Laxmi Narasimha Swamy

ఆ తెరచుకొని ఉన్న రంధ్రమే పానకాల స్వామిగా ప్రజల నమ్మకం. మంగళగిరి పానకాలస్వామి కి ఒక ప్రత్యేకత ఉంది. పానకాలస్వామికి పానకం (బెల్లం, పంచదార, చెరకు) అభిషేకం చేస్తే, అభిషేకం చేసిన పానకంలో సగం పానకాన్ని స్వామి త్రాగి, మిగిలిన సగాన్ని మనకు ప్రసాదం గా వదిలిపెడతాడుట. ఎంత పానకం అభిషేకించినా, అందులో సగమే త్రాగి, మిగిలిన సగాన్ని భక్తులకు వదలడం ఇక్కడ విశేషం. అందుకనే స్వామిని పానకాలస్వామి అని పిలుస్తారు. పానకాలస్వామికి ఇక్కడ డ్రమ్ముల కొద్దీ పానకాన్ని తయారు చేస్తుంటారు. పానకం తయారీ సందర్భంగా కింద ఎంతగా ఒలికిపోయినా ఈగలు చీమలు చేరవు. సృష్టిలో ధర్మం పూర్తిగా నశించి యుగ సమాప్తి దగ్గరపడినపుడు మాత్రమే పానకం ఒలికినపుడు ఈగలు, చీమలు చేరడం ఆరంభమవుతుందని అంటారు. మద్రాసులోని సెయింట్‌ జార్జి ఫోర్ట్‌ గవర్నర్‌ రస్టెయిన్‌షామ్‌ మాస్టర్‌ మచిలీట్నం నుంచి మద్రాసు వెడుతూ 1679 మార్చి 22వ తేదిన మంగళగిరి చేరుకున్నాడు. ఆ రాత్రి ఆయన ఇక్కడే బసచేసి, ఈ మహత్తును గురించి విని, స్వయంగా కొండపైకి వెళ్లి పానకాలరాయుని సన్నిధిని పరిశీలనగా చూశారు. ఇదేదో గమ్మత్తుగా ఉందని, తనకైతే నమ్మశక్యంగా లేదన్నారు. మంగళగిరిలో ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. హేతువాదులు మంగళగిరి కొండ ఓ అగ్ని పర్వతమని, దీనిలో గంధకం ఉందని, ఎప్పటికైనా పేలిపోయే ప్రమాదముందని, ఆ విపత్తు నుంచి మంగళగిరిని రక్షించేందుకే, గంధకాన్ని ఉపశమింపజేసేందుకే, నిత్యం పానకాన్ని నివేదించాలని, పూర్వీకులు దేవుని పేరిట ఈ ఏర్పాటు చేశారని వాదిస్తుంటారు. ఏది ఏమైనా ఎంత పానకం పోస్తే దానిలో సగం మాత్రమే తిరిగి రావటమనే ప్రక్రియ ఎంతో ప్రావీణ్యం కూడినది.... ఒకటి దైవ మహత్యాన్నయినా ఒప్పుకోవాలి... రెండవది .. అగ్ని పర్వతాన్ని బెల్లపు నీటి పానకం చల్లారుస్తుందని తెలుసుకున్న మన పూర్వీకుల వైజ్ఞానిక మేథస్సునైనా మెచ్చుకోవాలి.... మూడవది... అగ్ని పర్వతాన్ని చల్లార్చటానికి మొత్తం కొండలో చిన్న సొరంగం చేసి దాని బయటి భాగం మాత్రం తెరిచి అభిషేకం చేసే విధంగా చేయటం అద్భుతాలకు మించిన అద్భుతం కాదా.. రెండు వేల ఏళ్ళకు పైగా చరిత్ర కలిగిన ఈ ప్రాంతం ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర రాజధాని కావటం చాలా ఆనందంగా ఉంది...

Mangalagiri Sri Laxmi Narasimha Swamy

You may also Read Download Mahabharata all Stories in on pdf: Click here

క్రింద కనపడుతున్నవన్నీ పుస్తకములే... మీకు నచ్చిన పుస్తకములను క్లిక్ చేస్తే... బ్రౌజర్ ఆ పోస్ట్ లోకి తీసుకువెళ్తుంది... ఒకవేళ బ్రౌజర్ ఓపెన్ అయి ఖాళీగా కనపడితే... top right corner లో ఉన్న  3 dots క్లిక్ చేసివచ్చిన ఆప్షన్స్ లో open with browser option ఎంచుకోండి... అప్పుడు మీకు కావలసిన బుక్ లిస్ట్ ఓపెన్ అవుతుంది... అందులో కావలసిన బుక్ సెలెక్ట్ చేసుకుని డౌన్ లోడ్ చేసుకోండి... 

భగవద్గీత

Post a Comment

Whatsapp Button works on Mobile Device only