ఉడతాభక్తి సహాయం అనే నానుడి ఎలా వచ్చింది???
ఉడుత శరీరంపై గల చారలు ఏర్పడిన కథ::
శ్రీరాముల వారు వారధి నిర్మించడం మొదలు పెడతారు... వానర వీరులు అంతా తలా ఒక చేయి వేసి తమ వంతు సహాయం చేస్తున్నారు... ఇంతలో ఒక ఉడుత అక్కడికి వచ్చి తాను కూడా ఆ మహా కార్యంలో పాల్గొనాలని ప్రయత్నించింది... తానేమి చేయగలనో అని నిరుత్సాహ పడకుండా తన శరీరాన్ని తడుపుకుని దానికి ఇసుక అంటించుకుని సేతువు ను కట్టేందుకు ఉపయోగించే రాళ్ళ మధ్య వేసే బంధానికి ఉపయోగ పడేలా తనకు వీలైనంత సాయం చేయడం ప్రారంభించింది... అలా చాలా సేపు చేయసాగింది... ఇదంతా గమనించిన శ్రీరాముల వారు దాని మీద ప్రేమతో దాని శరీరాన్ని నిమిరాడట... దానికే ఉడుత శరీరాన్ని గమనిస్తే శ్రీరాముని మూడు వ్రేళ్ళ చారలు ఉంటాయి... ఇవి శ్రీ రాముల వారి కరస్పర్శతో ఏర్పడినవంటారు... ఇక్కడ ఉడుత భక్తితో చేసిన ఆ సాయాన్ని... ఉడుతా భక్తి సహాయం అంటారు.. అంటే చేసే కొద్ది సాయమైనా మనస్ఫూర్తిగా చేయాలని ఇక్కడ ఉద్దేశ్యం!!!
Post a Comment