పెళ్ళి అయిన తర్వాత అరుంధతి నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారు??
అరుంధతి,ద్రవ,సప్త ఋషి నక్షత్రాలు ఎలా గుర్తుపట్టాలి?
హిందూ వివాహ వేడుకలలో అరుంధతీ నక్షత్రం, వసిష్ఠ నక్షత్రాలకున్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు...
ప్రతి వివాహ అనంతరం ఈ ఈనక్షత్రాలను తప్పనిసరిగా చూపిస్తారు...
దీనిలో సాంస్కృతిక పరమార్ధం ఆ దంపతులలాగా చిరకాలం లోకానికి ఆదర్శ దంపతులలా వెలుగొందాలనే ..
ఇంక సైన్సు పరంగా దీనిని చూస్తే...
అరుంధతి నక్షత్రాన్ని ఆధారంగా చేసుకునే మనం ధృవనక్షత్రాన్ని(polestar) గుర్తిస్తాం...
దీనినే ఆంగ్లములో polestar అంటారు...
ఎందుకంటే దీనిని ఆధారంగా చేసుకొనే మనం దిక్కులను కనిపెట్టవచు....
మనం భౌగోళికంగా ఎక్కడ ఉన్నా సరే... ఈ polestar ఎప్పుడూ ఉత్తర దిశనే సూచిస్తుంది...
దీనిని ఆధారంగా చేసుకునే పూర్వం నావికులు సముద్రయానం చేసేవారట...
మన మిలిటరీ లో దీని ప్రాముఖ్యత... ఎంతో ఉంది...
ఇక పోతే పెళ్ళిలో ఈ నక్షత్రం వరుడికి కానీ వధువుకు కానీ చూపించేది ఎందుకంటే దిక్కులు తెలుసుకొని గుర్తులు పెట్టుకుని మనం ఎక్కడున్నామో... తెలిపే ప్రయత్నం ఇందులో ఉంది...
ఒకవేళ ఆయానక్షత్రాలు ఎవరికైనా కనపడలేదనుకోండి.. వారికి దృష్టిలో లోపమున్నదనే విషయం బయటకు వచ్చేది... ఇంత వైజ్ఞానిక విషయాలున్నాయి ఈ సాంప్రదాయంలో.....
అరుంధతి దేవి జన్మ వృత్తాంతము.. వసిష్ట అరుంధతిల వివాహం..
మరియు వారు నక్షత్రాలుగా ఎలా మారారు అనే వృత్తాంతము తెలుసుకోవాలని ఉంటే క్రింది లింకు చూడండి:
అరుంధతి దేవి జన్మ వృత్తాంతము.. వసిష్ట అరుంధతిల వివాహం.. మరియు వారు నక్షత్రాలుగా ఎలా మారారు
pole star always points north means that the couple should cultivate moksha saadhaanas during their married life..
ReplyDeletethankyou sir,
Delete