అనిరుధ్ చిరుద్యోగి.. అతను వాసంతితో ప్రేమలో పడతాడు.. ఇద్దరు చాలా గాఢంగా ప్రేమించుకుంటారు.. అనిరుధ్ తనకున్నంతలో చాలా బహుమతులు కూడా ఇస్తుంటాడు.. ఒకరోజు వాసంతి అనిరుధ్ తో రేపటి నుండి నన్నుచూడడం వీలవదు నేను అమెరికాకు వెళ్తున్నాను బై .. ఫోన్ చేసి చెప్పి స్విచ్ ఆఫ్ చేసేస్తుంది..
అప్పటి నుండి ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఫోన్ పనిచేయదు..
అనిరుధ్ చాలా రోజులు బాధపడి తను కేవలం చిన్న ఉద్యోగి కాబట్టి వాసంతి తనను అలా వదిలేసిందని భావించి చాలా కష్టపడి కొన్ని సంవత్సరాలలో తనదైన వ్యాపారాన్ని ప్రారంభించి మంచి స్థితికి ఎదుగుతాడు..
ఇప్పుడు తనకు ఇల్లు, కారు, మంచి బ్యాంకు బ్యాలన్సు వస్తుంది..
ఈ సమయంలో తన ప్రేమను మరొక్కసారి చెబుదామని అనిరుధ్ మరల తన ఊరికి ప్రయాణమవుతాడు.. ఊరికి తన స్వంత కారులోనే వస్తాడు..
ఊరి ప్రారంభంలో ఒక జంట అతనికి తారసపడతారు..
చాలా దూరంనుండే అనిరుధ్ గుర్తు పడతాడు వారు వాసంతి అమ్మనాన్నలని.. వారు వర్షంలో వెళ్తూ గొడుగుక్రింద చాలా బాధగా ఉన్నట్లనిపిస్తుంది.. అక్కడికి దగ్గరలో స్మశానం తప్ప వేరేదేమీ లేదు... అందుకే వారు ఎక్కడికి వెళ్తున్నారు ఏమైంది!!! అనే ఆసక్తితో చూస్తూ ఉన్నాడు అనిరుధ్.. వారు స్మశానంలోని ఒక సమాధి దగ్గర ఆగిపోయి రోదించడం గమనిస్తాడు..
చూస్తే అక్కడ తన వాసంతి .. చిరునవ్వులు చిందిస్తున్న ఫోటో.. ముందు రెండు దీపాలు కనపడతాయి.. అంటే తన వాసంతి చనిపోయిందా..
ఒక్క సారిగా భూమి క్రుంగి పోయినట్లనిపించింది అనిరుధ్ కి.. కళ్ళు ఒక్కసారిగా నీటితో నిండి పోయి ఏమీ కనిపించలేదు.. వాసంతి తల్లి తండ్రులు అనిరుధ్ ని గమనించి దగ్గరకు వచ్చి అప్యాయంగా నిమురుతారు.. అనిరుధ్ అంకుల్ ఏమయింది వాసంతికి అని అడుగుతాడు.. వాసంతి అమెరికా వెళ్ళలేదా అని అడుగుతాడు.. బాబూ!! వాసంతి అమెరికా వెళ్ళలేదు.. నీకు ఫోన్ చేసిన రోజు వాసంతి చివరి రోజు.. తను చాలా రోజుల నుండి కేన్సర్ తో బాధ పడుతుంది.. నీవు ఉన్న స్థితి నుండి ఎదగాలని... తనను పూర్తిగా మరచి పోవాలని అలా అబద్ధం చెప్పింది.. తనను క్షమించు.. అని చెబుతారు.. తనను ఇంతగా ప్రేమించిన వాసంతిని తప్పుగా భావించాడని అర్థమయింది అనిరుధ్ కు.. ప్రేమ ఎప్పుడూ త్యాగాన్నే కోరుతుందనుకున్నాడు తాను త్యాగం చేసాననుకున్నాడు కానీ నిజంగా త్యాగం చేసింది వాసంతినే నని... తనకు ఇప్పుడున్న బంగారు భవిష్యత్ కు మూలకారణం వాసంతియేనని అర్థం చేసుకోవడానికి ఎంతో సేపు పట్టలేదు అనిరుథ్ కు... మన అనుకునేవారు దూరమయితే పడే బాధ ఎంతో ఎక్కువ.. కానీ ఆ దూరం ఎందుకు ఏర్పడిందో తెలుసుకోగలిగితే జీవితంలోని చాలా బాధలు మన దరికి చేరవు..
Post a Comment