జనరల్ అవేర్నెస్:
1. ఈ డ్యాం... ప్రపంచంలోని అతి పొడవైన రెండవ(6,000 km) నది.. యాంగ్జీ పై నిర్మితమైనది (మొదటిది నైలు నది)
2. 1940 లొ తలచినా ఈ ప్రాజెక్టు కార్యాచరణను ప్రారంభించినది మాత్రం...1994 లో...దీనిని పూర్తి చేసినది 2009 లో..
3. 13 నగరాలు, 140 పట్టణాలు, 1,600 పల్లెల పైగా నిరాశ్రయులయ్యారు...ఈ డ్యాం వలన నిరాశ్రయులైన వారు 1.6 to 1.9 మిలియనుల మంది...
4. 2009 తర్వాత ఈ ఆనకట్ట గరిష్ట నీటి మట్టం 185 meters
5. చైనా లోని 22 కౌంటీలు పాక్షికంగా నీట మునిగాయి..80% భూభాగం నీట మునిగింది మాత్రం సిచువాన్ కౌంటీ..(అంటే 80% రాష్ట్రం నీటిలో మునిగిందన్నమాట)
6. దేశానికి చెందిన 25% సారవంతమైన భూమి నీట మునిగింది...
7. నలభై శాతం గ్రామీణ ప్రజలు తమ ఆవాసాలను, భూమి ని కోల్పోయి జీవనోపాధిని కోల్పోవలసి వచ్చింది...
8. ఈ డ్యాం పూర్తి చేయటం వలన దేశ జాతీయ విద్యుత్ శక్తి లో వృద్ధి లోకి వచ్చిన విద్యుత్ శక్తిమిగులుపదిశాతం...
9. డ్యాం కట్టక ముందు వచ్చిన వరదల వలన 3,20,000 మంది చనిపోయారు...
10. డ్యాం కట్టిన తర్వాత ప్రాణ నష్టం తగ్గినట్లేనని భావించినా ...2010లో సంభవించిన వరదలు అపారప్రాణ , ధన నష్టాన్ని మిగిలించింది...
11. డ్యాం కట్టడానికి అయిన ఖర్చు...200-240 బిలియన్ యువాన్లు , = 25 బిలియన్ అమెరికా డాలర్లు...
12. చాలా ఎక్కువ పరిమాణంలో ఒకే ప్రదేశంలో నీటిని నిలువ ఉంచడం వలనచాలా స్వల్ప ప్రమాణంలో భూభ్రమణ వేగం తగ్గుదల ఉందని ఒక వాదన...
ఇన్ని వాదనల మధ్య ప్రతికూల-సానుకూల దృక్పథంతో నిర్మించిన ఈ ఆనకట్ట వలన 1. నీళ్ళు లేని ఉత్తర చైనాకు దక్షిణ చైనానుండి మంచినీటిని తీసుకు వెళ్ళటం సాధ్యమైనది..
2. అతి తక్కువ ఖర్చుతో ఉత్పాదకత సాధ్యమైంది...
3. అందువల్ల సంవత్సరానికి మూడు పంటలు సాధ్యమైనవి...
4. కరెంటు కోతలేకుండా నిరంతరాయ విద్యుత్ ఇవ్వడం సాధ్యమయినది...
5. అందుకే అతి తక్కువ ధరకు మనకు వస్తువులను అందించగలుగుతున్నారు...
మన భారతంలో గంగానదిని కావేరీ నది కి అనుసంధానం చేస్తే మనం కూడా చైనా సాధించిన విజయాలన్నీ సాధించవచ్చు..
Post a Comment