Sunday, 31 August 2014

ఒకరి మనసును గాయ పరచడం సులువు... కానీ గాయపడిన మనసును తిరిగి ఆకట్టుకొనటం కష్టం.. కొన్ని కొన్ని పరిస్థుతులలో దాదాపు అసాధ్యం .. Inspirational moral story

ఒక అబ్బాయి చీటీకీ మాటీకీ తల్లితో పోట్లాడడం ,చెల్లిని కొట్టడం చేస్తుండేవాడు.
తర్వాత తండ్రి అతన్ని కొట్టడం వాళ్ళింట్లో పరిపాటి అయింది.
 తండ్రికి తన కొడుకును ఎలాగైనా మార్చాలి అని అనిపించింది.....
"ఒక రోజు తండ్రి కొట్టడం మాని,ఈ రోజు నుంచి నీకు కోపం వచ్చినప్పుడల్లా ఒక మేకుని ఒక గోడ మీద కొట్టు, తర్వాత ఏమి జరుగుతుందో చెప్పు"అని పొడువైన మేకులున్న డబ్బా,సుత్తి ఇచ్చాడు.
ఆ రోజు నుంచి అబ్బాయి తల్లితో,చెల్లితో పోట్లాడాలనుకున్నప్పుడెల్లా,ఒక మేకుని గోడ మీద కొట్టేవాడు.
అది గట్టి సిమెంటు గొడ కావడంతో కొట్టడానికి చాలా కష్టపడేవాడు.
నెలరోజుల తరవత మేకు కొట్టడం కన్నా కోపం కంట్రోలు చేసుకోవడమే సులువు అనిపించింది.
 కొన్ని రోజుల తర్వాత కోపం తగ్గి పోవడాన్ని గమనించాడు.....
ఆ విషయం తండ్రికి సంతోషంగా చెప్పాడు. 'వెరీ గుడ్....ఇప్పుడు గోడకున్న ఒక మేకుని తీసేయ్,ఇక ముందు నుండి కోపం అదుపు చేసుకున్నప్పుడల్లా ఒక్కో మేకుని తీసేయ్' అన్నాడు.
తీయ్యడం సులువే అనుకోని సరే అన్నాడు.
3 నెలలకు మొత్తం మేకులన్నీ తీసేసి తండ్రికి సంతోషంగా చెప్పాడు.
తండ్రి నవ్వుతూ "వెరీ గుడ్....కానీ ఈ గోడ మీద మేకులు చేసిన రంధ్రాలు చూశావా?అవి పూడ్చడం మాములు విషయం కాదు.నువ్వు కూడా అలాగే అమ్మ,చెల్లి మనసు గాయపర్చావు" అన్నాడు.
చూడు బాబూ!! ఒకరి మనసును గాయ పరచడం సులువు... కానీ గాయపడిన మనసును తిరిగి ఆకట్టుకొనటం కష్టం.. కొన్ని కొన్ని పరిస్థుతులలో దాదాపు అసాధ్యం అని పిల్లవాడికి హితబోధ చేస్తాడు..... ఆ పిల్లవాడు క్షమించమని చెప్పి పద్ధతి మార్చుకున్నాడు.

Post a Comment

Whatsapp Button works on Mobile Device only