చేప కన్ను దర్వాజా కథ
పూర్వం ఒక ఊరిలో ఒక తాత ఒక మనవడు ఉండే వారు.. ఇద్దరూ సముద్రంలో చేపలు పట్టుకునే వృత్తిలో ఉండేవారు... తాత వృత్తినుండి విశ్రాంతి తీసుకుని తన కొడుకు ముత్యాలరావుకు, మనవడు తరుణ్ కు బాధ్యతలు అప్పగించాడు... ముత్యాల రావు, వరుణ్ రోజూ పోటీలు పడి పెద్ద పెద్ద చేపలు పట్టుకొచ్చేవారు... వీరు ఎంత పెద్ద చేపను తెచ్చినా తాత ఓసి ఇంతేనా నేను ఇంకా పెద్ద చేపను పట్టేవాడిని.. అని గేలిచేస్తూ ఉండేవాడు...ఇలా రోజూ జరుగుతుండే సరికి తరుణ్ కు ఒక రోజు విసుగు వచ్చి ఏదీ నాకు ఒకసారి పట్టి చూపించు అని సవాలు విసురుతాడు...
దానికి తాత సరే మనవడా ఈ రోజు మధ్యాహ్నమంతా విశ్రాంతి తీసుకుని రాత్రికి మర పడవను సిద్ధం చేసి ఉంచు అని పురమాయిస్తాడు...
ఆరోజు రాత్రికోసం తరుణ్ చాలా ఉత్సుకగా ఎదురుచూస్తూ ఉంటాడు.. రాత్రి రానే వస్తుంది.. తాత మరపడవ లో ఒక డ్రమ్ముడు నూనె నూనె వెలిగించేందుకై ఒక పెద్ద వత్తి తీసుకువెళ్తాడు... తరుణ్ కు ఇవేమీ అర్థంకావడం లేదు.. తాత ఏం చేస్తున్నాడో...
సముద్రంలోని ఒక ప్రశాంత స్థలం లోకి వచ్చిన తర్వాత ఆ పెద్ద డ్రమ్ము పై ఉన్న వత్తిని వెలిగించమని చెప్తాడు తాత... దూరంగా ఒక కొండంత అల కనిపిస్తే మర పడవ ను వెంటనే నడపమని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఒడ్డుకు వచ్చేయమని జాగ్రత్తలు చెప్తాడు.. తాత... అంతే కానీ ఏ చేపను పట్టేదానికి ప్రయత్నించడు.. అయోమయంగానే తలూపాడు తరుణ్... సముద్రాన్ని చూస్తూ నిమిషాలు లెక్క పెడుతున్నారిద్దరూ...
పెద్ద మంటతో డ్రమ్ వెలుగుతూ ఉంటుంది... చాలా సేపటి తర్వాత ప్రశాంతమైన సముద్రం అల్లకల్లోలంగా మారుతుండటం ఒక రాకాసి అల తమ వైపు వస్తుండటం గమనిస్తారు ఇద్దరూ... వెంటనే మర పడవ ప్రారంభించి ఆ అల తమను చేరక ముందే ఒడ్డుకు రావాలనే నియమాన్ని గుర్తుంచుకుని చాలా వేగంగా పడవను నడిపుతూ ఒడ్డుకు వస్తారు... అప్పుడు తాత చెప్తాడు... మనవడా వెళ్ళి నేను చేపను పట్టేసాను వెళ్ళి చూస్కో అని చెప్తాడు...
తరుణ్ ఆశ్చర్యంతో నోరువెళ్ళబెడతాడు.. అవును మరి అక్కడ రెండతస్థుల భవనమంత పేద్ధ చేప ఉంది.. ఒడ్డున... అప్పుడు తెలుస్తుంది తాత గొప్పతనం... వీరి పడవను వెంబడిస్తూ.. వెంబడిస్తూ.. వచ్చింది అల కాదు... ఒక రాకాసి తిమింగలం ...
వేట లో గెలిచిన ఆ చేపను గర్వంగా ఊరి ప్రజలంతా కోసుకుని వండుకుని తిన్నారు.. ఆ మహా వేటగాడి గుర్తుగా ఆ చేపకన్నులను దర్వాజా గా మార్చి... చేపకన్ను దర్వాజాను తయారు చేస్తారు...
ప్రస్తుతం మచిలీపట్నంలో ఉన్న ఈ స్థలం వెనుక ఈ కథ ఇదే నని మా తాతగారు చెప్పారు.. నిజనిజాలు నాకు తెలియవు కానీ కథ నుంచి నేర్చుకున్నదేమంటే... ఎంత పని చేస్తున్నావనేది కాదు ముఖ్యం .. ఎంత అవగాహనతో చేస్తున్నామనేది ముఖ్యం... గొప్ప గొప్ప ప్రయత్నాలన్నిటికి వెనుక అవగాహనతో కూడిన నేర్పు అవసరం
ఫోటోలో కనిపించేది మంగినపూడి బీచ్ ముఖద్వారం...ప్రస్తుతం చేపకన్ను దర్వాజా అనేది ఒక ప్రాంతం పేరు మాత్రమే.. ప్రస్తుతం అక్కడ ఏ కన్నూలేదు...
Post a Comment