ఒకానొక కాలంలో ఒక వూరిలో రంగయ్య అతని కుటుంబం నివసిస్తున్నారు....
రంగయ్య ఒక్కగానొక్క కూతురి పెళ్లి చేసి అత్త వారింటికి పంపించి వేసాడు...
అక్కడ తను పడే కష్టాలను రోజు తన తండ్రికి ఏకరువు పెడుతూ వుండేది...
ఒక సారి విసిగి విసిగి వేసారి.. తను పుట్టింటికి వచేస్తుంది.... వచ్చి తన తండ్రిని నిలదీస్తుంది ..
ఏమిటి నీవు నన్ను పట్టించుకోవట్లేదని... దానికి రంగయ్య నిర్లిప్తంగా నవ్వి నేను చెప్పినట్లు చెయ్యి..
అని 3 పాత్రలను తీసుకొని ఒక దానిలో కోడిగుడ్డు, 2వ దానిలో బంగాళా దుంప... 3వ దానిలో కాఫీ పౌడర్ వేయమని చెప్పాడు.... కూతురు ఎంతో అసహనంగా తండ్రి చెప్పినదంతా చేసింది... ఒక 5 నిమిషాలు వాటిని కాచిన తర్వాత... రంగయ్య ఆ పాత్రలలో ఉన్న పదార్దాన్ని స్పృశించి నీవు ఏమి గమనించావు అని అడిగాడు... అపుడు కూతురు... బంగాళా దుంప మెత్తగా ఉడికింది... కోడిగుడ్డు లోపలిది గట్టిగ అయింది... కాఫీ మంచి సువాసనతో తయారయింది.. అని చెప్పింది...
దీనికి తండ్రి... ఒకే పాత్ర ఒకే నీరు(మన జీవితాల లాంటివి)........
3 పదార్ధాలు వేర్వేరు మనుష్యులు...
ఒకే సమస్యని ఈ మూడు పదార్ధాలు వేర్వేరు విధాలుగ స్పందించాయి.....
ఒకటి వాస్తవంగా గట్టిగ వున్నది (బంగాళా దుంప) కూడా పరీక్ష లో మెత్త బడి పోయింది...
బయటకు గట్టిగ వుండి (కోడిగుడ్డు) లోపల ద్రవంగా ఉన్నది...
కూడా పరీక్ష వచ్చే సరికి గట్టి పడిపోయింది...
అద్భుతమేమంటే తను తన స్థితిని కోల్పోవడమే కాక...
తనను తీసుకున్న దాని స్థితిని కూడా మార్చి ...ఒక అద్భుత రుచిగల ద్రావకంగా మార్చింది కాఫీ పౌడర్ ...
అంటే మన ప్రతి సమస్య ఒక గొప్ప అద్భుతమైన పరిష్కారాన్ని కనుగొనేవిధంగా సమస్య తర్వాత మనను ఒక అద్భుతమైన వ్యక్తిగా తీర్చిదిద్దేందుకై భగవంతుడు ప్రయత్నిస్తుంటాడు...
ఈ మూడింటిలో నీవు ఏమి అనేది తెలుసుకో అపుడు నీ సమస్యనుండి చాల సులువుగా బయట పడవచు అని సలహా ఇస్తాడు రామయ్య...
నీతి: మన చుట్టూ సమస్యలేపుడూ ఉంటూనే ఉంటాయి.. అవి మనలో ఏ ప్రభావాన్ని కలిగిస్తున్నాయి అనేది మనకు తెలిస్తే... వాటి పట్ల మన ప్రవర్తనను సరిచేసుకునే వీలుంటుంది... ప్రతి సమస్య మనలో కొత్త కోణాలను వెలికి తీయగాలగాలి.... కొత్త పరిష్కారాలను అన్వేషించ గలగాలి... అపుడు మనం అన్నివిధాలుగా సమర్ధులం కాగలం... అందుకే ప్రతి సమస్య మనను ఎదిగేలా చేస్తుంది...
చివరగా ప్రతి పరాజయానికి, ప్రతి heart failure కు, ప్రతి నష్టానికి మూల బీజమేదో ఉండే ఉంటుంది... దానిని మనం గనుక పట్టుకోగలిగితే మనని పట్టుకునే వారు ఉండరు... సంతోషమనేది వెదికే వస్తువు కాదు... అది ఎక్కడో లేదు... మనలోనే ఉంటుంది... మనతోనే ఉంటుంది... మన ఆలోచనలలోనే ఉంటుంది...
Post a Comment